వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు .. గత 24 గంటల్లో 13,993 కొత్త కేసులు ,101 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గినా మళ్లీ మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర ,కేరళ రాష్ట్రాలలో విపరీతంగా కరోనా కేసులు నమోదు నేపధ్యంలో మరోమారు దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక భారతదేశంలో గత 24 గంటల్లో 13,993 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, దేశం యొక్క క్రియాశీల కాసేలోడ్ మళ్లీ 1, 43,127 కు పెరిగింది.

పతంజలి కరోనిల్ కరోనా సహాయక మెడిసిన్ గా ప్రకటించిన యోగా గురు రాందేవ్ బాబాపతంజలి కరోనిల్ కరోనా సహాయక మెడిసిన్ గా ప్రకటించిన యోగా గురు రాందేవ్ బాబా

 గత 24 గంటల్లో 101 మరణాలు, మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387

గత 24 గంటల్లో 101 మరణాలు, మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387

గత 24 గంటల్లో 3,585 కు పెరిగిన క్రియాశీల కేసులు దేశంలో మొత్తం సానుకూల కేసులలో 1.30% ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య దేశంలో 1,56,212 కు పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 101 మరణాలు సంభవించాయని మంత్రిత్వ శాఖ డేటా చూపించింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశం యొక్క మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387 గా ఉంది.

 క్రియాశీల కోవిడ్ -19 కేసులు 1,43,127

క్రియాశీల కోవిడ్ -19 కేసులు 1,43,127

క్రియాశీల కోవిడ్ -19 కాసేలోడ్ మళ్లీ 1,43,127 కు పెరిగింది. ఇదే సమయంలో ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులకు అందించే కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 1, 04,49,942 కు చేరుకుంది. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్లలో ఇప్పటివరకు అత్యధికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది.వ్యాక్సిన్ కు ఇప్పటివరకు సానుకూల పహలిటాలే అధికంగా వచ్చాయి.

వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఫ్రంట్ లైన్ కార్మికులకు మంత్రి హర్ష వర్ధన్ పిలుపు

వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఫ్రంట్ లైన్ కార్మికులకు మంత్రి హర్ష వర్ధన్ పిలుపు

టీకా తీసుకోవడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని వైద్యులు, నర్సులు, పారామెడికల్ కార్మికులు, ఫ్రంట్‌లైన్ కార్మికులందరికీ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ విజ్ఞప్తి చేశారు.కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాడటానికి మనమందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు . ప్రపంచం వ్యాధి నుండి విముక్తి పొందలేదని చెప్పిన ఆయన మనందరి సమిష్టి కృషితోనే ఈ ప్రజారోగ్య సవాలును అధిగమించగలమని మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు.

English summary
With 13,993 fresh cases, India's COVID-19 tally has climbed to 1,09,77,387, The death count due to the viral disease has gone up to 1,56,212 in the country with 101 more fatalities reported in a 24-hour period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X