వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona Lockdown: కరోనా కాదు, వంద వైరస్ లు వచ్చినా ఏం చెయ్యలేవు, గాలి జనార్దన్ రెడ్డి, భూమాత !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా దెబ్బకు భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో వాహన సంచారం లేక ప్రజలు దాదాపుగా వారి ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే కరోనా వైరస్ కాదు ఇలాంటి వైరస్ లు వంద వచ్చినా మనల్ని ఈ భూమాత కాపాడుతుందని, ఆ శక్తి ఈ భూదేవికి ఉందని, ఎవ్వరూ భయపడనవసరం లేదని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (ఏప్రిల్ 22వ తేదీ) సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి మరోసారి తెరమీదకు వచ్చారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రీ (భూమాత) దినోత్సవం. ఇదే రోజు లెనిన్ జయంతి. 1970వ సంవత్సరంలో మొట్ట మొదట అమెరికాలో ఏప్రిల్ 22వ తేదీన ధరిత్రీ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఆనవాయితీగా జరుపుకుంటున్నారు. భూగోళాన్ని భద్రంగా భావితరాలకు అందించడం ఎలా అనే అంశంపై అనేక కార్యక్రమాలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొన్ని రోజుల పాటు నిర్వహిస్తున్నారు.

తెరమీదకు గాలి జనార్దన్ రెడ్డి

తెరమీదకు గాలి జనార్దన్ రెడ్డి

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్బంగా కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డి మరోసారి తెరమీదకు వచ్చి ప్రజలకు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే ఏప్రిల్ 22వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి కన్నడిగులు, తెలుగు ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా అయన అభిమానులకు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్బంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు.

వంద కరోనా వైరస్ లు వచ్చినా !

వంద కరోనా వైరస్ లు వచ్చినా !

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాధితో పోరాటం చేస్తున్నారని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, ఇలాంటి కరోనా వైరస్ లు వంద వచ్చినా ఎవ్వరూ భయపడనవసరం లేదని, మనకు మన భూమాత అండగా ఉందని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెప్పారు.

కరోనాతో పోరాటం చేద్దాం !

కరోనాతో పోరాటం చేద్దాం !

మనం ధైర్యంగా ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ ఇళ్లలో ఉంటూ ధైర్యంగా కరోనా వైరస్ తో పోరాటం చేద్దామని కర్ణాటక మాజీ మంత్రి దేశ ప్రజలకు మనవి చేశారు. ఇలాంటి వైరస్ లు భూమి మీద బతనివ్వకూడదని, వాటిని నాశనం చేసే శక్తి మానవుడికి ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

Recommended Video

Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits
కలిసిఉంటే కలదుసుఖం

కలిసిఉంటే కలదుసుఖం

మన భూమి, నదీ జలాలు, పరిస ప్రాంతాలను మనం అందరూ కలిసి కాపాడుకోవాలని, ఈ భూమి మీద ప్రతిజీవి బతకడానికి మనం అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రజలకు మనవి చేశారు. భూమాతను గౌరవించే ప్రతిఒక్కరి దరిదాపులకు ఇలాంటి వైరస్ లు రావని, మనం జాగ్రత్తగా ఉంటూనే కరోనా మహమ్మారిని తరిమికొడదామని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మనం అందరూ ప్రభుత్వాలు చెప్పిన మాటలను గౌరవిస్తూ ముందుకు వెళితే మనకు కావలసిన వారితో సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

English summary
Coronavirus Lockdown: Karnataka formeer minister Gali Janardhana Reddy wishes one and all on the occasion of World Earth Day(April 22).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X