వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్ పొడగింపే! ఇక మునుపటిలా ఉండదు: కరోనా కట్టడిపై తేల్చేసిన నరేంద్ర మోడీ

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అఖిలపక్షానికి ప్రధాని బుధవారం వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్య నేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

కరోనా లాక్‌డౌన్ పొడగింపు: అదే ఆలోచనలో ఉన్నామంటూ కిషన్ రెడ్డికరోనా లాక్‌డౌన్ పొడగింపు: అదే ఆలోచనలో ఉన్నామంటూ కిషన్ రెడ్డి

కరోనాపై కట్టడి చర్యలు.. పార్టీల నేతలు ఇలా..

కరోనాపై కట్టడి చర్యలు.. పార్టీల నేతలు ఇలా..

వైరస్ కట్టడికి, లాక్‌డౌన్ వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కేంద్ర వైద్యారోగ్య శాఖ, హోంమంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పార్టీ నేతలకు వివరించారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి(పీపీఈ) కొరత గురించి పార్టీల నేతలు ప్రశ్నలు సంధించారు. అంతేగాక, పార్లమెంటు నూతన భవన నిర్మాణ పనులను ఆపేయాలని మరికొందరు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

లాక్‌డౌన్ పొడగింపే..

లాక్‌డౌన్ పొడగింపే..

కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాన్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక మార్పులు చాలా జరగాల్సివుందని ప్రధాని వివరించినట్లు తెలిసింది.

ఇక కరోనాకు ముందులా ఉండదు..

ఇక కరోనాకు ముందులా ఉండదు..

కరోనావైరస్ తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ప్రధాని తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్లుగా ఉంటుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి గులాంనబీ ఆజాద్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, టీఆర్ఎస్ నుంచి కే కేశవరావు, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీష్ మిశ్రా, ఎల్జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, శిరోమణీ అకాలీదళ్ నుంచి సుఖ్బీర్ సింగ్ బాదల్, జేడీయూ నుంచి రాజీవ్ రంజన్ సింగ్, బీజూ జనతాదళ్ నుంచి పినాకి మిశ్రా, శివసేన నుంచి సంజయ్ రౌత్, టీఎంసీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ హాజరయ్యారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 5194 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 402 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Recommended Video

Lockdown Extension: Hyderabd Public Reaction On Modi Decision | Oneindia Telugu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X