బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Lockdown:హోమ్ మంత్రికి సినిమా చూపించిన పోలీసులు, ఎవరు నువ్వు? ఎక్కడికి?!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల అనవసరంగా రోడ్ల మీద సంచరిస్తున్న వారి మీద కేసులు నమోదు చేసి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు . అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్బంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి ? అని పరిశీలించడానికి వెళ్లిన ఓ రాష్ట్రం హోమ్ మంత్రికి పోలీసులు సినిమా చూపించారు. నువ్వు ఎవరు ? ఎక్కడికి వెలుతున్నావ్ ?, మీరు ఏం చేస్తుంటారు ?, లాక్ డౌన్ లో బయట ఏం పని ? అంటూ పోలీసులు పలు ప్రశ్నలు వేసి ఆయనకు సినిమా చూపించారు. ఇదే సమయంలో బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్, బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకొని ఆయన హోమ్ మంత్రి అని పోలీసులకు చెప్పారు. పోలీసుల ప్రశ్నలతో హోమ్ శాఖా మంత్రికి దిమ్మతిరిగి షాక్ కు గురైనారు.

Lockdown lovers,భలే చాన్స్, ఎస్కేప్, పెళ్లికి కోర్టు గ్రీన్ సిగ్నల్,పోలీసులకు చిర్రెత్తి,కేసు పెట్టిLockdown lovers,భలే చాన్స్, ఎస్కేప్, పెళ్లికి కోర్టు గ్రీన్ సిగ్నల్,పోలీసులకు చిర్రెత్తి,కేసు పెట్టి

కర్ణాటక హోమ్ మంత్రి

కర్ణాటక హోమ్ మంత్రి

కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటకలో కరోనా లాక్ డౌన్ నియమాలను ప్రజలు ఎలా పాటిస్తున్నారు అంటూ బెంగళూరు నగరం, బెంగళూరు గ్రామీణ ప్రాంతాలను పరిశీలించడానికి రౌండ్స్ వెళ్లారు. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యంటించిన హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ స్థానిక పోలీసుల నుంచి వివరాలు సేకరించారు.

కర్ణాటక-తమిళనాడు బార్డర్

కర్ణాటక-తమిళనాడు బార్డర్

కర్ణాటక- తమిళనాడు సరిహద్దు (బెంగళూరు గ్రామీణ జిల్లా)లోని అత్తిబెలె వరకు హోమ్ మంత్రి బసరాజ్ బోమ్మయ్ వెళ్లారు. ఆ సమయంలో అక్కడి పోలీసులు హోమ్ మంత్రి బసవరాజ్ వెలుతున్న కారును నిలిపారు. అయితే కారులో ఎవరు ఉన్నారు అనే విషయాన్ని అక్కడ ఉన్న పోలీసులు గుర్తించలేకపోయారు.

మీరెవరు ? ఎక్కడికి వెలుతున్నారు

మీరెవరు ? ఎక్కడికి వెలుతున్నారు

హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కారు నిలిపిన పోలీసులు ఆయన్ను ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టారు. ఎవరు మీరు ? ఎక్కడికి వెలుతున్నారు ? కరోనా లాక్ డౌన్ నియమాలు అమలులో ఉన్నాయని మీకు తెలీదా ? కారు ఉంది కాదా అని పోలో అంటూ రోడ్ల మీదకు వచ్చేస్తారా ? అంటూ పోలీసులు ప్రశ్నించడంతో హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ షాక్ కు గురైనారు.

అయ్యా ఆయన హోమ్ మంత్రి !

అయ్యా ఆయన హోమ్ మంత్రి !

హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వెనుక సిగ్నల్ పడి అక్కడే నిలిచిపోయి ఆలస్యంగా బార్డర్ చెక్ పోస్టు దగ్గరకు వెళ్లిన బెంగళూరు సిటీ పోలీసుల కమిషనర్ భాస్కర్ రావ్, బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ రవి. డి. చెన్నణ్ణవర్ పోలీసులను పక్కకు పిలిచి బాబు ఆయన హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అని చెప్పడంతో అక్కడి పోలీసులు కంగుతిన్నారు.

 అసలు ఏం జరిగిందంటే ?

అసలు ఏం జరిగిందంటే ?

హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వ వాహనం ఇంటి దగ్గర వదిలిపెట్టి ప్రవేట్ వాహనంలో బయటకు వెళ్లారు. అంతే కాకుండా హోమ్ మంత్రి యువకుడిలాగా టీ షర్టు వేసుకోవడం, పక్కన ఆయన గన్ మెన్ లు, పీఏలు ఎవ్వరూ లేకపోవడంతో ఇంత జరిగింది. అసలు హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కారు నిలిపి ఆయన్ను ప్రశ్నించింది తమిళనాడు పోలీసులు అని, వారు కర్ణాటక పోలీసులు కాదని సీనియర్ పోలీసు అధికారులు పైకి అంటున్నారు.

మంత్రికి సినిమా చూపించిన పోలీసులు

మంత్రికి సినిమా చూపించిన పోలీసులు

కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ గురించి ప్రజలకు చాలా తక్కువ తెలుసని. ఆయన్ను చాలా మంది గుర్తు పట్టలేరని స్వయంగా కన్నడిగులు అంటున్నారు. మొత్తం మీద లాక్ డౌన్ సందర్బంగా కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి పోలీసులు సినిమా చూపిస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి.

English summary
Coronavirus Lockdown: Police stopped Karnataka Home Minister Basavaraj Bommai car in Karnataka - Tamil Nadu border in Attibele in the time of lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X