వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్‌డౌన్: నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేంద్రం మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.

రెండేళ్లు జైలుకే..

రెండేళ్లు జైలుకే..

ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సూచిస్తూ జాబితాను రాష్ట్రాలకు పంపారు. లాక్‌డౌన్‌ అమలును ఉల్లంఘించేవారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని, ఈ మేరకు నిబంధనలను రాష్ట్రాలకు తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.

9వేల మంది క్వారంటైన్...

9వేల మంది క్వారంటైన్...

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 51 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా ఢిల్లీ తబ్లీఘీ జమాత్‌లో పాల్గొన్న 9000 మందిని క్వారంటైన్ చేసినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శ పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. తబ్లీఘీలో పాల్గొన్నవారి సంబంధీకులు సైతం నిర్భంధంలోనే ఉన్నారని చెప్పారు.

తీవ్రంగా శ్రమించి వారందర్నీ క్వారంటైన్ చేశాం..

తీవ్రంగా శ్రమించి వారందర్నీ క్వారంటైన్ చేశాం..

ఢిల్లీకి చెందిన 2వే లమందికి గానూ 1804 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు శ్రీవాస్తవ తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపించిన 334 మందిని వివిధ ఆస్పత్రుల్లో చేర్చామని వెల్లడించారు. ఢిల్లీకి చెందినవారిలో 250 మంది విదేశీయులు ఉన్నారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమించి 9వేల మందిని క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 1306 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోందని, ఉల్లంఘించినవారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని హెచ్చరించారు.

Recommended Video

Sonia Gandhi:'Modi Has No Planning For Present Situation'
ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్త.. చర్యలు తీసుకుంటాం

ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్త.. చర్యలు తీసుకుంటాం


కరోనావైరస్ పై నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయని, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నకిలీ వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కరోనాపై వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్ సైట్ ను సందర్శించవచ్చని తెలిపారు. వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు [email protected]కు వివరాలు పంపవచ్చని వెల్లడించారు.

English summary
The government on Thursday directed states and Union Territories to book under relevant provisions of the Indian Penal Code and the Disaster Management Act, 2005 people who violate lockdown rules or make false claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X