• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Corona Lockdown: భార్య పుట్టింటిలో లాక్, భలే చాన్స్ చిక్కిందని భర్త మాజీ ప్రియురాలితో, కామంతో !

|

పాట్నా/ పాలిగంజ్: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అక్కడక్కడా భలే విడ్డూరం సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుట్టింటికి వెళ్లిన భార్య లాక్ డౌన్ లో చిక్కుకుపోవడంతో ఆమెను వెంటనే ఇంటికి రావాలని భర్త చెప్పాడు. అయితే అత్తారింటికి వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో ఆమె భర్త దగ్గరకు వెళ్లలేకపోయింది. కామంతో రగిలిపోతున్న భర్త ఇదే మంచి చాన్స్ అంటూ తన మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకుని నేడు కటకటాలపాలైనాడు.

14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!

కొన్ని నెలల క్రితం పెళ్లి

కొన్ని నెలల క్రితం పెళ్లి

బీహార్ లోని పాలిగంజ్ కు చెందిన ధీరజ్ కుమార్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం దుల్ హిన్ బజార్ లో నివాసం ఉంటున్న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తరువాత ధీరజ్ కుమార్ భార్యతో లక్షణంగా కాపురం చేశాడు. ధీరజ్ కుమార్ దంపతుల జంట చూడముచ్చటగా ఉందని వారి కుటుంబ సభ్యులు, బంధువులు భావించారు.

పుట్టింటికి వెళ్లి లాక్ డౌన్ లో లాక్ !

పుట్టింటికి వెళ్లి లాక్ డౌన్ లో లాక్ !

నెల రోజుల క్రితం ధీరజ్ కుమార్ భార్య పుట్టింటికి వెళ్లింది. ధీరజ్ కుమార్ స్వయంగా భార్యను దుల్ హిన్ బజార్ లోని ఆమె పుట్టింటిలో వదిలి పెట్టి తరువాత అతను పాలిగంజ్ లోని ఇంటికి చేరుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిన తరువాత కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించడంతో దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు.

వస్తావా ? అక్కడే చస్తావా

వస్తావా ? అక్కడే చస్తావా

లాక్ డౌన్ అమలు చేసిన తరువాత అనేక సార్లు భార్యకు ఫోన్ చేసిన ధీరజ్ కుమార్ నువ్వు వెంటనే ఇంటికి రావాలని, ఇక్కడ తనకు ఇబ్బందిగా ఉందని చెప్పాడు. లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించడంతో భార్య అయోమయానికి గురైయ్యింది. నువ్వు మర్యాదగా వస్తావా ? లేదా నీ పుట్టింటిలోనే చస్తావా ? అంటూ ధీరజ్ కుమార్ భార్యను బెదిరించడం మొదలు పెట్టాడు.

ఏం చెయ్యాలి దేవుడా !

ఏం చెయ్యాలి దేవుడా !

భర్త ధీరజ్ కుమార్ పదేపదే ఫోన్లు చేసి ఇంటికి రావాలని చెప్పడంతో దుల్ హిన్ బజార్ లోని పుట్టింటిలో చిక్కుకున్న భార్య పాలిగంజ్ చేరుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో భార్య సతమతం అయ్యింది. తెలిసిన బంధువు ఒకరు బైక్ లో ఆమెను పాలిగంజ్ లోని భర్త ధీరజ్ కుమార్ ఇంటి దగ్గర వదిలి పెట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు.

మాజీ లవర్ తో పెళ్లికి భలే చాన్స్ చిక్కింది

మాజీ లవర్ తో పెళ్లికి భలే చాన్స్ చిక్కింది

ధీరజ్ కుమార్ కు పెళ్లికి ముందే ఓ ప్రియురాలు ఉండేది. పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకున్న ధీరజ్ కుమార్ ప్రియురాలికి దూరం అయ్యాడు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో భార్య పుట్టింటిలో చిక్కుకుపోవడంతో కామంతో రగిలిపోతున్న ధీరజ్ కుమార్ మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని, భార్యకు విడాకులు ఇచ్చేయాలని నిర్ణయించాడు.

దెబ్బకు బెండ్ తీసిన పోలీసులు

దెబ్బకు బెండ్ తీసిన పోలీసులు

భార్యకు తెలీకుండా రెండు రోజుల క్రితం ధీరజ్ కుమార్ ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం దుల్ హిన్ బజార్ లో నివాసం ఉంటున్న భార్యకు తెలిసిపోయింది. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న భర్త ధీరజ్ కుమార్ మీద భార్య స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. లాక్ డౌన్ లో చిక్కుకున్న భార్యను పదేపదే ఇంటికి రమ్మని ఒత్తిడి చెయ్యడమే కాకుండా మాజీ ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న పోలీసులు ధీరజ్ కుమార్ ను అరెస్టు చేసి బెండ్ తీశారు.

  Fake News Buster : 08 80 మంది రేడియో జాకీల జాబ్స్ తీసేసిన FM గోల్డ్ ?
  ఇదో వింత కేసు

  ఇదో వింత కేసు

  బీహార్ లో భార్య పుట్టింటి నుంచి ఇంటికి రాలేదని ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడని వెలుగు చూసింది. అయితే ఉత్తరప్రదేశ్ లో మరో విచిత్రమైన సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నివాసం ఉంటున్న భర్త తన భార్య లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి పదేపదే సమీపంలోని పుట్టింటికి వెళ్లి వస్తోందని, ఎక్కడ మాకు కరోనా వైరస్ సోకుందో అనే భయంగా ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిని అడ్డుకుని విసిగిపోతున్న పోలీసులకు ఇలాంటి కేసులు మరో తలనొప్పిగా తయారౌతున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

  English summary
  Coronavirus Lockdown: A married man was taken into custody in Bihar as he made a decision to marry his ex-girlfriend. The incident happened in Bihar’s Paliganj. A few months ago, local resident Dheeraj Kumar got married. Before the announcement of nationwide lockdown because of the coronavirus, Dheeraj’s wife had gone to her parents house in Dulhin Bazar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X