• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కొత్త కేసులు .. గత 24 గంటల్లో 38,792 కేసులు, 624 మరణాలు

|

దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో
38,792 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే కాలంలో 624 కొత్త మరణాలు సంభవించడంతో, మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 4,11,408 గా ఉందని తెలుస్తుంది . గత 24 గంటల్లో దేశంలో 41,000 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు . దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,01,04,720 కు చేరుకుంది.

ఢిల్లీలో కోవిషీల్డ్ నో స్టాక్ .. చాలా వ్యాక్సిన్ కేంద్రాలు షట్ డౌన్, కేంద్రానికి మనీష్ సిసోడియా ప్రశ్న !!ఢిల్లీలో కోవిషీల్డ్ నో స్టాక్ .. చాలా వ్యాక్సిన్ కేంద్రాలు షట్ డౌన్, కేంద్రానికి మనీష్ సిసోడియా ప్రశ్న !!

క్రియాశీల కేసుల సంఖ్య 4,29,946 కు పడిపోయింది. ఇది భారతదేశం యొక్క మొత్తం కేసులలో 1.40 శాతంగా ఉంది. నిన్న 31,443 కొత్త కేసులు నమోదు కాగా ఈ ఈరోజు కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో దేశం ఆందోళన చెందుతోంది. బుధవారం మరణాల సంఖ్య మంగళవారం కంటే 1,396 తక్కువ నమోదు కావడం కాస్త ఊరటనిచ్చింది. అయితే మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల డేటా దిద్దుబాటు కారణంగా నిన్న మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే.

 Corona new cases rising again in India .. 38,792 cases, 624 deaths in last 24 hours

దేశంలో కోవిడ్ -19 కోసం ఇప్పటివరకు 43,59,73,639 మందికి పరీక్షలు నిర్వహించామని, వీటిలో 19,15,501 పరీక్షలు గత 24 గంటల్లో చేశామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాలలో పర్యాటకుల రద్దీపై ప్రసంగించారు. ఇది సరైంది కాదని హిల్ స్టేషన్లు మరియు మార్కెట్లలో మాస్కులు లేకుండా లేదా ప్రోటోకాల్స్ పాటించకుండానే వచ్చే జనసమూహం వలన కరోనా ఆందోళన మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్రలలో సగానికిపైగా నమోదవడం గమనార్హం. కరోనా కేసులు ఉధృతికి అడ్డుకట్ట వేయడం కోసం కేరళ , మహారాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. భారతదేశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటివరకు 38.5 మిలియన్లకు మించిందని, 3,410,974 కోవిడ్ -19 వ్యాక్సిన్ లు మంగళవారం రాత్రి 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించబడ్డాయి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ముఖ్యంగా, ఈ ఏడాది జనవరి 16 న భారతదేశం తన దేశవ్యాప్త టీకా డ్రైవ్‌ను ప్రారంభించగా, ప్రజలందరికీ కేంద్రం ప్రకటించిన ఉచిత టీకా కార్యక్రమం జూన్ 21 న ప్రారంభమైంది.ఏది ఏమైనా కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది అని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉంది.

English summary
India recorded 38,792 new Covid-19 cases in the last 24 hours, which took the cumulative infection tally in the country to 30,946,074, according to the Union health ministry's bulletin on Wednesday morning. With 624 new fatalities reported in the same period, the death toll now stands at 411,408, according to the ministry's update at 8am. The country also saw 41,000 people getting discharged from the hospitals, after which the total number of recoveries reached 30,104,720.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X