వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కొత్త ట్విస్ట్.!సోకగానే తెలియదట.!కొన్ని రోజులు ఒంట్లో మగ్గిన తర్వాత నిర్ధారణ అవుతుందట.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భూమ్మీద అందమైన ప్రకృతి ఏర్పడ్డట్టే ప్రమాదకర ప్రాణులు కూడా సృష్టించబడ్డాయి. అందులో కొన్ని కంటికి కనబడితే మరికొన్న కంటికి ఏమాత్రం కనబడకుండా మునుషులకు హానీ తలపెడుతుంటాయి. పెద్ద పెద్ద ప్రాణాంతక జంతువులతో ప్రత్యక్ష్యంగా పోరాటం చేసి మచ్చిక చేసుకున్న మానవుడు కనిపించని సూక్ష్మరూపంలో ఉండే ప్రాణాంతక క్రిమి పట్ల గజగజా వణికిపోతున్నాడు. అదే మహమ్మారిలా పరిణమించి ప్రపంచ దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల రోజుకో ప్రమాదకర అంశం వెలుగులోకి వస్తోంది.

మాయదారి కరోనా .. మహమ్మరి వైరస్ తో ఎంతొ ప్రమాదం..

మాయదారి కరోనా .. మహమ్మరి వైరస్ తో ఎంతొ ప్రమాదం..

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా గురించి గతంలో ఆసక్తికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ మనిషి జ్ఞానేంద్రియాల మీద దారుణంగా పనిచేయడంతో పాటు వటిని ఎందుకు పనికి రాకుండా చేస్తుందట ఈ వైరస్. అంతే కాకుండా కరోనా వైరస్ బారిన పడ్డ వ్యక్తి ముందుగా వాసన చూసే జ్ఞానంతో పాటు రుచి చూసే తత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్టు ఇటీవల చేసిన కొన్ని ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి. అంతే మానవుల్లోని ముఖభాగాలకు సంబంధిచిన అవయవాలపైన దీని ప్రభావాన్ని చూపించిన తర్వాత మిగతా అవయవాలను ఈ వైరస్ నిర్వీర్యం చేసే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.

టెస్టు చేయగానే బయటపడని రోగం.. కొన్ని రోజుల తర్వాత నిర్దారణ అవుతున్న కరోనా..

టెస్టు చేయగానే బయటపడని రోగం.. కొన్ని రోజుల తర్వాత నిర్దారణ అవుతున్న కరోనా..

ఇదిలా ఉండగా కరోనా వైరస్ పట్ల మానవాళి జీర్ణించుకోలేని కొన్ని వాస్తవాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌ సోకిన తొలి రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి ఏమాత్రం సోకనట్లు తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. లక్షణాలు కనిపించాక మూడు రోజులకు పరీక్షలు చేయడం ఎంతో ఉత్తమమని వారు చేసిన అధ్యయనం నిరూపించిందని స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో పదమూడు వందల ముప్పై మంది రోగుల నమూనాలను లోతుగా పరీక్షించినట్టు స్పస్టం చేస్తున్నారు.

వైరస్ తో సహజీవనమే.. ప్రమాదపు అంచున మానవాళి..

వైరస్ తో సహజీవనమే.. ప్రమాదపు అంచున మానవాళి..

అంతే కాకుండా ఇటీవల ఆసుపత్రిలో చేరిన రోగులతోపాటు ఇతర అనుమానితులను కూడా పరీక్షించినట్లు లారెన్‌ కౌసిర్కా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ ఫలితాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన సమయంలో నమూనాలు సేకరించామని, వాటి ఆధారంగా తమ పరీక్షల ఫలితం నెగటివ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతుల్లోని ద్రవాల నమూనాలు సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి అన్నదీ నమోదు చేస్తారని లారెన్ స్పష్టం చేశారు. ఈ సమాచారం ద్వారా తాము వైరస్‌ సోకిన తరువాత నాలుగు రోజులకు పరీక్షలు చేస్తే 67 శాతం నెగటివ్‌ ఫలితాలు రావచ్చునని అంచనా వేసినట్లు లారెన్‌ కౌసిర్కా వివరించారు.

Recommended Video

Coronavirus : ప్రపంచంలోనే నాలుగో స్థానానికి India రికార్డ్ బ్రేక్ ...!!
వాక్సీన్ కోసం అలుపెరగని పరిశోధనలు.. జూలై చివరికి వాక్సీన్ అందిస్తామంటున్న శాస్త్రవేత్తలు..

వాక్సీన్ కోసం అలుపెరగని పరిశోధనలు.. జూలై చివరికి వాక్సీన్ అందిస్తామంటున్న శాస్త్రవేత్తలు..

కాగా కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ వైరస్‌ ఉన్నట్లుగానే నిర్ధారించి చికిత్స అందించాలని లారెన్‌ కౌసిర్కా సూచించారు. ఈ విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను జూలై నెల లోపు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్టు అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, మోడెర్నా ప్రకటించాయి. జూలైలో 30 వేల మంది వలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించి చూస్తామని, ఇందుకు అవసరమైన మోతాదులను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. పెద్దవాళ్లలో ఎలా పనిచేస్తుందో చూడటమే కీలకమైన ఈ ప్రయోగ ఉద్దేశమని, మార్చిలో ఇప్పటికే 50మంది వలంటీర్లపై ప్రయోగించిన ఫలితాలు అందాల్సివుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ స్పష్టం చేసింది.

English summary
A study by John Hopkins University scientists shows that if the coronavirus is tested within the first few days of infection, there is a high likelihood that they will be infected with the disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X