వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ స్కూళ్ళలో కరోనా పంజా ... 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

కేరళ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేరళలో జనవరి 1వ తేదీ నుంచి 10, 12 తరగతులను ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా వందల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ రాష్ట్రంలో స్కూల్స్ లో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం కోసం తరగతులతోపాటుగా ప్రాక్టికల్స్ ను నిర్వహిస్తున్నారు. కరోనా ప్రోటోకాల్ ను పాటిస్తూ ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా రెండు పాఠశాలలలో పరీక్షలు నిర్వహించగా 187 మంది విద్యార్థులకు 72 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి ... టీకా వల్లే అంటున్న బాధిత కుటుంబంఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి ... టీకా వల్లే అంటున్న బాధిత కుటుంబం

 మలప్పురం జిల్లాలోని రెండు పాఠశాలల్లో కరోనా పంజా

మలప్పురం జిల్లాలోని రెండు పాఠశాలల్లో కరోనా పంజా

మలప్పురం జిల్లాలోని రెండు పాఠశాలల్లో మొత్తం 187 మంది విద్యార్థులు, 72 మంది ఉపాధ్యాయులు కోవిడ్ -19 కు పాజిటివ్ అని తేలటం స్కూల్స్ లో ఆందోళనకు కారణంగా మారింది . మారన్ చెరిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల మరియు పెరుంబడప్పులోని వన్నేరి హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు జరగగా మారన్ చెరి పాఠశాలలో 148 మంది విద్యార్థులు, 39 మంది బోధనా సిబ్బందికి అలాగే వన్నేరి పాఠశాలలో 39 మంది విద్యార్థులు, 36 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు తెలిసింది.

12 వ తరగతి విద్యార్థులు నమూనాలు సేకరించనున్న వైద్య సిబ్బంది

12 వ తరగతి విద్యార్థులు నమూనాలు సేకరించనున్న వైద్య సిబ్బంది

విద్యార్థులు ప్రధానంగా మారన్ చెరి, పెరుంబడప్పు, మలప్పురం జిల్లాలోని వెలియంకోడ్, త్రిశూర్ లోని వడక్కక్కడ్ పాఠశాలల పదవ తరగతి విద్యార్థుల నుండి నమూనాలను సేకరించారు. ప్లస్-టూ విద్యార్థుల నమూనాలను సోమవారం సేకరించనున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు సన్నిహితంగా ఉన్న వారు క్వారంటైన్ లో ఉండాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది .

జిల్లాలోని పాఠశాల నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని, తరగతులను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా వైద్య అధికారి (డిఎంఓ) డాక్టర్ కె సకీనా కోరారు.

Recommended Video

#TelanganaSchools : Students Attending Schools In Telangana From Today Onwards
మారన్ చెరి లో విద్యార్థికి పాజిటివ్ రావటంతో పరీక్షలు , వన్నేరిలో టీచర్ కు పాజిటివ్

మారన్ చెరి లో విద్యార్థికి పాజిటివ్ రావటంతో పరీక్షలు , వన్నేరిలో టీచర్ కు పాజిటివ్

మారన్ చెరి పాఠశాల పదవ తరగతి విద్యార్థినికి ఫిబ్రవరి 1 న పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ స్కూల్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మారన్ చెరి పాఠశాలలో 582 మంది విద్యార్థులు మరియు 50 మంది సిబ్బంది కోవిడ్ -19 కోసం పరీక్షలు జరుపగా పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లుగా, వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు గా పేర్కొన్నారు.

వన్నేరి పాఠశాలలోఉపాధ్యాయుడికి పాజిటివ్‌గా నిర్ధారించిన తర్వాత వన్నేరి పాఠశాలలో పరీక్షలు నిర్వహించినట్లు డీఎంఓ తెలిపారు.

కోవిడ్ సెల్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం

కోవిడ్ సెల్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం

పరీక్షలు చేయించుకున్న వారిలో మొత్తం 36 మంది సిబ్బందికి, 39 మంది విద్యార్థులకు ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు అని డాక్టర్ సకీనా చెప్పారు.

జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ పబ్లిక్ హెల్త్ నర్సులతో సభ్యులుగా కోవిడ్ సెల్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది . స్కూల్స్ లో విద్యార్థులు మధ్య భౌతిక దూరం పాటించాలని , కరోనా ప్రోటోకాల్స్ పాటించాలని సర్కార్ ఆదేశించింది .

English summary
A total of 187 students and 75 teachers in two schools in Malappuram district have tested positive for Covid-19. RT-PCR tests were conducted at Government Higher Secondary School, Maranchery and Vanneri Higher Secondary School, Perumbadappu .The Kerala government instructed officials to arrange covid cell .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X