• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా ...71 కోవిడ్ కేసులు .. క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ విధింపు

|

భారతదేశపు ప్రధాన ఇంజనీరింగ్ విద్యా సంస్థ, ఐఐటి మద్రాస్ లోపల కరోనా కలకలం రేగింది. చెన్నై ఐఐటి క్యాంపస్ లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో చెన్నై ఐఐటి క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ ప్రకటించారు.ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం, గత రెండు వారాల్లో 71 కోవిడ్ కేసులు నమోదయ్యాయి, అందులో 66 మంది విద్యార్థులు, నలుగురు సిబ్బంది మరియు ఒకరు బయటి నుండి వచ్చిన వ్యక్తి నుండి నమోదైనట్టు గా తెలుస్తుంది.

ఇండియాలో కరోనా కేసులు 99లక్షలకు చేరువగా .. ప్రపంచంలోనే టాప్ 2 ప్లేస్ లో భారత్ఇండియాలో కరోనా కేసులు 99లక్షలకు చేరువగా .. ప్రపంచంలోనే టాప్ 2 ప్లేస్ లో భారత్

  #corona కరోనా నీడలో ఐఐటీ మ‌ద్రాస్‌.. 66మంది విద్యార్థుల‌కు పాజిటివ్ ‌..!
  కేవలం ఒక్క రోజులోనే అత్యధికంగా 32 కొత్త కేసులు ... అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం

  కేవలం ఒక్క రోజులోనే అత్యధికంగా 32 కొత్త కేసులు ... అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం

  కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడి నుంచి జరిగిందో తెలియదు గానీ కేవలం ఒక్క రోజులోనే అత్యధికంగా ఆదివారం 32 కొత్త కేసులు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మద్రాస్ ఐఐటీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం క్యాంపస్‌లోని విద్యార్థులందరినీ పరీక్షించాలని ఇనిస్టిట్యూట్‌కు సూచించింది.ఐఐటి మద్రాస్ ఆదివారం అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు మద్రాస్ ఐఐటీ సర్క్యులర్ జారీ చేసింది. హాస్టల్ లో ఇటీవల కోవిడ్ కేసులు పెరగడం దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని విభాగాలు, ల్యాబ్స్, మరియు లైబ్రరీని వెంటనే మూసివేయాలని నిర్ణయించారు.

   బయట నుండి వచ్చే వారు వర్క్ ఫ్రమ్ హోం .. హాస్టల్ లో ఉన్న వారు హాస్టల్స్ కే పరిమితం

  బయట నుండి వచ్చే వారు వర్క్ ఫ్రమ్ హోం .. హాస్టల్ లో ఉన్న వారు హాస్టల్స్ కే పరిమితం

  బయటనుండి వచ్చే అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్ట్ సిబ్బంది మరియు రీసెర్చ్ ఎక్స్ పర్ట్స్ ఇళ్ల నుండి నుండి పని చేస్తారు. క్యాంపస్‌లో బస చేసే విద్యార్థులు, ప్రొఫెసర్లు మరియు ప్రాజెక్ట్ సిబ్బంది అందరూ తమ హాస్టల్ గదులకు మాత్రమే పరిమితం కావాలని మరియు వారి ఆరోగ్య రక్షణ కోసం కరోనా నిబంధనలు పాటించాలని, సామాజిక దూరాన్ని కొనసాగించాలని ఖచ్చితంగా సూచించారు. తమిళనాడు ప్రభుత్వం , భారత ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా పాటించాలని పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలైన జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, విరేచనాలు, రుచి / వాసన కోల్పోవడం లేదా మరే ఇతర లక్షణాలు కనిపించిణా వెంటనే ఐఐటి మద్రాస్ ఆసుపత్రి అధికారులను సంప్రదించాలి" అని సర్క్యులర్ ద్వారా స్పష్టంగా చెప్పారు.

  కరోనా వ్యాప్తికి గల కారణాలను పరిశీలిస్తున్న వైద్యుల బృందం .. అందరికీ కరోనా పరీక్షలు

  కరోనా వ్యాప్తికి గల కారణాలను పరిశీలిస్తున్న వైద్యుల బృందం .. అందరికీ కరోనా పరీక్షలు

  ఆరోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్ , ఆరోగ్య అధికారులు ఐఐటి మద్రాసుతో కలిసి వ్యాప్తి చెందడానికి గల కారణాలను తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు సామాజిక దూరం నిబంధనలు పాటించక పోవడం, కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మద్రాస్ ఐఐటీలో పెరుగుతున్న కరోనా కారణంగా ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించామని చెప్పారు. మద్రాస్ ఐఐటీలో కరోనా కేసులు నమోదైన కారణంగా కరోనా హాట్ స్పాట్లను శానిటైజ్ చేయడంలో చెన్నై కార్పొరేషన్ ఐఐటీ అధికారులతో కలిసి పనిచేస్తోంది.

  మద్రాస్ ఐఐటీ హాస్టల్స్ లో 774 మంది విద్యార్థులు .. విద్యార్థుల నమూనాల సేకరణ

  మద్రాస్ ఐఐటీ హాస్టల్స్ లో 774 మంది విద్యార్థులు .. విద్యార్థుల నమూనాల సేకరణ

  అధికారిక సమాచారం ప్రకారం, మొత్తం 774 మంది విద్యార్థులు ప్రస్తుతం క్యాంపస్‌లో ఉంటున్నారు, వీరిలో 408 మంది విద్యార్థుల నుండి నమూనాలను సేకరించారు. కృష్ణ హాస్టల్‌లో గరిష్టంగా 22 కోవిడ్ కేసులు, జమునా నుంచి 20 కేసులు నమోదయ్యాయి. హాస్టల్ విద్యార్థుల మధ్య గందరగోళం, సామాజిక దూరం నిబంధనలు పాటించకపోవడం లేదా బయట తిరగడం వల్ల క్యాంపస్ లో కేసులు పెరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్ లో మాస్కులు ధరించడం, హ్యాండ్‌వాషింగ్, సామాజిక దూరం మరియు ఇతర ప్రామాణిక విధానాలు విద్యార్థులు పాటిస్తున్నారా లేదా అనేది పర్యవేక్షిస్తున్నారు.

   హాస్టల్స్ ఖాళీ చేయించటం వల్లే కరోనా పెరిగిందని విద్యార్థుల ఆందోళన

  హాస్టల్స్ ఖాళీ చేయించటం వల్లే కరోనా పెరిగిందని విద్యార్థుల ఆందోళన

  మద్రాస్ ఐఐటీలో హాస్టల్ ను ఖాళీ చేయించిన కారణంగా విద్యార్థులు బయటకి లోపలికి విచ్చలవిడిగా తిరగడం వల్ల కరోనా వ్యాపించినట్లు గా విద్యార్థులు చెబుతున్నారు. వందలాది మంది నివాస విద్యార్థులను హాస్టళ్లను ఖాళీ చేసి డే స్కాలర్స్ గా మార్చాలని నిర్ణయించడం ఈ సంక్షోభానికి దారితీసిందని ఆరోపించారు. . ఐఐటి మద్రాస్ తన అధికారిక ప్రకటనలో హాస్టళ్లలో కేవలం 10 శాతం మంది విద్యార్థులతో ఈ సంస్థ పరిమిత సామర్థ్యంతో పనిచేస్తోందని చెప్పారు. హాస్టళ్లలో నివసిస్తున్న కొంతమంది విద్యార్థులలో కరోనా కేసుల పెరుగుదల నివేదించిన వెంటనే, క్వారంటైన్ చేయబడ్డారని పేర్కొంది . జాగ్రత్తగా ఉండటానికి, విద్యార్థులందరినీ వారి గదుల్లోనే ఉండమని కోరామని చెప్పింది . హాస్టళ్లలోని విద్యార్థులకు ప్యాక్ చేసిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని పేర్కొంది .

  English summary
  There has been a major outbreak of coronavirus inside India's premier educational institution - IIT Madras - and the campus is placed under temporary lockdown. According to health authorities, 71 Covid cases were reported in the last two weeks, of which 66 are students, fourmess staff and one from resident quarters. The single-day highest spike was on Sunday with 32 fresh cases and the number is likely to go up in the next couple of days with Tamil Nadu government instructing the institute to test all the students on the campus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X