వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో 3.32 లక్షలకు పైగా .. గత 24 గంటల్లో 11,502 కేసులు .. ప్రపంచంలో 80 లక్షలకు చేరువలో

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు చాలా ఆందోళనకరంగా మారింది. మరోమారు లాక్ డౌన్ విధించాల్సి వస్తుందా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా మ్నమోడు కావటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారింది . ఇక తాజాగా భారత దేశ పరిస్థితి ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు పెరుగుతున్న దేశాల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నా కేసులు పెరుగుతున్న తీరు మరింత దారుణ పరిస్థితిని కలిగిస్తుంది అనిపిస్తుంది .ఈ సమయంలో మళ్ళీ లాక్ డౌన్ విషయంలో కేంద్రం సమాలోచనలు చేస్తుంది.

గత 24 గంటల్లో 11వేలకు చేరువలో కొత్త కరోనా కేసులు: లాక్ డౌన్ రూల్స్ పై పునరాలోచిస్తున్నపలు రాష్ట్రాలుగత 24 గంటల్లో 11వేలకు చేరువలో కొత్త కరోనా కేసులు: లాక్ డౌన్ రూల్స్ పై పునరాలోచిస్తున్నపలు రాష్ట్రాలు

 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కరోనా పాజిటివ్ కేసులు

24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కరోనా పాజిటివ్ కేసులు

భారతదేశంలో గత కొన్ని రోజులుగా నిత్యం 10 వేలకు దగ్గరలో కేసులు నమోదవుతున్నాయి. కానీ ఇప్పుడు 11 వేలకు పైగా కేసుల నమోదు పెరిగింది. ఇప్పటివరకు ఇండియాలో గత 24 గంటల్లో 325 మరణాలు సంభవించాయి . 11,502 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 1,53,106 క్రియాశీల కేసులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా , 1,69,798 మందికి నయం అయ్యి తిరిగి ఇళ్ళకు చేరుకున్నారు. మొత్తం ఇప్పటివరకు 9520 మరణాలు నమోదు అయ్యాయి . ఇక ప్రస్తుతం దేశంలో మొత్తం 3,32,424 కేసులు ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

భారతదేశం లో ఇప్పటివరకు 57,74,133 టెస్టులు ..

భారతదేశం లో ఇప్పటివరకు 57,74,133 టెస్టులు ..

కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కేసులసంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత విపరీతంగా కేసులు పెరగటం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుంది అన్న భావన కలిగిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తుంది . గత 24 గంటల్లో మొత్తం 1,15,519 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటివరకు భారతదేశం 57,74,133 నమూనాలను పరీక్షించింది.

మహారాష్ట్ర పరిస్థితి దారుణం... తమిళనాడు, ఢిల్లీలలో కేసుల తీవ్రత

మహారాష్ట్ర పరిస్థితి దారుణం... తమిళనాడు, ఢిల్లీలలో కేసుల తీవ్రత

ఇక మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది . ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,07,958 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. ఆ తరువాత స్థానంలో తమిళనాడు 44,661 కేసులతో ఉంది . మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. అక్కడ 41,182 కేసులు నమోదు అయ్యాయి . దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఒక్క ఆరు రోజుల్లోనే 10,000 కు పైగా పెరిగింది. ఢిల్లీ లో ప్రస్తుతం కరోనా కేసులు 40,000 మార్కును దాటాయి. రోజువారీ సగటున 1,600 కొత్త కేసులతో, 10,000కు పైగా కేసులను ఆరో రోజుల్లో ఢిల్లీ నమోదు చేసింది. ఢిల్లీలో కేసుల సంఖ్య 20,000 నుండి 30,000 కి పెరగడానికి ఎనిమిది రోజులు పట్టింది, ఢిల్లీ ప్రభుత్వ డేటా విశ్లేషణ ప్రకారం, జూన్ 9 న కేసుల సంఖ్య 30,000 మార్కును దాటింది మరియు జూన్ 14 న ఇది 40,000 మార్కును దాటింది.

ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు .. మొదటి స్థానంలో యూఎస్

ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు .. మొదటి స్థానంలో యూఎస్

ఇక ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయి .ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 79,95,877 కేసులు నమోదు కాగా , 435,598 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా నుండి 41,28,318 మంది బయటపడ్డారు. రికవార్ అయ్యారు . ఇక ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు యూఎస్ లో నమోదయ్యాయి. ఇప్పటికీ కరోనా నుండి యూఎస్ బయటపడలేదు . యూఎస్ లో ఇప్పటివరకు 21,62,228 కేసులు నమోదు కాగా 1,17,858 మంది మృతి చెందారు.

Recommended Video

China Reports New COVID-19 Cases Again!
నాల్గవ స్థానంలో ఇండియా .. రికవరీ 50 శాతానికి పైగా ఉండటం ఊరట

నాల్గవ స్థానంలో ఇండియా .. రికవరీ 50 శాతానికి పైగా ఉండటం ఊరట

ఇక రెండవ కరోనా ప్రభావిత దేశంగా బ్రెజిల్ ఉంది అక్కడ 867,882 కేసులు నమోదు కాగా, 43,389 మంది మరణించారు. మూడో స్థానంలో రష్యా ఉండగా 5,28,964 మంది ఉండగా 6,948 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల్లో నాల్గవ స్థానంలో భారత్ ఉంది . ప్రస్తుతం 3,32,424 కేసులు నమోదు కాగా 9,520 మంది మరణించారు. అయితే ప్రస్తుతం భారత్ లో 50.60శాతం కేసులు రికవర్ కావటం కాస్త ఊరట అయినా కేసులు పెరుగుతుండటం మాత్రం ఆందోళన కలిగిస్తుంది .

English summary
325 deaths and 11,502 new Covid-19 cases reported in the last 24 hours. Total number of cases in the country now at 3,32,424 including 1,53,106 active cases, 169798 discharged and 9520 deaths . the world wide Cases nearer to 80 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X