• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా బాధితుడితో కానీ, ప్రయాణాల్లో కానీ సంబంధం లేని కరోనా పాజిటివ్ కేసులు : ఐసీఎంఆర్ అధ్యయనం

|

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తుంది.ముఖ్యంగా ఇటలీని కరోనా మమమ్మారి పట్టి పీడిస్తుంది. ఇటలీని కన్నీట ముంచింది . శవాల దిబ్బలుగా ఇటలీని మార్చింది . అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. వేలాదిగా అమెరికా వాసులు మృత్యువాత పడుతున్నారు. ఇక ఇండియాలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న పరిస్థితులు ఇండియన్స్ ను భయపెడుతున్నాయి . ఇక తాజా పరిస్థితులపై ఐసీఎంఆర్ ఒక అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది .

నెలరోజుల బిడ్డతోనే కరోనా విధుల్లోకి- విశాఖలో మహిళా అధికారి నిబద్ధతపై ప్రశంశలు..నెలరోజుల బిడ్డతోనే కరోనా విధుల్లోకి- విశాఖలో మహిళా అధికారి నిబద్ధతపై ప్రశంశలు..

తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి కరోనా పాజిటివ్

తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి కరోనా పాజిటివ్


తీవ్రమైన శ్వాస సంభంధమైన ఇబ్బందితో , అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (SARI) తో చేరిన రోగులను అధ్యయనం చేసినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ICMR అధ్యయనం ప్రకారం,కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షించిన వారిలో 93% మంది విదేశాలకు వెళ్ళలేదు లేదా సోకిన వ్యక్తితో ఎటువంటి సంబంధం కలిగి లేరు.అయినప్పటికీ వారికి కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు . అధ్యయనం ప్రకారం, కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన 102 మంది శ్వాససంబంధ వ్యాధులు ఉన్న రోగులలో, 59 (58%) కేసులకు వారు కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తితో లేదా అంతర్జాతీయ ప్రయాణంతో వారితో కలిసి ప్రయాణం చేసిన డేటా కూడా లేదు. మిగిలిన 43 మందిలో మాత్రమే కోవిడ్ పాజిటివ్ వారితో కలిసి ప్రయాణించిన హిస్టరీ ఉంది .

 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గా దీన్ని చూడాలన్న డాక్టర్ టి సుందరరామన్

కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గా దీన్ని చూడాలన్న డాక్టర్ టి సుందరరామన్

ఇక ఎలాంటి వ్యాప్తికి సంబంధించిన ఆధారాలు లేకుండా కరోనా పాజిటివ్ వ్యాప్తి చెందటాన్ని ప్రజారోగ్య నిపుణులు దీనిని సమాజ వ్యాప్తికి సూచనగా చూస్తారు. భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ టి సుందరరామన్ మాట్లాడుతూ, ఇది WHO చేత కూడా నిర్ధారించబడింది. ఈ పరిణామాలని సమాజ వ్యాప్తికి ఉదాహరణగా భావిస్తారు. సోకిన వ్యక్తులతో లేదా అంతర్జాతీయ ప్రయాణాలకు చరిత్ర లేని కేసులు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లో ఒక నిర్దిష్ట దశ. అయినంత మాత్రాన ప్రభుత్వం విఫలమైందని లేదా లాక్ డౌన్ విజయవంతం కాలేదని కాదు అని పేర్కొంటున్నారు. అయితే మరింత అప్రమత్తత అవసరం అని పేర్కొన్నారు .

  Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby
   తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో ఉన్న వారికి పరీక్షలు తప్పని సరి అని తేల్చిన అధ్యయనం

  తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో ఉన్న వారికి పరీక్షలు తప్పని సరి అని తేల్చిన అధ్యయనం

  లాక్ డౌన్ విజయవంతం చేస్తేనే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆగిపోతుందని తెలుస్తుంది . కమ్యూనిటీ స్ప్రెడ్ ఏర్పడితే దానిని నిరోధించటం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది .
  ఇక ఐసిఎంఆర్ అధ్యయనం, SARI రోగులలో కోవిడ్ -19 పాజిటివిటీ మార్చి 14 కి ముందు సున్నా నుండి ఏప్రిల్ 2 తో ముగిసిన వారానికి 2.6 శాతానికి పెరిగిందని పేర్కొంది. మార్చి 22 మరియు ఏప్రిల్ 2 మధ్య, అన్ని SARI రోగులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే , 4,946 నమూనాలలో 102 పాజిటివ్ గా తేలాయని తెలుస్తుంది . ఇక ఈ అధ్యయనం SARI రోగులను పరీక్షించడం యొక్క ప్రాముఖ్యతను తేల్చి చెప్పింది. చాలా మంది అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ తో బాధ పడే వారికి టెస్టులు మొదట కొన్ని సార్లు నెగిటివ్ గా వచ్చినా మళ్ళీ పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం తో బాధ పడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలి .

  English summary
  An ICMR study of patients admitted with Acute Respiratory Illness (SARI) are found as corona positie patients . According to the ICMR study, 93% of those who tested positive for coronavirus had not gone abroad or had any contact with the infected person. this is community transmission acording to the WHO and also the study of ICMR.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X