వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్ .. ఎయిమ్స్ లో చేరిక .. ప్రచారానికి దూరం

|
Google Oneindia TeluguNews

ఒకపక్క బీహార్లో ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టోలు,ప్రజలకు ఇస్తున్న హామీలతో ప్రధాన పార్టీలు ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాయి. బిజెపి, మహా కూటమి పార్టీల మధ్య ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కరోనా వైరస్ బారిన పడ్డారు. బీహార్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ గురువారం కరోనా బారిన పడినట్లుగా స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు.

బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఆ చట్టాల రద్దు, యువతకు ఉద్యోగాలు ... మహాకూటమి మ్యానిఫెస్టో విడుదలబీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఆ చట్టాల రద్దు, యువతకు ఉద్యోగాలు ... మహాకూటమి మ్యానిఫెస్టో విడుదల

తాను కరోనా వైరస్ బారిన పడ్డారని, తాజాగా నిర్వహించిన పరీక్షలలో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పాట్నాకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చెందినట్లుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ఈరోజు ప్రకటించారు. ఇక సీటీ స్కాన్ చేయగా ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని , కొద్దిగా జ్వరం రావడంతో చికిత్స పొందేందుకు ఎయిమ్స్ లో చేరానని ఆయన తెలిపారు . కరోనా వైరస్ నుండి త్వరగానే కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని డిప్యూటీ సీఎం ట్వీట్ చేశారు.

Corona positive tested for Bihar Deputy CM Sushil Kumar Modi .. admitted in AIIMS

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవలసిన సమయంలో డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ కి కరోనా సోకడంతో ఆయన ఎన్నికల ప్రచారానికి విఘాతం కలిగింది.

బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 10వ తేదీన ప్రకటించబడతాయి.

English summary
Bihar Deputy Chief Minister Sushil Modi announced today that he has contracted coronavirus and has been admitted to Patna's All-India Institute of Medical Sciences. Mr Modi's declaration on testing positive comes amid full-scale campaigning for the three-phase assembly election that's less than a week away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X