• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు .. కేంద్రం పదేపదే చెప్పటానికి కారణాలు ఇవే !!

|

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుందని, కరోనా సెకండ్ వేవ్ ముగియలేదని ప్రభుత్వం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. కరోనా కేసులు విపరీతంగా తగ్గుతున్నా, కరోనా క్షీణిస్తున్నా ఎందుకు ప్రభుత్వం పదేపదే కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు అని హెచ్చరికలు జారీ చేస్తుంది అంటే అందుకు కారణాలు లేకపోలేదు.

వివిధ రాష్ట్రాల్లో తొలగిస్తున్న లాక్ డౌన్ ఆంక్షలు

వివిధ రాష్ట్రాల్లో తొలగిస్తున్న లాక్ డౌన్ ఆంక్షలు

సరిగ్గా రెండు నెలల క్రితం, భారతదేశం అత్యధికంగా రోజువారి కరోనా కేసులను 4.12 లక్షలుగా నమోదు చేసింది. ఇది ఇప్పుడు 40,000తో క్షీణదశకు చేరుకుంది. కోవిడ్ -19 మహమ్మారి యొక్క రెండవ వేవ్ యొక్క గరిష్ట సమయంలో, భారతదేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 37.41 లక్షలకు పైగా ఉంది. ఇది ఇప్పుడు 4.77 లక్షలకు పడిపోయింది.చాలా రాష్ట్రాలు కోవిడ్ -19 కేసులలో గణనీయంగా క్షీణతను చూస్తున్నాయి. దీనివల్ల దేశంలోని చాలా ప్రాంతాలలో కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి . అయినప్పటికీ, గత శుక్రవారం ప్రభుత్వం కోవిడ్ -19 మహమ్మారి యొక్క రెండవ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్రం వెల్లడించింది.

ఇంకా ఆరు రాష్ట్రాల్లో అత్యధికంగా కోవిడ్ కేసులు

ఇంకా ఆరు రాష్ట్రాల్లో అత్యధికంగా కోవిడ్ కేసులు

దేశం మొత్తం కరోనా మహమ్మారి నుండి బయట పడే వరకు సురక్షితంగా ఉన్నట్టు కాదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ నొక్కిచెప్పారు.ఎందుకంటే ఆరు రాష్ట్రాలు - కేరళ, ఒడిశా, చత్తీస్ గడ్ , అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర మరియు మణిపూర్ ఇప్పటికీ కోవిడ్ -19 కేసులు అధికంగా రికార్డ్ చేస్తున్నాయి. భారతదేశంలో రోజువారీ కేసులు పాజిటివిటీ నిష్పత్తి మూడు శాతం మార్క్ కంటే పడిపోయింది. వారపు పాజిటివిటీ నిష్పత్తి కేవలం 3 శాతానికి పైగా ఉంది. అయితే, దేశవ్యాప్తంగా 71 జిల్లాలు 10 శాతం కేస్ పాజిటివిటీ నిష్పత్తిని చూపించాయి.

కొత్త డెల్టా ప్లస్ వేరియంట్‌తో కొత్త భయం

కొత్త డెల్టా ప్లస్ వేరియంట్‌తో కొత్త భయం

జూన్ 30 నాటికి, కోవిడ్ -19 యొక్క 56 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అయినప్పటికీ, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతుండడం, రాష్ట్రాలు ఆంక్షలను సడలించడం, ప్రజల సామాజిక దూరం నిబంధనలు పాటించక పోవడం వంటి కారణాలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 56 డెల్టా ప్లస్ కేసులు నమోదు కావడం ప్రస్తుతం అతి పెద్ద ఆందోళన గా మారింది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ముగియలేదని గుర్తుచేస్తూ కేంద్రం హెచ్చరికను జారీ చేసింది.

రాష్ట్రాలకు కేంద్ర బృందాలు .. కరోనా నియంత్రణా కార్యక్రమం

రాష్ట్రాలకు కేంద్ర బృందాలు .. కరోనా నియంత్రణా కార్యక్రమం


ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి మరియు కోవిడ్ -19 మహమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి తగిన చర్యలను సూచించడానికి కేంద్రం ఆరు రాష్ట్రాలకు వైద్యులు మరియు ప్రజారోగ్య నిపుణులతో కూడిన బృందాలను పంపింది. వారం రోజుల కేసుల పాజిటివిటీ నిష్పత్తి 10 శాతానికి మించి లేదా హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ 60 శాతానికి పైగా ఉన్న జిల్లాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.ఈ జిల్లాలను కోవిడ్ -19 నియంత్రణ కార్యక్రమం కిందకు తీసుకువస్తారు. కరోనావైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి రెండు వారాల పాటు అటువంటి జిల్లాల్లో కోవిడ్-తగిన ఆంక్షలను కేంద్రం సూచించింది.

వ్యాక్సినేషన్ పైనా ఫోకస్.. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగానే థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్

వ్యాక్సినేషన్ పైనా ఫోకస్.. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగానే థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్

ఇదే సమయంలో ఎక్కువమందిని టీకా పరిధిలోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గర్భిణీ స్త్రీలకు కూడా టీకాలు వేయడానికి అధికారంగా అనుమతినిచ్చింది. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు అనే హెచ్చరిక కోవిడ్ -19 మహమ్మారి యొక్క మూడవ వేవ్ ను అంచనా వేస్తున్న సమయంలో వస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి యొక్క మూడవ తరంగం ఆగస్టు చివరి నాటికి ప్రారంభమవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి.

English summary
The government has repeatedly issued warnings that the corona second wave is still going on in India and that the corona second wave is not over.While the corona cases are declining drastically and the corona is declining, the government has repeatedly issued warnings that the corona second wave is not over yet, for no apparent reason.State governments' easing of sanctions, fears of the Delta Plus variant, and lack of corona control in all states and failure to complete vaccinations appear to be reasons for the government to issue a corona second wave warning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X