వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేవలం రూ.33 కే కరోనా టాబ్లెట్ .. ఫావిలో పేరుతో.. పోటాపోటీగా కరోనా మెడిసిన్ తయారీలో కంపెనీలు

|
Google Oneindia TeluguNews

జెనరిక్ ఫార్మాస్యూటికల్ తయారీదారు ఎంఎస్ఎన్ గ్రూప్ దేశంలోనే అతి చౌకైన కరోనా చికిత్స కోసం ఫావిపిరవిర్ 200 ఎంజి మెడిసిన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ చికిత్సకు వినియోగించే ఫావిపిరవిర్ మెడిసిన్ ఇప్పటికే చాలా కంపెనీలు పోటాపోటీగా తయారుచేసి మార్కెట్లో విడుదల చేసాయి. అయితే పలు కంపెనీలకు సంబంధించిన ఫావిపిరవిర్ మెడిసిన్ ధర వేలల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ఎంఎస్ఎన్ గ్రూప్ అతి తక్కువ ధరతో ఫావిలో పేరుతో 200mg టాబ్లెట్లను తయారుచేసింది.

Recommended Video

Favipiravir Covid-19 Drug ను Favilow పేరుతో Rs 33 కే అందివ్వనున్న Hyderabad's MSN Labs || Oneindia

తెలంగాణా పోలీస్ శాఖను పట్టిపీడిస్తున్న కరోనా ... ఇప్పటివరకు 4259 మందికి పాజిటివ్తెలంగాణా పోలీస్ శాఖను పట్టిపీడిస్తున్న కరోనా ... ఇప్పటివరకు 4259 మందికి పాజిటివ్

సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా మెడిసిన్

సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా మెడిసిన్

కరోనావైరస్ బారినపడిన బాధితులకు వైరస్ నివారణ కోసం వినియోగించే యాంటీవైరల్ డ్రగ్ గా దీనిని త్వరలో మార్కెట్లోకి తీసుకు రానున్నారు ఎంఎస్ఎన్ గ్రూప్. దీనిపై ఎంఎస్ఎన్ గ్రూప్ సిఎండి ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడారు . ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈ మెడిసిన్ సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందని తాము భావిస్తున్నాము అని పేర్కొన్నారు.

డిమాండ్ కు తగ్గట్టుగా ఫావిలో సరఫరా చేయగల సామర్థ్యం

డిమాండ్ కు తగ్గట్టుగా ఫావిలో సరఫరా చేయగల సామర్థ్యం

యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్, ఫార్ములేషన్ ను సొంత పరిశోధన ద్వారా తయారు చేశామని పేర్కొన్నారు. నాణ్యమైన మందులు అందరికీ అందుబాటులో, తక్కువ ధరలో ఉండాలని తాము భావిస్తున్నామని, అందుకే ఈ మెడిసిన్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.డిమాండ్ కు తగ్గట్టుగా ఫావిలో సరఫరా చేయగల సామర్థ్యం కంపెనీకి ఉందని ఆయన పేర్కొన్నారు.త్వరలో ఫావిలో 400 mg టాబ్లెట్ లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు.

కరోనా చికిత్సకు పోటీపడి మెడిసిన్ తయారు

కరోనా చికిత్సకు పోటీపడి మెడిసిన్ తయారు

కరోనా చికిత్స కోసం ఈ మెడిసిన్ ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదించింది. ఇక దీని కంటే ముందు జూలై 24 న, ఫార్మా సంస్థ జెన్‌బర్క్ట్ ఫార్మాస్యూటికల్స్, టాబ్లెట్‌కు రూ .39 చొప్పున 'ఫావివెంట్' బ్రాండ్ పేరుతో యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. కరోనా వైరస్ ను తేలికపాటి నుండి మోడరేట్ చేయడానికి ఈ మందు ఆమోదించబడింది.

 ఇప్పటికే మార్కెట్ లో పలు ఫార్మా కంపెనీల ఫావిపిరవిర్ మెడిసిన్

ఇప్పటికే మార్కెట్ లో పలు ఫార్మా కంపెనీల ఫావిపిరవిర్ మెడిసిన్


ఫావిపిరవిర్ మరియు మరొక యాంటీ-వైరల్ మెడిసిన్ , రెమిడెసివిర్, భారతదేశంలో కరోనావైరస్ చికిత్సకు ఎక్కువగా వినియోగిస్తున్న మెడిసిన్. దీనిని కరోనా కేసుల్లో అత్యవసర చికిత్స కోసం ఇప్పటికే వినియోగిస్తున్నారు. హెటిరో సంస్థ ఈ మెడిసిన్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది . ఫేవిపిరవిర్‌ను అభివృద్ధి చేస్తున్న లేదా విక్రయించే ఇతర భారతీయ తయారీదారులలో గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు సిప్లా లిమిటెడ్, బ్రింటన్ ఫార్మాలు ఉన్నాయి .

English summary
Hyderabad-based generic pharmaceuticals company MSN Group has planned to launch the cheapest Covid-19 treatment drug - Favipiravir 200 mg, for Rs 33, according to multiple reports. The affordable version of the anti-viral drug will be marketed under the brand name 'Favilow', and will be available in all pharmacies across India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X