వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నేర్పిన జీవితం: సింపుల్ గా బతకటానికి అలవాటు పడుతున్న జనాలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మనుషుల జీవితంపై తన ప్రభావం చూపిస్తుంది. కరోనా మానవ జీవితాలను చాలా సింపుల్ గా మార్చింది . నిన్నటి వరకు లగ్జరీ లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన వాళ్ళంతా కరోనా లాక్ డౌన్ ప్రభావంతో చాలా సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు. అనవసరపు వృధా ఖర్చులు తగ్గించి అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు . ఒక పట్టాన ఇంటి పట్టున ఉండని వాళ్ళు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అన్నిటికీ అడ్జెస్ట్ అవుతూ జీవన విధానాన్నే మార్చుకుంటున్నారు.

కరోనా దెబ్బకు లగ్జరీలు బంద్

కరోనా దెబ్బకు లగ్జరీలు బంద్

కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ ప్రజలకు మాత్రం ఏది అవసరమో అదే తెలుసుకోవాలని చెప్తుంది . ఆధునిక జీవన విధానంతో ప్రకృతిని వినాశనం చేస్తున్న మానవులకు లాక్ డౌన్ విధించి సాధారణ జీవనం గడపమని చెప్పింది . ఒకప్పుడు ప్రతీ విషయానికి హంగామా చేసేవాళ్ళంతా ఇప్పుడు కరోనా దెబ్బకు ఎంత పెద్ద సందర్భం అయినా సరే సైలెంట్ గా అంతే సింపుల్ గా చేసుకుంటున్నారు. లగ్జరీ అన్న పదాన్ని దాదాపు పక్కన పెట్టారు. అవసరం , అత్యవసరం అన్న విషయాలకే పరిమితం అవుతున్నారు .

వేడుకలు ఏవైనా హంగామాలు బంద్ .. మోడరన్ లైఫ్ స్టైల్ కు స్వస్తి

వేడుకలు ఏవైనా హంగామాలు బంద్ .. మోడరన్ లైఫ్ స్టైల్ కు స్వస్తి

కరోనాకి ముందు పుట్టిన రోజులైనా, వివాహాది శుభాకార్యాలైనా హంగామా చేసి బయట పెద్ద ఎత్తున పార్టీలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇళ్ళల్లో కేకులు తయారు చేసుకుని , లేదా పుచ్చకాయలను కేక్ లా చేసి కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక పెళ్ళిళ్ళు అయితే పట్టుమని 10 మంది కూడా లేకుండానే జరిగిపోతున్నాయి. పబ్ లు , క్లబ్ లు, జిమ్ లు ,ఎరోబిక్స్ సెంటర్లు , షాపింగ్ , సినిమాలు , డిస్కోలు , పార్కులు ఇలా ప్రతి నిత్యం మోడరన్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన నగర వాసులను మాత్రం కరోనా చాలా గొప్పగా కట్టడి చేస్తుంది .

 పొదుపును , శుభ్రతను నేర్పిన కరోనా

పొదుపును , శుభ్రతను నేర్పిన కరోనా

ఎవరూ ఎటూ వెళ్ళటానికి లేని పరిస్థితి వారిలో ఒక మార్పుకు కారణం అవుతుంది . నిత్యం సంపాదన కోసం పరుగులు పెట్టిన నగర వాసులకు డబ్బు కంటే కుటుంబం ప్రాధాన్యం అనే విషయం బోధ పడేలా చేసింది కరోనా . ఇక సంపాదన లేని పరిస్థితులు పొదుపు నేర్పాయి. నిద్రలేచిన దగ్గర నుండి లగ్జరీ అన్న వాళ్ళు ఇప్పుడు నో లగ్జరీ అనేలా చేసింది . నిత్యం రణగొణ ధ్వనులతో నరకంగా ఉండే రోడ్లు నిర్మలంగా , నిశ్శబ్దంగా ఉండేలా చేసింది . ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసే మనకు శుభ్రత నేర్పింది కరోనా .

లాక్ డౌన్ తో సింపుల్ గా బతకటం నేర్పిన కరోనా

లాక్ డౌన్ తో సింపుల్ గా బతకటం నేర్పిన కరోనా

అన్నిటి కంటే సింపుల్ గా బతకటం చేతకాని వాళ్ళకు కూడా సింపుల్ గా బతకటం నేర్పించింది కరోనా . ఒక రకంగా చెప్పాలంటే కరోనా ప్రస్తుత మానవ సమాజానికి జీవితం విలువ చెప్పింది. బతుకు అంటే ఏంటో అర్ధం అయ్యేలా చేసింది. పేద, ధనిక, పెద్ద , చిన్న తేడా లేకుండా అంతా సమ సమాజమే అన్నట్టు కరోనా ఒక్కసారిగా వ్యవస్థను మార్చింది . ఒక చిన్న వైరస్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో సాధించిన, అంతరిక్షంలోకి ప్రయాణం సాగించిన మానవ మేధస్సుకు పరీక్ష పెడుతుంది. ఇప్పటి వరకు మెడిసిన్ లేని పరిస్థితి మన వైజ్ఞానిక పురోగతిని ప్రశ్నిస్తుంది. జీవన తత్వం బోధ పడేలా చేస్తుంది .

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP

English summary
Coronavirus has its impact on human life. Corona has made human lives so simple. All those who have been accustomed to the luxury lifestyle till yesterday are living a very normal life with the effect of a corona lockdown. Reducing unnecessary wastage and spending on necessities only. Even those who do not stay at home are restricted to homes. Adjusting everything is changing the lifestyle of people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X