వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్

|
Google Oneindia TeluguNews

రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు ఒడిశాలో డిప్యూటీ స్పీకర్ రజినీకాంత్ సింగ్ తో పాటు 11 మంది శాసనసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను శాసన సభ్యులు అందరికీ చేశారు. ఈ డ్రైవ్ లో డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్ మాత్రమే కాకుండా 11 మంది శాసనసభ్యులకు కరోనా సోకటం ఒడిశా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్‌తో సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆదివారం కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది .ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో 11మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారించగా, సేకరించిన మరికొందరు శాసనసభ్యుల కరోనా టెస్ట్ ల ఫలితాలు మంగళవారం రానున్నాయి. ఇక ఈ రోజు ఇంకా ఎంత మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుందో తెలియాల్సి ఉంది.

 Corona tension for politicians .. Positive for 11 MLAs at once along with deputy speaker

యూఎస్, బ్రెజిల్ తో పోలిస్తే ఇండియాలో కరోనా తీవ్రత అధికం : లెక్క చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థయూఎస్, బ్రెజిల్ తో పోలిస్తే ఇండియాలో కరోనా తీవ్రత అధికం : లెక్క చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తనకు కరోనా నిర్ధారణ పరీక్ష చెయ్యగా పాజిటివ్ వచ్చిందని భువనేశ్వర్ లోని ఆసుపత్రిలో చేరానని, ఇటీవలి కొద్ది రోజులలో తనతో సంప్రదించిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు .

Recommended Video

Kim Jong-un : మా సరిహద్దులోకి ఎవరైనా వస్తే ఇదే గతి.. South korea అధికారి మృతి పై Kim ! || Oneindia

పూరి జిల్లాలోని సత్యబాది నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమకాంత సమంతే కూడా సోషల్ మీడియా పోస్టులో తనకు కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వ్యక్తులు క్వారంటైన్ కు వెళ్లాలని కోరారు. వర్షాకాల శాసనసభా సమావేశానికి ముందు స్పీకర్ ఎస్ ఎన్ పాట్రో ఆదేశాల మేరకు శాసన సభ్యులకు, అసెంబ్లీ సిబ్బందికి, జర్నలిస్ట్ లకు కరోనా నిర్ధారనా పరీక్షలు చేశారు . ఒడిశాలో ఇప్పటివరకు తొమ్మిది మంది మంత్రులతో సహా 50 మంది ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలకు ముందు 11మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

English summary
A day before the scheduled commencement of the monsoon session of the Odisha Assembly, 12 legislators, including Deputy Speaker Rajanikant Singh, tested positive for COVID-19, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X