వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో కరోనా పరీక్షలు 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది: కిరణ్ మజుందార్ షా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కరోనావైరస్‌ పరీక్షలు భారత్‌లో ఇప్పుడున్న దానికంటే పది రెట్లు ఎక్కువగా పెరుగుతాయని చెప్పారు బయోకాన్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మెన్ కిరణ్ మజుందార్ షా. కరోనా పరీక్షలు చేయడంలో భారత్ కాస్త వెనకపడిందని చెప్పిన మజుందార్ షా... పరీక్షలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా లేదని ఒక్కసారిగా పెరగడం ప్రారంభిస్తే టెస్టింగులను పెంచడం కాస్త కష్టమవుతుందని ఆమె అన్నారు. అందుకే ఇప్పటి నుంచే టెస్టులను పెంచాలని ఆమె అభిప్రాయపడ్డారు.

కరోనా వార్నింగ్: వచ్చే 2.5 నెలలు జాగ్రత్త - ముందంజలో 3 వ్యాక్సిన్లు: కేంద్ర మంత్రి హర్షవర్థన్కరోనా వార్నింగ్: వచ్చే 2.5 నెలలు జాగ్రత్త - ముందంజలో 3 వ్యాక్సిన్లు: కేంద్ర మంత్రి హర్షవర్థన్

ఇక భారత్ దేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పిన కిరణ్ మజుందార్ షా... సైన్స్ పై ఫోకస్ చేయడానికి బదులు అభిప్రాయ సేకరణపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. భారత్‌లో యువత అధికంగా ఉండటం వల్ల మరణాల రేటు తక్కువగా ఉందని ఆమె చెప్పారు. అయితే భారత్‌ అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన దేశంగా ఉందని చెప్పిన కిరణ్... ఇప్పుడు చాలా కంపెనీలు అప్పుడే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఇక స్వల్ప వ్యవధిలోనే ఇంత పెద్ద దేశానికి వ్యాక్సిన్‌లు సరఫరా చేయడం సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు కిరణ్ మజుందార్ షా. ఇక వ్యాక్సిన్ సరఫరాకు వచ్చే నెల నవంబర్ నాటికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Corona tests in India may increase to 10 folds,says Biocon founder Kiran Mazumdar-Shaw

Recommended Video

COVID-19 : కరోనా మరణాలను తగ్గించడంలో Remdesivir ప్రభావం లేదన్న WHO || Oneindia Telugu

ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది జనవరి కల్లా అత్యవసర పరిస్థితుల కోసం వ్యాక్సిన్ వచ్చేస్తుందని కిరణ్ చెప్పారు. ముందుగా వ్యాక్సిన్‌ల కొరత దేశం ఎదుర్కొంటుందని అయితే కాలక్రమంలో వ్యాక్సిన్‌ల సంఖ్య పెరుగుతుందని కిరణ్ చెప్పారు. ఇక వ్యాక్సిన్ వస్తే అక్రమాలకు కూడా తావు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయా దేశాలు మరొక దేశానికి తమ వ్యాక్సిన్‌లు వెళ్లకూడదన్న యోచనతో పనిచేస్తున్నాయని ఈ క్రమంలోనే కొరత ఏర్పడే అవకాశం ఉందని కిరణ్ చెప్పారు. కరోనా వైరస్ అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదన్న కిరణ్... ఇది ప్రపంచ దేశాలను కుదిపేస్తోన్న మహమ్మారని అలాంటప్పుడు వ్యాక్సిన్‌ సరఫరా ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పారు. దీన్ని జయించాలంటే అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

English summary
India could potentially scale up coronavirus testing ten-fold, said Biocon founder and Chairman Kiran Mazumdar-Shaw
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X