వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona update : భారత్ లో కరోనా పంజా.. లక్షన్నర దాటిన కేసులు.. తస్మాత్ జాగ్రత్త !!

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కరోనా కేసులు కంట్రోల్ లోకి రావటం లేదు. కరోనా మహమ్మారి ఇండియాలో ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. భారతదేశంలో చాప క్రింద నీరులా విస్తరిస్తున్న కరోనాను కంట్రోల్ చేయడం కోసం భారత ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ఇక ఇప్పటికే ప్రపంచదేశాల కరోనా కేసుల జాబితాలో భారత్‌ 10వ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

corona update : కరోనా కేసుల్లో టాప్ 10 లో భారత్ .. కొత్త కేసుల నమోదులో 4వ స్థానంcorona update : కరోనా కేసుల్లో టాప్ 10 లో భారత్ .. కొత్త కేసుల నమోదులో 4వ స్థానం

 లక్షా యాభై వేలు దాటిన భారత్ లో కరోనా కేసులు

లక్షా యాభై వేలు దాటిన భారత్ లో కరోనా కేసులు

భారత దేశం పై కరోనా పంజా విసురుతోంది. ఇక తాజాగా నమోదైన కరోనా కేసులు చూస్తే 1,51,767 కేసులు నమోదు అయ్యాయి. అంటే ఇండియాలో కరోనా కేసులు లక్షన్నర దాటినట్టు గా తెలుస్తుంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 మందికి కొత్త కేసులు నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, గడచిన 6 రోజులతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ ప్రస్తుతం కరోనా కేసులను చూస్తే దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటింది.

 గత 24 గంటల్లో 170 మంది మృతి ..6,387 కొత్త పాజిటివ్ కేసులు

గత 24 గంటల్లో 170 మంది మృతి ..6,387 కొత్త పాజిటివ్ కేసులు

కొత్త కేసుల సంఖ్య తక్కువగా నమోదయినా, మరణాలు మాత్రం రోజురోజూకు పెరుగుతుండం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో 170 మంది కరోనా బారిన పడిన వారు మృతి చెందినట్లుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 83,004 కేసులు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదే సమయంలో గత 24 గంటల్లో 170 మంది కరోనా బారినపడి మృతిచెందారు.

 పాజిటి కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరం

పాజిటి కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరం

దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య1,51,767కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొని 64,425 మంది డిశ్చార్జ్ అయినట్లుగా సమాచారం. ఇక మొత్తంగా ఇప్పటి వరకు సంభవించిన మరణాల జాబితా చూస్తే కరోనాతో భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 4,337కు పెరిగింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. తక్కువ కేసులు ఉన్నప్పుడే ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశ ఆర్థిక సంక్షోభాన్ని భరించలేక లాక్‌డౌన్‌ సడలింపులను ప్రకటించాయి.

Recommended Video

A Couple Executed By Firing Squad In North Korea
జాగ్రత్త వహించకుంటే ఇండియా పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం

జాగ్రత్త వహించకుంటే ఇండియా పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం

దీంతో అంతా రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే ముందు ముందు దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అనడం నిర్వివాదాంశం. ఇప్పటికే పెరుగుతున్న కొత్త కేసుల విషయంలో భారత్ ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో ఉంది. ఇక కరోనా కేసుల్లో 10 వ స్థానంలో ఉంది . ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం భవిష్యత్ లో ఇండియా పరిస్థితి దారుణంగా మారుతుందని చెప్పటం నిస్సందేహం .

English summary
According to latest data, India has reported 6,387 new cases of coronavirus in the last 24 hours. This led to a total of 1,51,767 cases and 4,337 deaths in India. An increasing number of cases is the most alarming factor and f not taken any safety measures it will create worst situations in india .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X