వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona update : కరోనా కోరల్లో ఇండియా .. గత 24 గంటల్లో 6,566 పాజిటివ్‌ కేసులు, 194 మరణాలు

|
Google Oneindia TeluguNews

కరోనా కోరల్లో చిక్కుకొని భారతదేశం విలవిలలాడుతోంది. కరోనా మహమ్మారి భారత్‌లో అంతకంతకూ విస్తరిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితులు భారతదేశ ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి.

corona update : భారత్ లో కరోనా పంజా.. లక్షన్నర దాటిన కేసులు.. తస్మాత్ జాగ్రత్త !!corona update : భారత్ లో కరోనా పంజా.. లక్షన్నర దాటిన కేసులు.. తస్మాత్ జాగ్రత్త !!

గడిచిన 24 గంటల్లో 6,566 పాజిటివ్‌ కేసులు, 194 మరణాలు

గడిచిన 24 గంటల్లో 6,566 పాజిటివ్‌ కేసులు, 194 మరణాలు

ఇక భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల విషయానికి వస్తే 1,58,414 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,566 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 194 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 86,120 కాగా ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 4,534కు చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటివరకు67,749 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో కంట్రోల్ లో లేని కరోనా ..56,948 కేసులు

మహారాష్ట్రలో కంట్రోల్ లో లేని కరోనా ..56,948 కేసులు

భారతదేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు 56,948 గా నమోదయ్యాయి. భారతదేశంలోని కరోనా వైరస్ ప్రభావానికి గురైన, అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. ఇక ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో 18545 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో తమిళనాడు నిలువగా మూడవ స్థానంలో 15257 కేసులతో ఢిల్లీ ఉంది. ఇక ఆ తర్వాత స్థానంలో ఉన్న గుజరాత్ లో 15205 కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

ఇదిలా ఉంటె తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రికార్డు స్థాయిలో కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 39.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 68 మందికి వ్యాధి సోకింది. ఇక నిన్న కరోనా భారిన పడి ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 63మంది కరోనాతో మృతి చెందారు. ఇక కరోనా పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 2098కు చేరింది. ఇక ఏపీలో కరోనా కేసులు చూసినట్లయితే 3117 కరోనా కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఏపీ లోనూ కొత్తగా 54 కేసులు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.

కరోనా రక్కసి చేతుల్లో విలవిలలాడుతున్న భారత్

కరోనా రక్కసి చేతుల్లో విలవిలలాడుతున్న భారత్

మొత్తంగా చూస్తే భారత దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం భారతదేశ ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. లాక్ డౌన్ ఆంక్షల నుండి సడలింపుల నేపథ్యంలో కేసులు పెరుగుతున్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో లాక్ డౌన్ ను మరోమారు పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కరోనా రక్కసి చేతుల్లో ఇప్పుడు భారతదేశం విలవిల లాడుతుంది. అటు ఆర్ధిక సంక్షోభం , మరో పక్క చైనాతో బోర్డర్ టెన్షన్ , ఇంకో పక్క కరోనా ఇప్పుడు భారత దేశ ప్రభుత్వానికి వూపిరి ఆడకుండా చేస్తుంది .

English summary
India registered 6,566 new COVID-19 cases in the past 24 hours, thereby taking the total number of confirmed coronavirus cases at 1,58,414, according to the latest data released by the Ministry of Health and Family Welfare. The figure also includes 86,120 active cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X