వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona update : కరోనా కేసుల్లో టాప్ 10 లో భారత్ .. కొత్త కేసుల నమోదులో 4వ స్థానం

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి భారతదేశంలో చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. ఇక ప్రపంచదేశాల కరోనా కేసుల జాబితాలో భారత్‌ 10వ స్థానానికి చేరింది. ప్రపంచంలో మొత్తం కేసుల్లో 10వ స్థానంలో ఉన్నా, కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మాత్రం భారత్‌ 4వ స్థానంలో ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత అత్యంత ఎక్కువ కేసులు భారత్‌లోనే నమోదవుతుండటంతో ప్రస్తుతం ఇండియా డేంజర్ జోన్ లో ఉన్నట్టు అర్ధం అవుతుంది.

కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియాకరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా

 లక్షా యాభై వేలకు చేరువలో భారత్ లో కరోనా కేసులు

లక్షా యాభై వేలకు చేరువలో భారత్ లో కరోనా కేసులు

ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు చూస్తే 1,44,950 కేసులు నమోదు అయ్యాయి. గత నాలుగు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6977 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.ఇక రోజురోజుకూ కొత్త కేసుల రికార్డ్ పెరిగిపోతూనే ఉంది. 24గంటల్లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య లక్షా యాభై వేలకు చేరువలో ఉండగా అత్యధికంగా కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌ టెన్‌లోకి వెళ్లింది.యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 80,061 గా ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసుల్లో హాట్ స్పాట్ నగరంగా ముంబై

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసుల్లో హాట్ స్పాట్ నగరంగా ముంబై

భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో మరణించిన వారి సంఖ్య 4,172. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మరియు ఢిల్లీలలో ఇంకా కేసులు కంట్రోల్ లేకుండా నమోదవుతున్నాయి.దేశంలోన‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్ర‌లోనే స‌గానికిపైగా ఉన్నాయి. ఇక్క‌డి ముంబై క‌రోనా హాట్ స్పాట్ గా మారింది . ఈ మ‌హా న‌గ‌రంలో సుమారు 0.22 శాతం జ‌నాభా వైర‌స్‌ బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వాణిజ్య న‌గ‌రం ప్ర‌పంచంలోనే అత్యధిక కేసులతో మొదటి హాట్ స్పాట్ నగరంగా మారనుంది.

ప్రపంచవ్యాప్తంగా 5.4 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు

ప్రపంచవ్యాప్తంగా 5.4 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు

ప్రపంచవ్యాప్తంగా 5.4 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, అలాగే కనీసం 344,000 మరణాలు సంభవించాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

దక్షిణ అమెరికా దేశంలో కేసుల సంఖ్య పెరగడంతో 14 రోజుల్లో బ్రెజిల్‌కు వెళ్లిన ఎవరికైనా అమెరికా ప్రవేశాన్ని నిలిపివేసింది. గత 24 గంటల్లో బ్రెజిల్ దేశం 11,687 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా మొత్తం 374,898 కు చేరుకుందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 807 కొత్త కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి, దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 23,473 కు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి ఎక్కువగా ప్రభావితమైన దేశాల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్ ఇప్పుడు టాప్ లో ఉంది.

English summary
According to latest data, India has reported 6977 new cases of coronavirus in the last 24 hours. This led to a total of 1,44,950 cases and 4,172 deaths in India. An increasing number of cases is the most alarming factor. now india baame in top 10 in corona cases and in top 4 with new cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X