వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona update : ప్రపంచంలో 9వ స్థానానికి భారత్ .. ఇండియాలో తాజా పరిస్థితి ఇది !!

|
Google Oneindia TeluguNews

భారత్ లో కరోనా పంజా విసురుతుంది . ఇప్పుడు భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానానికి చేరుకుంది . ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ మరియు జర్మనీల కరోనా మహమ్మారి వలన భారతదేశం తొమ్మిదవ ప్రభావిత దేశంగా మారింది . కరోన కేసుల్లో ఒక్కో స్థానం ఎగబాకుతూ ఇండియా ఆందోళనకర పరిస్థితి కలిగిస్తుంది.

corona update : కరోనా కోరల్లో ఇండియా .. గత 24 గంటల్లో 6,566 పాజిటివ్‌ కేసులు, 194 మరణాలుcorona update : కరోనా కోరల్లో ఇండియా .. గత 24 గంటల్లో 6,566 పాజిటివ్‌ కేసులు, 194 మరణాలు

ఇండియాలో కరోనా పంజా .. 24 గంటల్లో 7 వేలకు పైగా కేసులు

ఇండియాలో కరోనా పంజా .. 24 గంటల్లో 7 వేలకు పైగా కేసులు

భారత దేశంలో కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుంది . రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది . గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7వేలకు పైగా కొత్తగా వైరస్ కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు . అయితే, గడచిన 6 రోజులతో పోలిస్తే నిన్న 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో, దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 65వేలు దాటింది. ఇక ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా రోజురోజూకు పెరుగుతుంది.

భారత్ లో లక్షా అరవై ఐదు వేలకు పైగా కరోనా కేసులు

భారత్ లో లక్షా అరవై ఐదు వేలకు పైగా కరోనా కేసులు

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 1,65,729 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 90,087 గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 175 మంది కరోనా బారినపడి మృతిచెందారు. ఇప్పటి వరకు 70,920 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 4,711కి పెరిగింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపధ్యంలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇక ఈ క్రమంలో కరోనా కొత్త కేసులు ప్రభుత్వాలను టెన్షన్ పెడుతున్నాయి.

60 లక్షలకు చేరుకున్న ప్రపంచ కరోనా కేసుల సంఖ్య

60 లక్షలకు చేరుకున్న ప్రపంచ కరోనా కేసుల సంఖ్య

ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 61 వేల 998 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 25 లక్షల 79 వేల 534 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Recommended Video

Karnataka Restricts Air, Road, Rail Travel From 5 States
 అమెరికాలో లక్షకు పైగా మరణాలు

అమెరికాలో లక్షకు పైగా మరణాలు

కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతుంది .కరోనా కారణంగా యూఎస్‌ఏ లో ఇప్పటి వరకు 1,03,330 మంది చనిపోయారు. బీజింగ్ యొక్క అధికారిక డేటా ప్రకారం, చైనా ఇప్పటివరకు సుమారు 83,000 కరోనావైరస్ కేసులను నిర్ధారించింది. ప్రాణాంతక కరోనా వైరస్ తో 4,634 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఇక ప్రపంచంలో వేగంగా కరోనా కేసులు పెరుగుతున్న ఇండియా ఇప్పుడు 9 వ స్థానానికి చేరింది.

English summary
India has emerged as the ninth most affected nation by the COVID-19 pandemic after the United States of America, Brazil, Russia, the United Kingdom, Spain, Italy, France and Germany.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X