వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona update : మరో రెండు వారాల్లో టాప్ 4 కు ఇండియా ? రోజుకు 9వేలకు పైగా కేసులు

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది.కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో ఏడవ స్థానంలో ఉన్న భారత్ మరో రెండు వారాల్లో టాప్ 4 కు చేరే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారత్ ఇప్పుడు ప్రమాదపు అంచులకు చేరుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

corona India update : మహమ్మారి పంజా ..గత 24 గంటల్లో 9,304 కొత్త కేసులతో బిగ్గెస్ట్ జంప్corona India update : మహమ్మారి పంజా ..గత 24 గంటల్లో 9,304 కొత్త కేసులతో బిగ్గెస్ట్ జంప్

ప్రపంచంలో నాల్గవ స్థానానికి చేరేలా పెరుగుతున్న కేసులు

ప్రపంచంలో నాల్గవ స్థానానికి చేరేలా పెరుగుతున్న కేసులు

కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా రోజుకు ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి నుండి ఇప్పుడు రోజుకు తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితికి ఇండియా చేరుకుంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ప్రకారం పరిశీలిస్తే, ఈ వారంలోనే మనకన్నా కాస్త ముందున్న ఇటలీ, స్పెయిన్ లను అధిగమిస్తుందని, ఆపై మరికొన్ని రోజుల్లోనే యూకేను అధిగమించి 4వ స్థానానికి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలో కేసుల్లో అమెరికా ఫస్ట్ .. మొత్తం ప్రపంచంలో నమోదైన కేసులు 66,98,615

ప్రపంచంలో కేసుల్లో అమెరికా ఫస్ట్ .. మొత్తం ప్రపంచంలో నమోదైన కేసులు 66,98,615

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కేసుల్లో ప్రస్తుతం ప్రథమ స్థానంలో అమెరికా కొనసాగుతోంది. ఆ తర్వాత బ్రెజిల్, రష్యా , యూకే , స్పెయిన్, ఇటలీలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. అమెరికాలో 19 లక్షల 24 వేల 51 మందికి కరోనా వైరస్ పాజిటివ్ బాధితులు ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక మరణాలు కూడా బాగానే నమోదవుతున్నాయి.ఇప్పటివరకు అమెరికాలో ఒక లక్ష పదివేల 173 మంది కరోనా పాజిటివ్ తో మరణించారు.ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు 66,98,615 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఇప్పటివరకు 3,93,142 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు.

గత 24 గంటల్లో 9851 కొత్త కేసులు, 273 మరణాలు

గత 24 గంటల్లో 9851 కొత్త కేసులు, 273 మరణాలు

ఇక ఇండియాలోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు భయంకరంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రతి 15 రోజులకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది అంటే, ప్రస్తుతమున్న కేసుల సంఖ్య 2. 26 లక్షల కేసులు, ఈ నెల 20వ తేదీకి సుమారు 4 లక్షలను దాటి పోతాయి. ఆపై మరో రెండు వారాల్లో కేసుల సంఖ్య 8 లక్షలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9851 కొత్త కేసులు నమోదు కాగా, 273 మంది మరణించారు.దీంతో ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 2,26,770. ఇక మొత్తం మరణాల సంఖ్య 6348 చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

రోజురోజుకూ ప్రమాదంలో ఇండియా .. ఎక్కువ టెస్టులు చేస్తే కేసులు బాగా పెరిగే ఛాన్స్

రోజురోజుకూ ప్రమాదంలో ఇండియా .. ఎక్కువ టెస్టులు చేస్తే కేసులు బాగా పెరిగే ఛాన్స్

ఇండియాలో పెద్ద సంఖ్యలో టెస్టులు జరగలేదని, ఎక్కువగా టెస్ట్ లను నిర్వహిస్తే వాస్తవ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ విపరీతంగా పెరిగిన కేసులతో ఏడో స్థానంలో ఉన్న భారత్ పరిస్థితి కరోనా వైరస్ విషయంలో రోజురోజుకు దిగజారిపోతుంది. ఇక, రష్యా మాదిరిగా ప్రతి 10 లక్షల మందిలో 2 వేల మందికి పరీక్షలు చేస్తే, ఇండియాలో కేసుల సంఖ్య ఊహించడానికే భయంకరంగా ఉంటుందన్నది ఒక అభిప్రాయం. ఏదేమైనప్పటికీ భారతదేశం ఇప్పుడు కరోనా రక్కసి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. కొత్త కేసుల పెరుగుదల ఈ విధంగా ఉంటే ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది.

English summary
India reported 9,851 new Covid-19 cases and 273 deaths in the last 24 hours, taking the country's tally to 2,26,770. The death toll stands at 6,348. As per the health ministry..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X