వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా అప్డేట్ : దేశ వ్యాప్తంగా 50 వేలకు చేరువలో కరోనా కేసులు ... రాష్ట్రాల వారీగా కేసులు ఇవే

|
Google Oneindia TeluguNews

ఇండియాలో లాక్ డౌన్ ౩.o కొనసాగుతున్నప్పటికీ భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 49,401 కు పెరిగింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం దేశంలో మరణించిన వారి సంఖ్య కూడా నిన్న సాయంత్రం నుండి 194 పెరిగి 1,694 కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రస్తుతం నమోదైన మొత్తం కేసుల్లో 33,561 క్రియాశీల కేసులు ఉన్నాయి. అయితే 14,162 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు .కరోనా పాజిటివ్ ధృవీకరించబడిన మొత్తం కేసులలో 111 మంది విదేశీ పౌరులు కూడా ఉన్నారు.

మహారాష్ట్రలో కంట్రోల్ లోకి రాని కరోనా .. తీవ్ర నిర్ణయాల దిశగా మహా సర్కార్మహారాష్ట్రలో కంట్రోల్ లోకి రాని కరోనా .. తీవ్ర నిర్ణయాల దిశగా మహా సర్కార్

 దేశంలో టాప్ 3 లో మహారాష్ట్ర , గుజరాత్, తమిళనాడు

దేశంలో టాప్ 3 లో మహారాష్ట్ర , గుజరాత్, తమిళనాడు

మొత్తం కేసులలో, 771 తాజా కేసులు మరియు నిన్నటి నుండి 35 మరణాలు సంభవించిన తరువాత, మహారాష్ట్రలో కరోనా కేసులు 15,525 కు పెరిగాయి. వైరస్ సంబంధిత మరణాలు కూడా 617కి పెరిగాయి. ఇప్పటివరకు 6,245 కేసులు నమోదయినందున గుజరాత్ రెండవ స్థానంలో ఉంది, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 5,104కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 527 మంది కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షలు చేయడంతో తమిళనాడులో అత్యధిక కేసులు నమోదయ్యాయి, మొత్తం 4,058 కు చేరుకుంది.

వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

ఇక మిగతా రాష్ట్రాల కరోనా కేసులను చూస్తే రాజస్థాన్ 3,158 కేసులు నమోదు కాగా 89 మరణాలు సంభవించాయి. మధ్యప్రదేశ్3, 049 కేసులు నమోదు కాగా 176 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 2,880 కేసులు నమోదు కాగా 56 మరణాలు సంభవించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1,717 కేసులు నమోదు అయ్యాయి. 34 మంది మరణించారు . పంజాబ్ లో 1,451 కేసులు నమోదు కాగా 25 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే 1,344 కేసులు నమోదు అయ్యాయి. 140 మంది మరణించారు.

కర్ణాటక , కేరళలో కంట్రోల్ లోకి వస్తున్న కరోనా

కర్ణాటక , కేరళలో కంట్రోల్ లోకి వస్తున్న కరోనా

తెలంగాణ రాష్ట్రంలో 1, 096 కేసులు నమోదు అయ్యాయి. 29 మరణాలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్ 741 కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. కర్ణాటక 673 కేసులు నమోదు కాగా 29 మంది మరణించారు. హర్యానా 548 కేసులు నమోదు కాగా 6 మరణాలు నమోదు అయ్యాయి. బీహార్ లో 535 కేసులు నమోదు కాగా 4 మరణాలు జరిగాయి. ఇక మొన్నటి వరకు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళ రాష్ట్రంలో 503 కేసులు నమోదు కాగా 4 మరణాలు సంభవించాయి.

ఛత్తీస్ గడ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తక్కువగా నమోదైన కేసులు

ఛత్తీస్ గడ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తక్కువగా నమోదైన కేసులు

ఒడిషా రాష్ట్రంలో 177 కేసులు నమోదు కాగా 12 మంది మృతి చెందారు. జార్ఖండ్ విషయానికి వస్తే 125 కేసులు నమోదు కాగా 3 మరణాలు జరిగాయి. చండీగఢ్ లో 115 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఉత్తరాఖండ్ 61 కేసులు ఒక్క మరణం , ఛత్తీస్గఢ్ 59 కేసులు నమోదు కాగా ఎవరూ మృతి చెందలేదు . అస్సాం 45 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు . లడఖ్ 42 కేసులు నమోదు అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ 42 కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. త్రిపుర 42 కేసులు నమోదు అయ్యాయి.

 ఒకే ఒక్క కేసుతో లాస్ట్ లో ఉన్న అరుణా చల్ ప్రదేశ్ , మిజోరాం , డయ్యు డామన్ లు

ఒకే ఒక్క కేసుతో లాస్ట్ లో ఉన్న అరుణా చల్ ప్రదేశ్ , మిజోరాం , డయ్యు డామన్ లు

ఇక అండమాన్ మరియు నికోబార్ దీవులు 33 కేసులు , మేఘాలయ 12 కేసులు నమోదు అయ్యాయి. ఒక మరణం సంభవించింది . పుదుచ్చేరి 9 కేసులు , గోవా 7 కేసులు , మణిపూర్ 2 కేసులు , మిజోరం ఒక కేసు, అరుణాచల్ ప్రదేశ్ 1 కేసు , దాద్రా మరియు నగర్ హవేలి మరియుడయ్యు డామన్ ఒక్క కేసు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా, కరోనావైరస్ కేసుల సంఖ్య 3.6 మిలియన్ లను అధిగమించగా, మరణాల సంఖ్య 2,50,000 మార్కును దాటిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి.యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పుడు దేశంలో 1.2 మిలియన్లకు పైగా కేసులు ఉన్నాయి, మరణాల సంఖ్య 69,000 దాటింది. 32,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారని కొత్త అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

Recommended Video

Viral Video : Watch How People Are Crazy To Get Wine | Oneindia Telugu

English summary
The total number of novel coronavirus cases in India today increased to 49,401 according to the latest data from the Ministry of health and Family Welfare. The death toll in the country also rose by 1,694
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X