Corona Vaccine: ఐటీ హబ్ లో కోటి మంది ప్రజలు, 8 కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు, 1 లక్ష వ్యాక్సిన్ లు!
బెంగళూరు: భారతదేశంలో 3,006 కేంద్రాల్లో నేడు కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీలో 8 కేంద్రాల్లో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఐటీ కంపెనీలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు సిటీలో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా కోవిడ్ టీకాలు వేసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. బెంగళూరులో కోటి మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో ఇప్పటికే లక్ష కోవిడ్ వ్యాక్సిన్ లు నిల్వ చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సందర్బంగా ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
COVID-19: చైనాను మళ్లీ చింపేస్తున్న వైరస్, చేసుకున్నోడికి చేసుకున్నంత, 20 వేల మంది క్వారంటైన్!

బెంగళూరులో 8 కేంద్రాలు
బెంగళూరు సిటీలో శనివారం 8 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. బెంగళూరు సిటీలోని విక్టోరియా ఆసుపత్రి, కేసీ. జనరల్ ఆసుపత్రి, సీవీ రామన్ నగర్, జయనగర్, సెంట్ జాన్స్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి, మల్లసంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఈస్ట్ పాయింట్ మెడికల్ కాలేజ్, యలహంక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

బీబీఎంపీ ఆధ్వరంలో ప్రారంభం
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన తరువాత బెంగళూరులో కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం అయ్యింది. బీబీఎంపీ కమిషనర్ ఎన్. మంజునాథ్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పనితీరును పరిశీలించారు. బీబీఎంపీ మేయర్ తో పాటు బీబీఎంపీ కార్పోరేటర్లు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు.

లక్ష కోవిడ్ వ్యాక్సిన్ డోసులు
బెంగళూరు సిటీలో 1. 05 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు నిల్వ చేశారు. జనవరి 18వ తేదీ సోమవారం నుంచి కోవిడ్ టీకాలు వేసే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని, సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీబీఎంపీ సిద్దం అయ్యింది. బీబీఎంపీ పరిధిలోని 760 కేంద్రాలను కోవిడ్ టీకాలను సరఫరా చెయ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బెంగళూరు సిటీలో కోటి మందికి పైగా జనాబా ఉన్నారు. మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆరోగ్య శాఖ కార్యకర్తలు, 50 ఏళ్ల పూర్తి అయిన వారికి కోవిడ్ టీకాలు వెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం, బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు.