హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Vaccine: మీ వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం ఉందా ?, అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు, ఇదే !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/లక్నో/హైదరాబాద్: బారతదేశంలో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ టీకాల పంపిణి కార్యక్రమం మొదలైయ్యింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్ డీఏ మిత్రపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ పై అంతనమ్మకం ఉంటే ప్రభుత్వ అధికారులు, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఎందుకు ఆ టీకాలు వేసుకోవడం లేదు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ మాకు కావాలని ప్రజలు ధైర్యంగా ముందుకు రావడంలేదని మాజీ సీఎం సెటైర్లు వేశారు. అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు అంటే ఇదే అని ప్రజలు ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు.

Coronavirus: చైనా చెత్తనా కొడుకుల దెబ్బకు 20 లక్షల మంది బలి, ప్రపంచం కన్ను భారత్ వ్యాక్సిన్ పైనే !Coronavirus: చైనా చెత్తనా కొడుకుల దెబ్బకు 20 లక్షల మంది బలి, ప్రపంచం కన్ను భారత్ వ్యాక్సిన్ పైనే !

మీకు నమ్మకం ఉందా ?

మీకు నమ్మకం ఉందా ?

కోవిడ్ వ్యాక్సిన్ ప్రజల ప్రాణాలు కాపాడుతుందని, కరోనా టీకాలపై ప్రజలు నమ్మకం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి వ్యంగంగా అన్నారు. కోవిడ్ టీకాలపై కేంద్ర ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే ఇంత వరకు కేంద్ర మంత్రులు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వ్యాక్సిన్ పైన ప్రజలకు నమ్మకం లేదు

వ్యాక్సిన్ పైన ప్రజలకు నమ్మకం లేదు

కోవిడ్ వ్యాక్సిన్ మీద ప్రజలకు ఏ మాత్రం నమ్మకం లేదని, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ మాకు వెయ్యండి అని అడగడం లేదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతోందని కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారే తప్పా ఆ టీకాల మీద ప్రజలకు ఇంకా నమ్మకం రాలేదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కోవిడ్ వ్యాక్సిన్ పై అనుమానాలు ?

కోవిడ్ వ్యాక్సిన్ పై అనుమానాలు ?

భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ టీకాలు వెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని శాస్త్రవేత్తలు సైతం సూచించారని, అయితే ప్రభుత్వం టీకాలు వెయ్యడానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ టీకాలు వేసుకోవాలో ప్రజలే నిర్ణయించుకునే స్వేచ్చను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని కొందరు ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

వందతులు నమ్మకూడదు

వందతులు నమ్మకూడదు

కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం అని శాస్త్రవేత్తలు పలు సార్లు పరీక్షించిన తరువాత ప్రజలకు వేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చెప్పారు. ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితం కాదని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు, వందతులను నమ్మకూడదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు మనవి చేశారు.

అమ్మ పెట్టదు.... అడుక్కుతిన్నీయ్యదు అంటే ఇదే !

అమ్మ పెట్టదు.... అడుక్కుతిన్నీయ్యదు అంటే ఇదే !

కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఇంతకాలం ప్రపంచ దేశాల ప్రజలు ఆశగా ఎదురు చూశారు. శనివారం భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నాయకులు కోవిడ్ వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు వింటుంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నీయ్యదు అనే సామెతలా ఉంది ప్రస్తుత పరిస్థితి అని ప్రజలు ప్రతిపక్షాల మీద మండిపడుతున్నారు.

English summary
Corona Vaccine: Congress leader Manish Tewari once again attacked the Centre over the vaccines against the coronavirus disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X