Corona Vaccine: వ్యాక్సిన్ వేసుకుంటే ఈ నియమాలు పాటించాలి, కేంద్రం ఆదేశాలు, చెప్పేది మీకోసమే !
న్యూఢిల్లీ/హైదరాబాద్/ విజయవాడ: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ బృహత్తర టీకా పంపిణి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే 3,006 కేంద్రాల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు, టీకాలు వేస్తున్న ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు మనవి చేశారు. ఈ సూచనల, సలహాలు మీ కోసమే అని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తు చేసింది.
Coronavirus: చైనా చెత్తనా కొడుకుల దెబ్బకు 20 లక్షల మంది బలి, ప్రపంచం కన్ను భారత్ వ్యాక్సిన్ పైనే !

టీకా వేసుకుంటే గంట సేపు అలా చెయ్యాలి
కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రపంచ దేశాల ప్రజలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను ప్రజలు ధైర్యంగా వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా వ్యాక్సిన్ పంపిణితో నేడు భారతదేశం సత్తా ప్రపంచానికి తెలిసింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరు తరువాత గంట సేపు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

విశ్రాంతి తీసుకుంటే మనకే మంచింది
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కనీసం గంటసేపు విశ్రాంతి తీసుకుంటే వారి దేహంలో ఆ టీకా ప్రభావం చూపుతుందని, టీకా ప్రభావం కచ్చితంగా శరీరంలో చూపిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కచ్చితంగా కనీసం గంట సేపు విశ్రాంతి తీసుకోవాలని వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలు సూచించారు.

కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నిఘా
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న అన్ని కేంద్రాల్లో అనేక నియమాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న అన్ని కేంద్రాల్లో, పరిసర ప్రాంతాల్లో ప్రతిఒక్కరూ కచ్చితంగా ముఖాలకు మాస్క్ లు వేసుకోవాలని, ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

భారత్ సత్తా తెలిసింది
భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా అని ఇంతకాలం ఎదురు చూసింది. ఆ శుభముహూర్తానికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. కరోనా వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమం ప్రారంభం కావడం, ఎలాంటి ఆంటకాలు లేకుండా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ మొదలు కావడంతో భారత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.