వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో కరోనా వ్యాక్సిన్: ధర ఫిక్స్: నో ఎక్స్‌ట్రా: అక్కడ ఫ్రీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. డోసు ధరను నిర్ధారించింది. ఒక్కో డోసు ధరను 250 రూపాయలగా ఖరారు చేసింది. అన్ని రకాల పన్నులు, సర్వీస్ ఛార్జీలను ఇందులోనే కలిపారు. దీనికి మించి అదనంగా ఎలాంటి డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల రూపంలో తీసకోవాల్సి ఉన్నందున.. ఈ రెండింటికీ కలిపి 500 రూపాయలను ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తారు.

వ్యాక్సిన్ వేసే సమయంలోనే డబ్బులు కడితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యాక్సిన్ డోసు ధర 150 రూపాయలు. ఇందులోనే ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన సర్వీస్ ఛార్జీని కలిపారు. 100 రూపాయలను సర్వీస్ ఛార్జీగా కట్టాల్సి ఉంటుంది. ఫలితంగా దీని ధర ఒక్కో డోసుకు 250 రూపాయలుగా నిర్ధారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తారు.

Corona vaccine price fixed at Rs 250 per dose in private hospitals by the Centre

మార్చి 1వ తేదీ నుంచి 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారు వ్యాక్సిన్‌ను వేయించుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే- 45 సంవత్సరాలు దాటి వేర్వేరు వ్యాధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లకు కూడా వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

vABP C-Voter Opinion Poll: వెస్ట్ బెంగాల్..బెస్ట్ సీఎం అభ్యర్థి ఎవరు?: బీజేపీకి ఎంతమంది జై?vABP C-Voter Opinion Poll: వెస్ట్ బెంగాల్..బెస్ట్ సీఎం అభ్యర్థి ఎవరు?: బీజేపీకి ఎంతమంది జై?

ప్రభుత్వ ఆసుప్రతుల్లో నిరుపేదలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేసే సౌకర్యాన్ని కల్పించినందున.. దాన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత ఉన్న వారికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ దాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలంటూ అందిన విజ్ఙప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేర్లను నమోదు చేసుకున్న 10 వేలకు పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో తొలిదశలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రైవేటు ఆసుపత్రులకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించాలని నిర్ణయించామని అన్నారు.

English summary
Private hospitals can charge up to Rs 250 per dose of COVID-19 vaccine, the Union Health Ministry said as India prepares to vaccinate people aged above 60 years and those over 45 with comorbidities from March 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X