హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ హాట్ స్పాట్ .. ఢిల్లీ నిజాముద్దీన్ మసీదు .. 128 మందికి కరోనా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లోని మర్కజ్ నిజాముద్దీన్ లో 100 సంవత్సరాల నాటి మసీదు ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది . ఇక ఈ మసీదులో జరిగిన మత ప్రచార సభ దేశ వ్యాప్త సంచలనమైంది. ఇక్కడ ఇటీవల తబ్లీఘీ జమాత్ మతపరమైన ప్రార్ధనా సభకు హాజరైనవారికి చాలా మందికి కరోనా లక్షణాలు బయటపడటం సంచలనం అయ్యింది . ఒకపక్క ప్రపంచమే కరోనా దెబ్బకు వణుకుతుంటే అదేమీ పట్టకుండా కరోనాకు కీరాఫ్ అడ్రెస్ గా మారింది నిజాముద్దీన్ లో ఉన్న మసీదు .

ఢిల్లీలో కరోనా టెర్రర్ ... నిజాముద్దీన్‌ లో సభ ఎఫెక్ట్ ..కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ఢిల్లీలో కరోనా టెర్రర్ ... నిజాముద్దీన్‌ లో సభ ఎఫెక్ట్ ..కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

సుమారు 128 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

సుమారు 128 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

అసలు తబ్లీఘీ జమాత్ అన్నది 1926 లో ఏర్పాటైన ఇస్లామిక్ మిషన్ సంస్థ.. ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా సభ్యులున్నారు. ఇక తబ్లీఘీ జమాత్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ అయిన ఈ మసీదు కరోనావైరస్ హాట్ స్పాట్ గా మారటంతో ఒక్కసారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి .ఈ మసీదులో ఈ మధ్య జరిగిన కార్యక్రమాలకు హాజరైనవారిలో సుమారు 128 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వీరంతా వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వఛ్చినవారు.

సభకు వచ్చిన వారిలో కరోనా బాధితులను గుర్తించే పనిలో అధికారులు

సభకు వచ్చిన వారిలో కరోనా బాధితులను గుర్తించే పనిలో అధికారులు

సుమారు రెండు వేల మంది ఈ మసీదులో ఉన్నారని మర్కజ్ అధికారులు తెలిపారు. మార్చి 8 నుండి 10 తేదీల మధ్య ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న తబ్లీఘీ సభ్యుల ఆచూకీని కనుగొనాలని హోం శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇక వారందరికీ కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయం తీసుకుంది . ఇక ఇప్పటికే ఈ సభకు వచ్చిన వారిలో తమిళనాడు నుంచి 50 మంది, ఢిల్లీ నుంచి 24, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 21 మంది చొప్పున, అండమాన్ నికోబార్ నుంచి 10 మంది, అస్సాం, జమ్మూకాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులున్నారు.

సభలో విదేశీయులు .. వారి ద్వారానే వ్యాప్తి జరిగిందని అంచనా

సభలో విదేశీయులు .. వారి ద్వారానే వ్యాప్తి జరిగిందని అంచనా

ఇక ఈ సభలో పాల్గొన్న 824 మంది విదేశీయులు కూడా వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లి మరీ ఆయా రాష్ట్రాల వారికి కరోనాను అంటించారు. తెలంగాణా రాష్ట్రంలో ఇండోనేషియా నుండి కరీం నగర్ కు వచ్చినవారు తబ్లీఘీ జమాత్ సభకు వెళ్లి వచ్చినవారే . ఇక ఈ సభలో చాలా మందికి కరోనా ఎఫక్ట్ అయిందని భావిస్తున్న సర్కార్ వారి వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చెయ్యటమే కాకుండా వారందరినీ ఐసోలేషన్ కు పంపాలని పేర్కొంది. ఇక యుద్ధ ప్రాతిపదికన అన్ని రాష్ట్రాల్లో అధికారులు సభకు వెళ్లి వచ్చిన వారి జాబితా సేకరించే పనిలో పడ్డారు.

English summary
The mosque, which is the headquarters of the Tablighi Jamaat group, has become a coronavirus hot spot. Nearly 128 of those attended at the mosque have seen corona positive symptoms . They come from different countries and states .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X