వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో మందిర నిర్మాణంతో కరోనా వైరస్ నిర్మూలన: బీజేపీ ఎంపీ మీనా సంచలన వ్యాఖ్యలు..

|
Google Oneindia TeluguNews

బీజేపీ ఎంపీ జస్‌కౌర్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరిం నిర్మించిన తర్వాతనే కరోనా వైరస్ సమూలంగా నిర్మూలన జరుగుతోందన్నారు. మీనా.. రాజస్తాన్‌లో దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైరస్ నిర్మూలనకు అయోధ్యలో మందిరం నిర్మాణం ఒక్కటే పరిష్కారం అని నొక్కి వక్కనించారు. ఆధ్యాత్మిక శక్తులను నమ్మే విశ్వాసనీయులం, అనుచరులందరూ.. కూడా తనతో ఏకీభవిస్తారని తెలిపారు.

 అయోధ్య భూమి పూజ: టీవీ చానెళ్లపై ఆంక్షలు - ఆ తరహా డిబేట్లు వద్దు - ముందస్తు అనుమతి మస్ట్.. అయోధ్య భూమి పూజ: టీవీ చానెళ్లపై ఆంక్షలు - ఆ తరహా డిబేట్లు వద్దు - ముందస్తు అనుమతి మస్ట్..

మీనా వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే అంతకుముందు మరో బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కూడా ఇలానే కామెంట్లు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగాకే దేశంలో వైరస్ అంతమొందుతుందని చెప్పారు. ఆ తర్వాత మీనా కూడా మందిరానికి, వైరస్‌కు లింక్ పెడుతూ కామెంట్లు చేశారు.

Corona will be destroyed as soon as Ram temple is built: BJP MP Jaskaur Meena

Recommended Video

V Haumantharao Slams BJP & Also Requested AICC To Recognise Party Workers

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్ట్ 5వ తేదీన భూమి పూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కరోనా వైరస్ వల్ల 200 మంది అతిథులకే మాత్రమే భూమి పూజలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నారు. వాస్తవానికి భూమి పూజ ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ పెరగడం, లాక్ డౌన్ వల్ల అదీ ఆగస్ట్ 5వ తేదీన నిర్వహించబోతున్నారు.

English summary
BJP MP Jaskaur Meena has claimed that novel coronavirus will be destroyed as soon as Ram temple in Ayodhya is built
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X