• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇండియాలో కరోనా పంజా .. రికార్డు స్థాయిలో 1,761 మరణాలు, వణికిస్తున్న మహమ్మారి

|

భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కరోనా విసిరిన పంజా దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. వేలాదిగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని దారుణ పరిస్థితులకు తీసుకువెళుతుంది. గత 24 గంటల్లో భారతదేశం అత్యధికంగా 1,761 కోవిడ్ మరణాలను నమోదు చేసింది, ఇది ఇప్పటివరకు అతిపెద్ద రోజువారీ మరణాల సంఖ్య . 2.59 లక్షలకు పైగా కొత్త కేసులతో కరోనా విలయం కొనసాగుతుంది.

మళ్ళీ మొదలైన వలస కార్మిక వెతలు .. ఢిల్లీలో లాక్ డౌన్ తో 2020 సీన్ రిపీట్మళ్ళీ మొదలైన వలస కార్మిక వెతలు .. ఢిల్లీలో లాక్ డౌన్ తో 2020 సీన్ రిపీట్

 1.53 కోట్లకు పైగా ఇండియాలో కరోనా కేసులు

1.53 కోట్లకు పైగా ఇండియాలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ లో ఆందోళనకరమైన పెరుగుదల కారణంగా ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1.53 కోట్లకు పైగా పరిగింది . దేశం రెండు లక్షలకు పైగా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి గత కొద్ది రోజులుగా కనిపిస్తుంది. మహమ్మారి ప్రారంభం నుండి నమోదైన మొత్తం కేసులలో భారతదేశం అమెరికా తరువాత రెండవ స్థానంలో ఉంది. 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ మే 1 నుండి కోవిడ్-19 టీకాలు ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది.వ్యాక్సిన్ తయారీదారులు ముందుగా ప్రకటించిన ధరకు 50% మోతాదులను కేంద్రానికి, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్‌కు సరఫరా చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం ..గత 24 గంటల్లో 58,924 కొత్త కేసులు

మహారాష్ట్రలో కరోనా కల్లోలం ..గత 24 గంటల్లో 58,924 కొత్త కేసులు

దేశంలో అత్యంత నష్టపోయిన రాష్ట్రమైన మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 38.98 లక్షలకు పైగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 351 కొత్త మరణాలు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్యను 60,824 కు పెంచాయి. మొత్తం కేసుల విషయానికొస్తే, మహారాష్ట్ర తరువాత దక్షిణ రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

 2 లక్షలకు మించి కేసుల నమోదు ఆరోరోజు

2 లక్షలకు మించి కేసుల నమోదు ఆరోరోజు

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశం యొక్క రోజువారీ కేసులు 200,000 ను అధిగమించటం వరుసగా ఇది ఆరవ రోజు, అయితే, ఈ సంఖ్య సోమవారం కంటే కొంచెం తక్కువగా ఉంది, నిన్న ఒక్క రోజు సంఖ్య 273,810 కేసులు నమోదు అయ్యాయి .


ఇక నేడు ఆ సంఖ్య కాస్త తగ్గింది . గత 24 గంటల్లో 259,170 తాజా కేసులు మరియు 1,761 మరణాలు నమోదయ్యాయి .

  COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu
  ఢిల్లీలో కేసులు విపరీతం .. 6 రోజుల లాక్ డౌన్ లో దేశ రాజధాని ఢిల్లీ

  ఢిల్లీలో కేసులు విపరీతం .. 6 రోజుల లాక్ డౌన్ లో దేశ రాజధాని ఢిల్లీ

  భారతదేశం ప్రపంచ రికార్డు వేగంతో ప్రజలకు టీకాలు ఇస్తుంది .రోజువారీ కేసులు విపరీతమైన వేగంతో పెరుగుతున్నందున, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, వారాంతపు కర్ఫ్యూతో సహా కఠినమైన ఆంక్షలు విధించాయి . విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించాయి. గత రెండు వారాల్లో కోవిడ్ -19 కేసులు దాదాపు 600% పెరగడంతో సోమవారం రాత్రి ప్రారంభమైన ఆరు రోజుల లాక్‌డౌన్‌ను దేశ రాజధాని ఢిల్లీ కొనసాగిస్తుంది. కేసుల పెరుగుదల వైద్య సదుపాయాల కొరతకు దారితీసింది. కోవిడ్ -19 రోగులకు ఐసియు పడకలు మరియు ఆక్సిజన్ సిలిండర్ల అవసరాన్ని ఢిల్లీ తీర్చలేకపోతోంది.

  English summary
  India’s Covid-19 tally breached the 15.3 million-mark with 259,170 fresh cases and 1,761 fatalities, the biggest daily spike, recorded in the last 24 hours, This is the sixth day in a row that the country’s daily infection caseload has surpassed 200,000.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X