బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus Lockdown: బెంగళూరు అల్లర్ల వెనుక లేఢీ డాన్ సరోజ ?, దూలతీరింది, సీఎం సీరియస్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి సోకిన వారిని క్వారంటైన్ కు తరలించడానికి బెంగళూరులోని పాదరాయనపుర వార్డులోకి వెళ్లిన పోలీసులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాదరాయనపురలో ఇంత గొడవ జరగడానికి అక్కడే నివాసం ఉంటున్న లేడీ డాన్ సరోజ కారణం అని పోలీసులు గుర్తించారు, గంజాయి సేవించిన యువకులను ఆ లేడీ డాన్ సరోజ రెచ్చగొట్టిందని, ఆ యువకులు పోలీసులు, వైద్య సిబ్బంది, బీబీఎంపీ అధికారులు, ఆశా వర్కర్ల మీద దాడులు చేశారని సీసీటీవీ కెమెరా క్లిప్పింగ్స్ ద్వారా గుర్తించామని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పటికే అనేక సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి 58 మందిని అరెస్టు చేసి వారి దూల తీర్చేశారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన వారిని ఎవ్వరినీ వదిలి పెట్టమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప హెచ్చరించారు.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

 అంతు చాస్తాం, సీఎం వార్నింగ్

అంతు చాస్తాం, సీఎం వార్నింగ్

సిలికాన్ సిటి బెంగళూరులోని పాదరాయనపురలో సీల్ డౌన్ అమలులో ఉన్నా అక్కడికి వెళ్లిన అధికారుల మీద దాడులు చేసిన వారిలో 58 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, బీబీఎంపీ అధికారుల మీద దాడులు చేసిన వారందర్ని వదిలిపెట్టమని, వారి అంతు చూస్తామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. పాదరాయనపురలో పోలీసులు, వైద్య సిబ్బంది మీద దాడి చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు.

 లేడీ డాన్ సరోజ రెచ్చగొట్టింది ?

లేడీ డాన్ సరోజ రెచ్చగొట్టింది ?

ఆదివారం రాత్రి పాదరాయనపురలో కరోనా వైరస్ వ్యాధి సోకిని వారిని వేరే ప్రాంతంలోని క్వారంటైన్ లకు తరలించడానికి వెళ్లిన పోలీసులు, వైద్య సిబ్బంది, బీబీఎంపీ అధికారుల మీద దాడులు చేసిన స్థానికులు కొందరు అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు ద్వంసం చేసి నానా హంగామా చేశారు. స్థానిక యువకులు దాడులకు పాల్పడటానికి అక్కడే నివాసం ఉంటూ లేడీ డాన్ గా పిలిపించుకుంటున్న సరోజ అనే మహిళ ప్రధాన కారణం అని, ఆమె కూడా రోడ్ల మీదకు వచ్చి నానా హంగామా చేసిందని సీసీటీవీ కెమెరాల్లో ఆ విషయం వెలుగు చూసిందని బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ రమేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 గంజాయి ఎక్కడిది ?

గంజాయి ఎక్కడిది ?

పాదరాయనపురలో ఆదివారం రాత్రి పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసిన యువకులు గంజాయి సేవించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. గంజాయి సేవించడం నేరమని, అది లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అక్కడ నివాసం ఉంటున్న యువకులకు గంజాయి ఎవరు సరఫరా చేశారు ? అని పూర్తి సమాచారం సేకరిస్తున్నామని జేజే నగర్ పోలీసు అధికారులు అంటున్నారు.

 లేడీ డాన్ కు బెండ్ తీస్తే !

లేడీ డాన్ కు బెండ్ తీస్తే !

లేడీ డాన్ సరోజను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు ఆమెకు బెండ్ తియ్యడంతో పోలీసులు, వైద్య సిబ్బందిపై ఎవరెవరు దాడులు చేశారు అనే విషయం చెప్పిందని, ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా అల్లరిమూకలను అరెస్టు చేసే పనిలో ఉన్నామని, పాదరాయనపురలోని ప్రతి ఇంటింటికి వెళ్లి ఆ యువకుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు సిటీ అడిషనల్ పోలీసు కమిషనర్ సౌముంద్ ముఖర్జీ తెలిపారు.

దెబ్బకు వెదవలకు దూల తీరింది

పాదరాయనపురలో పోలీసులు, వైద్య సిబ్బంది, బీబీఎంపీ అధికారులపై చెయ్యి చేసుకున్న ఆ ప్రాంతంలోని అల్లరిమూకల మీద ఐపీసీ సెక్షన్ 353, 307, NDMA సెక్షన్ లు 353, 332, 324, 201 కింద కేసులు నమోదు చేశారు. కొంత మందిపై ఒక్కొక్కరి మీద నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చెయ్యడంతో వారి దూలతీరిపోతుందని పోలీసు అధికారులు అంటున్నారు.

 కర్ణాటక సీఎం సీరియస్

కర్ణాటక సీఎం సీరియస్

ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా లాక్ డౌన్ నియమాలను బెంగళూరులో కొంచెం సడలించాలని కర్ణాటక సీఎం యడియూరప్ప బుధవారం నిర్ణయించారు. అయితే 24 గంటల కూడా గడవకముందే అదే బెంగళూరులోని పాదరాయనపురలో ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చాలా సీరియస్ అయ్యారని తెలిసింది.

Recommended Video

Watch Exclusive YSRCP MLA Undavalli Sridevi Violating Lockdown Rules
 మీ ప్రాణాల కోసం పోలీసులు !

మీ ప్రాణాల కోసం పోలీసులు !

ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ వ్యాధి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల మీద దాడులు చేసిన వారు ఎవ్వరైనా సరే బెండ్ తీసి అరెస్టు చెయ్యాలని సీఎం యడియూరప్ప పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. పాదరాయనపురలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సంఘటనా స్థలంలో పోలీసు అధికారులు మకాం వేశారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను పాదరాయనపురకు తరలించారు.

English summary
Coronaviru Sealdown Violation: Bengaluru J.J Nagar Police Arrested 58 Mischief. Lady Don Saroja Behand Hurly in Padarayanapura in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X