వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఢిల్లీ మర్కజ్ లాగే మరో దర్గాలో వందల మంది, ప్రజల ప్రాణాలతో చెలగాటం !

|
Google Oneindia TeluguNews

జైపూర్: దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్మజ్ మసీదులో గత నెల మూడు రోజులు మతపరమైన తబ్లిక్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ (COVID 19) సోకడంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మర్కజ్ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో రాజస్థాన్ లోని ఓ దర్గాలో ఇలాంటి ఘటన మరోకటి జరిగిందని వెలుగు చూసింది. దర్గాలోని గుమికూడిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు బలప్రయోగం చేశారు.

ఇప్పటికే దర్గా నిర్వహకులు ఆరు మందిని అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలోని సర్వార్ దర్గాలో వందలాది మంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. దర్గాలో జరిగిన ధార్మిక కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొన్నారు ?, వారు ఎక్కడెక్కడ ఉన్నారు ? వారికి కరోనా వైరస్ సోకిందా ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.

Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !

 ఢిల్లీ దెబ్బకు దేశంలో కలకలం

ఢిల్లీ దెబ్బకు దేశంలో కలకలం

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ లో గత నెల 13 నుంచి 15వ తేదీ వరకు మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. మర్కజ్ లో తబ్లిగ్ జమాత్ మతపరమైన ప్రార్థనల్లో భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి ఓ వర్గం వారు హాజరైనారు. ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

రాజస్థాన్ దర్గాలో అదే సీన్

రాజస్థాన్ దర్గాలో అదే సీన్

రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలోని సర్వార్ పట్టణంలోని దర్గాలో గత మంగళవారం జరిగిన ప్రార్థనల్లో సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారని వెలుగు చూసింది. అయితే సమాచారం అందిన వెంటనే తాము దర్గా దగ్గరకు వెళ్లి అందరినీ చెదరగొట్టామని పోలీసులు అంటున్నారు. దర్గా నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పిన సమయంలో పోలీసుల మీద దర్గాలోని వారు ఎదురుతిరగారని సమాచారం. అయితే అప్పటికే వందలాది మంది ఆ దర్గాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారని వెలుగు చూసింది.

 లాక్ డౌన్ అమలులో ఉన్నా లెక్క చెయ్యలేదు !

లాక్ డౌన్ అమలులో ఉన్నా లెక్క చెయ్యలేదు !

కరోనా వైరస్ COVID 19) అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. ఇప్పటికే ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొనడంతో వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆదేశాలను లెక్క చెయ్యకుండా రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలోని సర్వార్ పట్టణంలోని దర్గాలో వందలాది మంది మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నారని వెలుగు చూసింది.

 ఇలాంటి సమయంలో ?

ఇలాంటి సమయంలో ?

ప్రతి సంవత్సరం ఓ వర్గం వారు సాంప్రధాయం ప్రకారం సూఫీ సాధువు మెయినుద్దీన్ కి చెందిన ఆజ్మీర్ దర్గాకు చెందిన ఖాదీమ్ లు సర్వార్ లోని దర్గాకు చాందర్ ను అందిస్తుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సర్వార్ దర్గాకు చాందర్ అందివ్వడానికి ఈ సమావేశం నిర్వహించామని దర్గా నిర్వహకులు అంటున్నారు.

ఐదు మందికి అనుమతి ఇస్తే ఇలా చేశారు

ఐదు మందికి అనుమతి ఇస్తే ఇలా చేశారు

సర్వార్ లోని దర్గాలో చాందర్ సమర్పించడానికి సర్వార్ పోలీసులు ఐదు మందికి మాత్రమే అనుమతి ఇచ్చారని, అయితే ఆ కార్యక్రమంలో వందమందికి పైగా పాల్గొన్నారని మాకు సమాచారం అందిందని అజ్మీర్ జిల్లా ఎస్పీ కున్వార్ రాస్ట్రదీప్ మీడియాకు చెప్పారు. ఇప్పటికే దర్గా నిర్వహకులు ఆరు మందని అరెస్టు చేశామని, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘంచిన వారి కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ కున్వార్ రాస్ట్రదీప్ మీడియాకు చెప్పారు. దర్గాలో గుమికూడిన వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించిన సమయంలో చాల మంది ప్రతిఘటించారని, పోలీసులను అడ్డుకున్నారని, తరువాత అదనపు పోలీసు బలగాలను అక్కడికి తరలించామని అజ్మీర్ జిల్లా ఎస్పీ కున్వార్ రాస్ట్రదీప్ మీడియాకు వివరించారు.

Recommended Video

Telangana SSC Students Response on Final Examination Arragements.
చెప్పింది అర్థం కాలేదా ? కేంద్రం సీరియస్

చెప్పింది అర్థం కాలేదా ? కేంద్రం సీరియస్

ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన, రాజస్థాన్ లోని దర్గా సంఘటనలు లాగా ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సామూహిక మత ప్రార్థనలు జరిగాయి ? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇప్పటికే ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లిగ్ మతప్రార్థనల్లో పాల్గొన్న 24 మందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. ఆ ప్రార్థనల్లో పాల్గొన్న 1, 548 మందకి కరోనా వైరస్ వైద్యపరీక్షలు నిర్వహించారు. 441 మంది ఆసుపత్రుల్గో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ లోని దర్గాలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వారిని పట్టుకుని కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని వారి కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు.

English summary
Coronavirus: About 100 people gathered for a religious congregation at a dargah in Sarwar town of Rajasthan's Ajmer district on Tuesday following which police used mild force to disperse them, SP and Police sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X