వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఒక్క రాష్ట్రంలో 1, 000 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, డ్యూటీ చెయ్యంటే ?

|
Google Oneindia TeluguNews

ముంబై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు సైతం కరోనా వైరస్ బారినపడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదైనాయి. మహారాష్ట్రలో సామాన్య ప్రజలతో పాటు ఇప్పటి వరకు 1, 000 మందికి పైగా పోలీసులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వంతో పాటు పోలీసు శాఖ అధికారులు హడలిపోతున్నారు. మహారాష్ట్రలో 25 వేల 922 మందికిపైగా కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటం, అందులో వెయ్యి మందికి పైగా పోలీసులే ఉన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాధితో గురువారం సాయంత్రానికి 975 మంది మరణించారు.

Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !

1, 001 మంది పోలీసులకు కరోనా

1, 001 మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో 1, 001 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. కరోనా వైరస్ వ్యాధి సోకిన పోలీసులకు వైద్యులు మెరుగైన సేవ అందించారు. కరోనా వైరస్ వ్యాధితో పోరాడిన 142 మంది పోలీసులు ప్రాణాలతో బయపడ్డారు. కరోనా వైరస్ చికిత్స విఫలమై 8 మంది పోలీసులు మరణించారు. గురువారం సాయంత్రం వరకు 815 మంది పోలీసులు కరోనా వైరస్ తో పోరాటం చేస్తూనే ఉన్నారు. వారిలో 107 మంది అధికారులు ఉన్నారు.

218 మంది పోలీసులపై దాడులు

218 మంది పోలీసులపై దాడులు

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారిని ప్రశ్నించిన 218 మంది పోలీసులపై దాడులు జరిగాయి. పోలీసులపై దాడులు చేసిన వారి మీద కేసులు నమోదు చేసి ఇప్పటి వరకు 770 మందిని అరెస్టు చేశారు. పోలీసులపై దాడులు చేసి తప్పించుకుని తిరుగుతున్న అల్లరిమూకల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రూ. 4 కోట్లు ఫైన్ వసూలు

రూ. 4 కోట్లు ఫైన్ వసూలు

మహారాష్ట్రలో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి విచ్చలవిడిగా బైక్ లు, కార్లలో రోడ్ల మీదకు వచ్చిన కొన్ని వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారి మీద కేసులు నమోదు చేసి వారి వాహనాలు సీజ్ చేసిన మహారాష్ట్ర పోలీసులు రూ. 4 కోట్ల 9 లక్షల 69 వేల రూపాయల అపరాద రుసుం వసూలు చేశారు. వేల మంది వాహనాలు సీజ్ చేసిన తరువాత అపరాద రుసుం వసూలు చేసి సీజ్ చేసిన వాహనాలను రిలీజ్ చేశారు.

20 వేల మంది అరెస్టు

20 వేల మంది అరెస్టు

మహారాష్ట్రలో పోలీసులు, వైద్య సిబ్బంది, అధికారుల మీద దాడులు చేశారని, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని వేల సంఖ్యలో కేసులు నమోదైనాయి. ఇప్పటి వరకు ఈ కేసుల్లో 20, 195 మందిని అరెస్టు చేశారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారి మీద కేసులు నమోదు చేసి 57, 479 వాహనాలు సీజ్ చేశారు. అల్లరిమూకల దాడుల్లో 83 మంది పోలీసులు, ఒక హోమ్ గార్డ్ కు తీవ్రగాయాలైనాయి. అల్లరిమూకల దాడుల్లో పోలీసులతో పాటు 34 మంది ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గాయపడ్డారు.

Recommended Video

TTD Is Planning To Reopen The Temple, With These Conditions!
డ్యూటీ చెయ్యాలంటే హడల్

డ్యూటీ చెయ్యాలంటే హడల్

మహారాష్ట్రలో తాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు వెయ్యి మంది పోలీసులకు అంటుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు శాఖ అధికారులు హడలిపోతున్నారు. కరోనా వైరస్ రోగులను తరలించాలన్నా, లాక్ డౌన్ విధులు నిర్వహించాలన్నా మహారాష్ట్రలో పోలీసులు హడలిపోతున్నారు. ఇది ఎక్కడ డ్యూటీరా దేవుడా అంటూ పోలీసులు ఆందోళన చెందుతున్నారని స్థానిక మీడియా తెలిపింది.

English summary
Coronavirus: 1001 police personnel have tested positive for COVID 19 in Maharashtra state, of which 851 are active cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X