చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ కు షాక్, 20 మందికి కరోనా, అనాథాశ్రయంలో అలర్ట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్ (లారెన్స్) షాక్ కు గురైనారు. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో లారెన్స్ ఆందోళనకు గురైనారు. 14 సంవత్సరాల నుంచి రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఉంటున్న 20 మందికి ఒక్కసారిగా కరోనా వైరస్ మహమ్మారి సోకడంతో రాఘవ లారెన్స్ షాక్ కు గురైనారు. అయితే రాఘవ లారెన్స్ ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు.

lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !

 చెన్నైలో ఆనాథాశ్రమం

చెన్నైలో ఆనాథాశ్రమం

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్ దివ్యాంగులను ఆదుకోవడం కోసం చెన్నైలోని అశోక్ నగర్ లో 2006వ సంవత్సరంలో అనాథాశ్రయం ఏర్పాటు చేసి అప్పటి నుంచి నేటి వరకు దానిని నిర్వహిస్తున్నారు. చెన్నైతో పాటు హైదరాబాద్ లో లారెన్స్ దివ్యాంగుల కోసం ఆనాథాశ్రయం నిర్వహిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నిర్వహిస్తున్న అనాథాశ్రయాల్లో ఉంటున్న దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తానని అనేకసార్లు లారెన్స్ చెప్పారు.

 చెన్నైలో కరోనా తాండవం

చెన్నైలో కరోనా తాండవం

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తోంది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణంగా ఆ నగరంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపించింది.

అశోక్ నగర్ పై అనుమానం

అశోక్ నగర్ పై అనుమానం

చెన్నైలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న ఇద్దరికి కరోనా వైరస్ వచ్చిందని అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న వారికి ఎవరికైనా కరోనా వైరస్ వ్యాధి సోకిందా ? అనే అనుమానంతో వైద్య శాఖ అధికారులు ఆ ప్రాంతంలోని వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు.

 లారెన్స్ ఆశ్రమంలో 20 మందికి కరోనా

లారెన్స్ ఆశ్రమంలో 20 మందికి కరోనా

లారెన్స్ నిర్వహిస్తున్న అనాథాశ్రయంలో ఉంటున్న దివ్యాంగులు, అక్కడి సిబ్బందికి అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. లారెన్స్ అనాథాశ్రమంలో ఉంటున్న 20 మందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో లారెన్స్ తో పాటు అధికారులు హడలిపోయారు.

Recommended Video

YSR Rythu Bharosa : Another Good News For AP Farmers,Govt Will Dig Borewells For Farming
 సీరియస్ గా ఉన్న వారిని !

సీరియస్ గా ఉన్న వారిని !

లారెన్స్ అనాథాశ్రయంలో ఉంటూ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని చెన్నైలోని నుంగంబాక్కంలోని లయోలా కాలేజ్ లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. లారెన్స్ అనాథాశ్రయంతో పాటు అశోక్ నగర్ లో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారు.

English summary
Coronavirus: According to Corporation sources, 25 people, mostly minors, have been staying at a home run by Lawrence’s trust in Pudur, Ashok Nagar. Of the 25, 20 tested positive. The trust houses disabled people and orphans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X