వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఫేమస్ ఆసుపత్రి వైద్య దంపతులకు కరోనా పాజిటివ్, చికిత్స చేసుకున్న 25 మందికి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వైద్యో నారాయణో హరి: అన్నారు పెద్దలు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు దేవుళ్లతో సమానం అయ్యారు. ప్రముఖ ఫేమస్ ప్రైవేటు ఆసుపత్రిలో అనేక మంది చికిత్స చేయించుకోవడానికి వెళ్లి వస్తున్నారు. నిత్యం వచ్చే రోగులకు అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్య దంపతులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆ ఆసుపత్రికి వచ్చి వెళ్లిన రోగులు, అక్కడి ఉద్యోగులు ఇప్పుడు కరోనా వైరస్ చికిత్సకు క్యూ కట్టారు. ఇప్పటికే వైద్య దంపతుల దగ్గర చికిత్స చేయించుకన్న 25 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

ఫేమస్ ఆసుపత్రి

ఫేమస్ ఆసుపత్రి

బెంగళూరు సిటీ సమీపంలోని కనకపుర ప్రాంతంలో ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. కనకపురలోని ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపుగా బెంగళూరులోని ఆసుపత్రుల్లోని అన్ని సదుపాయాలు ఉన్నాయి. కనకపురలోని ప్రైవేట్ ఆసుపత్రికి పట్టణంలోని ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చికిత్స చేయించుకుంటున్నారు.

వైద్య దంపతులకు కరోనా

వైద్య దంపతులకు కరోనా

కనకపురలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య దంపతులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలోని వైద్య దంపతుల దగ్గర చికిత్స చేయించుకోవడానికి చాలా మంది వచ్చి వెళ్లారు. ఇదే సమయంలో అనారోగ్యానికి గురైన వైద్య దంపతులకు చికిత్స చేశారు. ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన వైద్య దంపతులకు కరోనా పాజిటివ్ అని వచ్చింది.

క్వారంటైన్ లో 25 మంది

క్వారంటైన్ లో 25 మంది

ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్య దంపతులకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వెంటనే వారిని బెంగళూరులోని కోవిడ్ 19 ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్య దంపతుల దగ్గర చికిత్స చేసుకున్న వారికి టెన్షన్ మొదలైయ్యింది. ఆసుపత్రిలోని ఓపీ వివరాల ఆధారంగా స్థానిక వైద్యులు ఇప్పటికే వైద్య దంపతుల దగ్గర చికిత్స చేయించుకున్న 25 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. వైద్య దంపతుల దగ్గర చికిత్స చేయించుకున్న రోగుల కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

తమిళనాడు దెబ్బ ?

తమిళనాడు దెబ్బ ?


కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో కనకపుర పట్టణం ఉంది. కనకపుర పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారు. లాక్ డౌన్ అమలు కావడంతో కొన్ని వందల మంది తమిళనాడుకు వెళ్లి మళ్లీ కనకపుర పరిసర ప్రాంతాలకు వచ్చి వెళ్లారు. కనకపుర పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అటవి ప్రాంతం ఉండటంతో లాక్ డౌన్ అమల్లో ఉన్నా కొందరు అటవి ప్రాంతం నుంచి స్వేచ్చగా తమిళనాడులోని వారి సొంత ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారని వెలుగు చూసింది.

ఒక్క రోజులో హడల్

ఒక్క రోజులో హడల్

బెంగళూరు శివార్లలోని రామనగర జిల్లాలో 24 గంటల్లో 35 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో స్థానికులతో పాటు అధికారులు హడలిపోయారు. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే కనకపురలో -25, మాగడిలో- 4, రామనగరలో- 4, చెన్నపట్టణలో- 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అందర్ని కోవిడ్ 19 ఆసుపత్రికి తరలించారు.

English summary
Coronavirus: 25 people who were treated by coronavirus infected kanakapura doctor couple tested positive yesterday. Total of 81 cases reported in Ramanagar in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X