వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ప్రముఖ TV News ఛానల్ లో 28 మందికి కరోనా పాజిటివ్, 2,500 మందికి, మీడియా !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారులు, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుద్ద కార్మికులతో పాటు మీడియా సభ్యులు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎలా ఎవరి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందో చెప్పే వారు కరువైనారు. తాజాగా ఓ ప్రముఖ TV News ఛానల్ లో ఉద్యోగం చేస్తున్న 28 మందికి కరోనా వైరస్ రావడంతో ఆ సంస్థ ఉద్యోగులతో పాటు సాటి మీడియా సిబ్బంది షాక్ కు గురైనారు. మా TV ఛానల్ ఉద్యోగులు 28 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని ఆ సంస్థ ఛీఫ్ ఎడిటర్ దృవీకరించారు.

Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !

 Zee Newsలో 28 ఉద్యోగులకు కరోనా

Zee Newsలో 28 ఉద్యోగులకు కరోనా

ప్రముఖ మీడియా సంస్థ Zee Newsలో కొన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థల ఉద్యోగులు ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి గురించి, లాక్ డౌన్ సమాచారం గురించి ఎక్కువగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇదే సమయంలో డిజిటల్ మీడియా సైతం 24 గంటలు ఎప్పటికప్పుడు ప్రజలకు కరోనా వైరస్ సమాచారం అందిస్తోంది. Zee Newsలోని ఉద్యోగులు ప్రస్తుతం ఇదే పని చేస్తున్నారు.

 28 మంది ఉద్యోగులకు కరోనా

28 మంది ఉద్యోగులకు కరోనా

Zee Newsలోని ఉద్యోగులు వార్తలు సేకరించడానికి ఎక్కువగా బయట తిరుగుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా బయటకు వెళ్లి వస్తున్న సమయంలో ఊహించని విధంగా Zee Newsలో పని చేస్తున్న 28 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలుసుకున్న ఆ సంస్థ ఉద్యోగులు హడలిపోయారు.

 విచారం వ్యక్తం చేసిన Zee News

విచారం వ్యక్తం చేసిన Zee News

తమ కంపెనీలో పని చేస్తున్న 28 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయ్యిందని Zee News చీఫ్ ఎడిటర్ సుధీర్ చౌధరి విచారం వ్యక్తం చేశారు. అయితే దేవుడి దయవలన మా సంస్థ ఉద్యోగులు అందరూ కరోనా వైరస్ తో పోరాటం చేస్తూ కోలుకుంటున్నారని, అందరికి త్వరగా వ్యాధి నయం కావాలని ఆ దేవుడిని తాము ప్రార్థిస్తున్నామని, త్వరలో అందరూ వ్యాధి నయం చేసుకుని ఇంటికి వస్తారని తాము ఎదురు చూస్తున్నామని Zee News చీఫ్ ఎడిటర్ సుధీర్ చౌధరి ట్వీట్ చేశారు.

2,500 ఉద్యోగులకు కరోనా పరీక్షలు

2,500 ఉద్యోగులకు కరోనా పరీక్షలు

నోయిడాలోని Zee News సంస్థలో పని చేస్తున్న 28 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆ సంస్థలో పని చేస్తున్న 2,500 మంది ఉద్యోగులు అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని చీఫ్ ఎడిటర్ సుధీర్ చౌధరి చెప్పారు. కరోనా వైరస్ కు భయపడి మా విధులను నిర్లక్షం చెయ్యమని, ప్రజలకు నిత్యం తమ చానల్ అందుబాటులో ఉంటోందని Zee News ఉద్యోగులు ధైర్యంగా చెబుతున్నారు.

English summary
Coronavirus: 28 COVID 19 Case Positive In Zee News . Zee News Editor In Cheif Sudhir Choudary Confirms It.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X