వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ : కేరళలో మరో మూడు,మహారాష్ట్రలో మరో రెండు పాజిటివ్ కేసులు..

|
Google Oneindia TeluguNews

కేరళలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24కి చేరింది. తాజాగా నమోదైన మూడు కేసుల్లో.. ఇద్దరు మలప్పురంకి చెందినవారు కాగా.. ఒకరు కసర్‌గడ్ జిల్లాకు చెందిన వ్యక్తి. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 12450 మందిని సర్వైలైన్స్‌లో ఉంచినట్టు తెలిపారు. ఇందులో 270 మంది ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉండగా.. మిగతావారిని ఇళ్లల్లోనే క్వారెంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు. కరోనా నియంత్రణకు సహాయ సహకారాలు అందించడానికి అన్ని పార్టీలు ముందుకొచ్చాయన్నారు.

అటు మహారాష్ట్రలోనూ కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 51 ఏళ్ల ఓ మహిళకు కరోనా వైరస్ సోకినట్టుగా నిర్దారించారు. పుణేలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి తల్లిగా ఆమెను గుర్తించారు.ఇక నేవీ ముంబైలో ఒకరికి కరోనా సోకినట్టుగా నిర్దారించారు. ఇటీవలే అతను ఫిలిప్పీన్స్ నుంచి తిరిగొచ్చినట్టు గుర్తించారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 114గా ఉంది. కరోనా కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు స్కూళ్లు,కాలేజీలు,మాల్స్,స్విమ్మింగ్ పూల్స్,జిమ్స్‌ను మూసివేయాలని తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ స్పష్టం చేశారు. వీలైనంతవరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్నారు. వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

 coronavirus 3 news cases in kerala and two more in maharashtra

ఇప్పటివరకు కేరళలో 23, ఉత్తరప్రదేశ్‌లో 12, హర్యానాలో 14, కర్ణాటకలో 6, ఢిల్లీలో 7, తెలంగాణలో 3, లడఖ్‌లో 4, జమ్మూ కాశ్మీర్ లో 3, ఆంధ్ర ప్రదేశ్ 1 కేసులు, ఒడిశాలో 1, పంజాబ్‌లో 1, రాజస్థాన్‌లో 2, తమిళనాడులో 1, ఉత్తరాఖండ్‌లో 1 చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

English summary
Kerala has reported three new cases of the novel coronavirus. With this, the total number of positive cases of Covid-19 reported in the southern state has reached 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X