చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులపై క్రిమినల్ కేసులు, వాళ్లను దేశం దాటించండి, హైకోర్టు ఆర్డర్

|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను ఫుట్ బాల్ ఆడుకుంటున్న కరోనా వైరస్ (COVID 19) భారత్ ను వదిలిపెట్టడం లేదు. భారత్ లో కరోనా వైరస్ కు హాట్ స్పాట్ కు కారణం అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరై దేశం మొత్తం తిరిగేసిన విదేశీ తబ్లీగిలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. వీసా నియమాలు ఉల్లంఘించిన విదేశీ తబ్లీగిలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వీసాలు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. అయితే విదేశీ తబ్లీగిలకు హైకోర్టులో ఊరట లబించింది. వెంటనే విదేశీ తబ్లీగిల మీద నమోదు చేసిన క్రిమినల్ కేసులు రద్దు చేసి వారిని వెంటనే దేశం దాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

ఢిల్లీలో విదేశీయుల మీటింగ్

ఢిల్లీలో విదేశీయుల మీటింగ్

గత మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగి జమాత్ సమావేశాలు జరిగాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి తబ్లీగి జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఇదే తబ్లీగి జమాత్ సమావేశాలకు విదేశాల్లో ఉన్న తబ్లీగిలు హాజరైనారు.

కేంద్రం చెప్పినా డోంట్ కేర్

కేంద్రం చెప్పినా డోంట్ కేర్

నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారిని వెంటనే వైద్య శాఖ అధికారుల ముందు హాజరై వైద్య చికిత్సలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం మనవి చేసింది. ఢిల్లీ నుంచి విదేశీ తబ్లీగిలు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను లెక్క చెయ్యకుండా విదేశీ తబ్లీగిలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయి ధార్మిక సమావేశాలు నిర్వహించారు.

కేంద్రం లాస్ట్ వార్నింగ్

కేంద్రం లాస్ట్ వార్నింగ్

ఢిల్లీ జమాత్ సమావేశాల్లో హాజరై ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయిన విదేశీయులు వెంటనే లొంగిపోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయినా విదేశీయులు స్వచ్చందంగా ఎవ్వరూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకురాలేదు. వీసా నియమాలు ఉల్లంఘించి దేశం మొత్తం సంచరించిన విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల వీసాలను రద్దు చేసిన ప్రభుత్వాలు వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఇండోనేషియా, బాంగ్లాదేశ్ తబ్లీగిలు

ఇండోనేషియా, బాంగ్లాదేశ్ తబ్లీగిలు

ఢిల్లీ నుంచి తప్పించుకుని తమిళనాడు చేరుకుని అక్కడ తలదాచుకున్న ఇండోనేషియాకు చెందిన 21 మంది, బాంగ్లాదేశ్ కు చెందిన 11 మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. 31 మంది విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులపై స్థానిక పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి వారిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.

 వారిని దేశం దాటించండి

వారిని దేశం దాటించండి


విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల కేసు విచారణ చేసిన మద్రాసు హైకోర్టు వారి మీద నమోదు చేసిన క్రిమినల్ కేసులు రద్దు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే విదేశీయులను భారత్ నుంచి వారి స్వదేశాలకు పంపించేయాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
Coronavirus: Madras high court granted bail and ordered the closure of criminal proceedings against 31 foreign nationals who take part in Tablighi Jamaat meeting in Delhi. 11 Bangladeshi and 20 nationals of Indonesia arrested in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X