చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కర్ణాటక- తమిళనాడుకు పోటీ, తమిళ తంబీలు, కన్నడిగులు హడల్, మోడీ ఫోన్, హామీ!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి కేసులు లక్షల్లో పెరిగిపోవడంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇక దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఏకంగా 1, 70, 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, 2, 461 మంది మరణించడంతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో ఒక్కరోజులో 4, 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇక కర్ణాటకలో ఒక్కరోజులో 4, 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 63, 772 కు పెరిగింది. ఇక బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24, 316కు పెరిగింది.

Recommended Video

COVID-19 : Corona నుంచి కోలుకున్న వాళ్లకు Karnataka ప్రభుత్వం బంపర్ ఆఫర్..! || Oneindia Telugu

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

తల్లడిల్లిపోయిన తమిళనాడు

తల్లడిల్లిపోయిన తమిళనాడు


ఆంధ్రప్రదేశ్ పొరుగున్న ఉన్న తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1, 70, 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో 24 గంటల్లో 4, 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత 24 గంటల్లో తమిళనాడులో కరోనా వైరస్ కాటుకు 78 మంది మరణించారు. తమిళనాడులో నేటి వరకు 2, 481 మంది కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

చెన్నైలో గుడ్డిలో మెల్ల

చెన్నైలో గుడ్డిలో మెల్ల


చెన్నై సిటీలో ఇప్పటి వరకు 85, 859 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత 24 గంటల్లో చెన్నై సిటీలో మాత్రమే 1, 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గతంతో పోల్చుకుంటే చెన్నై సిటీలో చాలా వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. తమిళనాడులో కరోనా వైరస్ తో పోరాటం చేసి ఇప్పటి వరకు 1, 17, 915 మంది వ్యాధి నయం చేసుకున్నారు.

కర్ణాటకలో కరోనా అట్టహాసం

కర్ణాటకలో కరోనా అట్టహాసం

ఆంధ్రప్రదేశ్* తెలంగాణ రాష్ట్రాలకు పొరుగున ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలో కరోనా అట్టహాసంతో కన్నడిగులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో కర్ణాటకలో రికార్డు స్థాయిలో 4, 120 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఇప్పటి వరకు కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 63, 772కు చేరింది.

 బెంగళూరు బెదుర్స్

బెంగళూరు బెదుర్స్


ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిటికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 24, 316కు చేరింది. గత 24 గంటల్లో బెంగళూరు సిటీలో 2, 156 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. బెంగళూరులో ఒక్కరోజులో 36 మంది కరోనా వైరస్ వ్యాధికి బలి అయ్యారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 39, 370 మంది కరోనా వైరస్ తో పోరాటం చేసి ప్రాణాలు దక్కించుకున్నారు. కర్ణాటకలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2.8 % తగ్గిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

ప్రధానితో సీఎంలు చర్చలు

ప్రధానితో సీఎంలు చర్చలు

ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి చర్చించారు. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల వివరాలను, ఆ వ్యాధి నిర్మూలణ కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. గతంతో పొల్చుకుంటే తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చాలా వరకు అరికట్టామని, నెలాకరులోగా చెన్నై సిటీని గ్రీన్ జోన్ లోకి తీసుకువస్తామని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారని అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: 4120 New Coronavirus Cases Reported in Karnataka Today, State Tally Rise to 63772. 4979 New Coronavirus Cases Reported in Tamil Nadu Today, State Tally Rise to 1,70,693.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X