వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు, మంత్రి ఫైర్: మేకలకు క్వారంటైన్, కరోనా పరీక్షలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తుమకూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. ప్రాణాంతక మహమ్మారి కరోనా నుంచి కాపాడు స్వామి అంటూ కనపడిన దేవుడిని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. కరోనా వైరస్ సోకిని వారికి సరైన చికిత్స అందించడానికి క్వారంటైన్ కేంద్రాలు సరిపోవడం లేదని అక్కడక్కడా ఆరోపణలు ఉన్నాయి. అయితే కరోనా వైరస్ సోకిందని, వెంటనే మేకలు, ఆవులను క్వారంటైన్ కు తరలించి వాటికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాలని, చెప్పింది చెయ్యండి తనకు చరిత్ర చెప్పోద్దని మంత్రి ఆదేశాలు జారీ చెయ్యడంతో సంబంధిత అధికారులు బిత్తరపోయారు. మంత్రి ఆదేశాలతో మేకలను క్వారంటైన్ కు తరలించిన అధికారులు వాటికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

గొర్రెల కాపరికి వంద గొర్రెలు, మేకలు

గొర్రెల కాపరికి వంద గొర్రెలు, మేకలు

కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలుకా గోడేకెరె గొల్లరహట్టిలో ఓ గొర్రెల కాపరి నివాసం ఉంటున్నాడు. ఈ గొర్రెల కాపరికి సుమారు వంద గొర్రెలు, మేకలు, ఆవులు ఉన్నాయి. గోడేకెరె గ్రామంలో ఎక్కువ మేకలు, గొర్రెలు ఈయనకే ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం గొర్రెలు, మేకలు, ఆవులను పొలంలోకి తీసుకెళ్లి వాటికి మేత వేసి మళ్లీ సాయంత్రం వాటిని ఇంటికి తీసుకు వచ్చి ఓ మూలన ఉన్న కోటంలో (గుడిసె ఇల్లు) వాటిని కట్టేస్తుంటారు.

గొర్రెల కాపరికి కరోనా

గొర్రెల కాపరికి కరోనా

గొల్లరహట్టిలోని గొర్రెల కాపరి అనారోగ్యానికి గురైనాడు. గొర్రెల కాపరికి జ్వరం వచ్చి మళ్లీ తగ్గడం, జలుబు, దగ్గు రావడంతో రెండు రోజులు భాదపడ్డాడు. అయితే గొర్రెల కాపరి భాదచూసిన అతని స్నేహితుడు జూన్ 23వ తేదీన అతన్ని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాడు. గొర్రెల కాపరికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని గుర్తించారు.

 స్నేహితుడి మేకలు ఔట్

స్నేహితుడి మేకలు ఔట్

గొర్రెల కాపరిని తుమకూరు పట్టణంలోని కరోనా క్వారంటైన్ కేంద్రంలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. గొర్రెల కాపరిని ఆసుపత్రికి తీసుకెళ్లిన అతని స్నేహితుడిని తుమకూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోకి క్వారంటైన్ కు తరలించారు. అయితే గొర్రల కాపరిని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన స్నేహితుడి ఇంటిలో వరుసగా ఐదు మేకలు మరణించాయి.

 మేకలు, ఆవులకు కరోనా వచ్చిందా ?

మేకలు, ఆవులకు కరోనా వచ్చిందా ?

గొర్రెల కాపరి స్నేహితుడి ఇంటిలో ఉన్న మేకలు వరుసగా చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు గురైనారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడం వలనే అతని స్నేహితుడి ఇంటిలో కరోనా వైరస్ వ్యాధితోనే మేకలు, గొర్రెలు చనిపోతున్నాయని గ్రామస్తులు హడలిపోయారు. వెంటనే తమ ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన మధుస్వామికి మనవి చేశారు.

 సార్, ప్రపంచంలో ఎక్కడా రాలేదు

సార్, ప్రపంచంలో ఎక్కడా రాలేదు

వెంటనే గొర్రెల కాపరికి చెందిన మేకలు, గొర్రెలు, ఆవులను క్వారంటైన్ కు తరలించి కరోనా వైద్య పరీక్షలు చెయ్యాలని తుమకూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన జేసీ. మధుస్వామి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారతదేశంతో సహ ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంత వరకు మేకలు, గొర్రెలు, ఆవులకు కరోనా వైరస్ వచ్చినట్లు ఎక్కడా వెలుగు చూడలేదు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులు మంత్రి మధుస్వామికి చెప్పారు.

Recommended Video

Pak Stock Exchange News: గ్రెనేడ్లు, తుపాకులతో Karachi స్టాక్ ఎక్సేంజ్‌పై టెర్రరిస్టుల బీభత్సం
 చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు

చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు

మీరు నేను చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు అంటూ మంత్రి మధుస్వామి ఘాటుగా సమాధానం చెప్పడంతో అధికారులు గొర్రెల కాపరికి చెందిన 43 మేకలు, గొర్రెలను జక్కనహళ్ళి లోని ఓ పెద్ద షెడ్ లోని క్వారంటైన్ కు తరలించి అక్కడ వాటికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం మీద మంత్రి మధుస్వామి ఆదేశాలతో మేకలు, గొర్రెలను క్వారంటైన్ కు తరలించడంతో ఇప్పుడు కర్ణాటకలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Coronavirus: 43 Goats under quarantine in Chikkanayakanahalli in Tumakuru district in Karnataka after man who looking the goats tested positive for COVID - 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X