బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరు కరోనా క్వారంటైన్స్ లో 50 % డిస్కౌంట్ ?, బంపర్ ఆఫర్, 14 రోజులు కాదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు హడలిపోతున్నారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, విదేశాల నుంచి భారత్ కు వస్తున్న వారిని ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు, జూన్ 1వ తేదీ నుంచి వివిద మార్గాల్లో రైళ్లు సంచరిస్తున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం క్వారంటైన్ నియమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. బెంగళూరులో 14 రోజుల క్వారంటైన్ నియమాలను సడలించి 7 రోజులకు (50 % డిస్కౌంట్) కుదించాలని బీబీఎంపీ అధికారులు ఆలోచిస్తున్నారు. వివిద ప్రాంతాల నుంచి బెంగళూరు వచ్చే వారి సంఖ్య వేలల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

బెంగళూరుకు జనజాతర

బెంగళూరుకు జనజాతర

దేశంలోని వివిద ప్రాంతాల నుంచి విమానాలు, రైళ్లల్లో బెంగళూరు వచ్చే వారి సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుందని బీబీఎంపీ అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని వేల మందికి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న క్వారంటైన్ లో 14 రోజులు ఉండాలనే నియమాలను 7 రోజులకు తగ్గించాలని బీబీఎంపీ అధికారులు కర్ణాటక ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాధన పెట్టారని వెలుగు చూసింది.

ఆ లెక్కలు చూస్తే భయంగా ఉంది

ఆ లెక్కలు చూస్తే భయంగా ఉంది

మే 25 నుంచి దేశీయ వివమాన సర్వీసులు, జూన్ 1వ తేదీ నుంచి వివిద మార్గాల్లో రైళ్లు సంచరించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో దేశంలోని వివిద రాష్ట్రాల నుంచి బెంగళూరుకు కొన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంది. కొన్ని వేల మందికి బెంగళూరులో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని బీబీఎంపీకి చెందిన కొందరు అధికారులు అంటున్నారు. విమాన ప్రయాణికులు, రైళ్లలో సంచరించే వారి లెక్కలు చూస్తుంటే అధికారులకు భయంగా ఉందని తెలిసింది.

50% క్వారంటైన్ డిస్కౌంట్ ప్లాన్ ?

50% క్వారంటైన్ డిస్కౌంట్ ప్లాన్ ?

బెంగళూరు నగరంలో కొన్ని వేల మందికి ప్రభుత్వ ఖర్చులతోనే కరోనా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని అధికారులు అంచనా వేశారు. బెంగళూరులో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. బెంగళూరులో 14 రోజుల క్వారంటైన్ నియమాలను సడలించి 7 రోజులకు (50 % డిస్కౌంట్) కుదించాలని బీబీఎంపీ అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేశారు.

ఢిల్లీ టూ బెంగళూరు రైలు లొల్లి

ఢిల్లీ టూ బెంగళూరు రైలు లొల్లి

ఇటీవల ఢిల్లీ నుంచి బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ప్రత్యేక రైళ్లల్లో బెంగళూరు వచ్చిన ప్రయాణికులను వారి సొంత ఖర్చులతో క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. ఆ సమయంలో మా ఖర్చులతో క్వారంటైన్ లో ఉండటానికేనా మేము ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చింది ? అంటూ ప్రయాణికులు అధికారులతో గొడవ పెట్టుకున్నారు. ప్రయాణికులు సొంత ఖర్చులతో క్వారంటైన్ కేంద్రాల్లో ఉండటానికి నిరాకరించడంతో వారిని మళ్లీ ఢిల్లీకి వెనక్కి పపించారు. ఇలాంటి సంఘటనలు మరోసారి ఎదురుకాకుండా చూడాలని అధికారులు అంటున్నారు.

హోమ్ క్వారంటైన్స్ కు ఓకే ?

హోమ్ క్వారంటైన్స్ కు ఓకే ?

దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చే వారిని వారివారి ఇళ్లల్లో హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిసింది. బెంగళూరులో కొన్ని వేల మందికి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యలేమని బీబీఎంపీ అధికారులు చేతులు ఎత్తేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిసింది. ఇలాంటి సమయంలో వివిద ప్రాంతాల నుంచి వచ్చేవారు 7 రోజుల పాటు వారివారి ఇళ్లల్లో హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి అనుమతి ఇవ్వాలా ? వద్దా ?, లేకుంటే ఏం చెయ్యాలి ? అని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

English summary
Coronavirus quarantine: Karnataka government may change the rule about institutional quarantine after railway service starts form June 1. Passengers who comes to Bengaluru city may go for 7 days quarantine. Now 14 days institutional quarantine mandatory for out of state people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X