వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఒకే ఫ్యామిలీలో మొత్తం కరోనాకు బలి, 14 రోజుల్లో ఇల్లు స్మశాసం, ఇద్దరు మాత్రం!

|
Google Oneindia TeluguNews

రాంచీ/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి (COVID 19) ప్రపంచవ్యాప్తంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిపేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక మంది బలి అయ్యారు. ఓ ఇంటిలోని 89 ఏళ్ల తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ ఇంటిలోని అందరూ కేవలం 14 రోజుల్లో బలి అయ్యారు. వేరే నగరాల్లో వేర్వేరుగా నివాసం ఉంటున్న కొడుకు, కూతురు మాత్రమే ప్రాణాలో బయటపడ్డారు. ఒకే ఇంటిలో ఐదు మంది కరోనా కాటుకు బలి కావడంతో ఆ ఇల్లు స్మశానంగా మారిపోయింది.

క్వారంటైన్ లో యువతి హీరోయిన్ లా ఉందని, అర్దరాత్రి డాక్టర్ రెండుసార్లు, పాపం పండింది, సీసీటీవీల్లో!క్వారంటైన్ లో యువతి హీరోయిన్ లా ఉందని, అర్దరాత్రి డాక్టర్ రెండుసార్లు, పాపం పండింది, సీసీటీవీల్లో!

పెళ్లి కోసం వచ్చిన వృద్దురాలు

పెళ్లి కోసం వచ్చిన వృద్దురాలు

జార్ఖండ్ లోని ధనబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 89 ఏళ్ల వృద్దురాలి కుటుంబ సభ్యులు సంవత్సరం క్రితం ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి వెళ్లి అక్కడే కాపురం ఉంటున్నారు. ధనబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సొంత కొడుకు కుమార్తె వివాహానికి హాజరుకావడానికి జూన్ 27వ తేదీన ఆమె ధనబాద్ ప్రాంతానికి వెళ్లారు.

పెళ్లికి ముందే వృద్దురాలు!

పెళ్లికి ముందే వృద్దురాలు!

పెళ్లికి హాజరుకావడానికి వచ్చిన వృద్దురాలు శుభకార్యం జరగకముందే ఆమె అనారోగ్యానికి గురైనారు. వెంటనే ఆమెను బోకారో జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అనారోగ్యానికి గురైన వృద్దురాలికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. చికిత్స విఫలమై ఆమె జులై 4వ తేదీన మరణించారు. హిందూసాంప్రధాయాల ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

వృద్దురాలి ఇద్దరు కొడుకులు బలి

వృద్దురాలి ఇద్దరు కొడుకులు బలి

వృద్దురాలి అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజులకే ఆమె 65 ఏళ్ల పెద్ద కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను ధనబాద్ లోని క్వారంటైన్ కు తరలించారు. మరుసటి రోజు ఆమె రెండో కొడుకు అనారోగ్యానికి గురికావడంతో ధనబాద్ లోని పాటలిపుత్ర మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. చికిత్స విఫలమై జులై 11వ తేదీన వృద్దురాలి పెద్ద కొడుకు, జులై 12వ తేదీన రెండో కొడుకు మరణించారు. ఇద్దరు సోదరులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

అదే ఫ్యామిలీలో మరో ఇద్దరు కుమారులు

అదే ఫ్యామిలీలో మరో ఇద్దరు కుమారులు

జులై 11వ తేదీన వృద్దురాలి పెద్ద కొడుకు, జులై 12వ తేదీన రెండు కొడుకు మరణించిన మరుసటి రోజు ఆమె మూడో కుమారుడు అనారోగ్యానికి గురైనాడు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన 24 గంటల్లోపు ఆయన మరణించాడు. ఇతనికి ఇంతకు ముందే క్యాన్సర్ ఉందని, తరువాత కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఒకే ఇంటిలో వరుసగా నలుగురు మరణించడంతో ఆమె నాలుగో కుమారుడు సైతం అనారోగ్యానికి గురైనాడు. ఆయన్ను రాంచీలోని రాజేంద్ర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి బాత్ రూం వెళ్లిన ఆమె నాలుగో కుమారుడు అక్కడ శవమైనాడు. అతనికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

Recommended Video

Tollywood Juniour Artists Requesting Government to Help During COVID-19 Pandemic Situations
ప్రాణాలతో ఇద్దరు మిగిలారు

ప్రాణాలతో ఇద్దరు మిగిలారు

కరోనా పాజిటివ్ తో మరణించిన వృద్దురాలి నలుగురు కుమారులు అదే వైరస్ తో మరణించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కరోనా పాజిటివ్ తో మరణించిన వృద్దురాలి చివరి కుమారుడు ఢిల్లీలో, కుమార్తె కోల్ కత్తాలో నివాసం ఉంటున్నారు. ఆమెతో టచ్ లో లేకపోవడంమో ఏమో ? ఢిల్లీలోని కుమారుడు, కోల్ కత్తాలోని కుమార్తె మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ఒకే ఫ్యామిలీలోని ఐదు మంది కేవలం 14 రోజుల్లో మరణించడంతో ఆ ఇల్లు స్మశాసం అయ్యింది.

English summary
Coronavirus: 89 Year Old Woman, 4 Sons Die Of COVID -19 In 14 Days near Ranchi in Jharkhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X