చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: మందు, చిల్లీ చికెన్, ఫ్రెండ్స్ తో పార్టీ, ఒక్కడి దెబ్బకు ఊరు మొత్తం సీల్ డౌన్, క్యూ!

|
Google Oneindia TeluguNews

చెన్నై/తేని: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ హాట్ స్పాట్ గా మారిపోయింది. కోయంబేడు దెబ్బకు ఇటు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలు హడలిపోతున్నాయి. ఇక కోయంబేడు మార్కెట్ నుంచి వెళ్లిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

అధికారులు నిర్లక్షం కారణంగా ఆ లారీ డ్రైవర్ కూరగాయల మార్కెట్, చికెన్ సెంటర్, వైన్ షాపుల దగ్గరకు వెళ్లాడు. ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలు చేసుకున్నాడు. ఈ లారీ డ్రైవర్ దెబ్బకు ఒక్క ఊరు మొత్తం సీల్ డౌన్ చేసి అన్ని దారులు మూసేశారు. ఒక్కడి దెబ్బకు కొన్ని వందల మందితో పాటు ఇప్పుడు ఆ ఊరి ప్రజలు కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారు.

Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్!Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్!

కరోనా హాట్ స్పాట్ కోయంబేడు

కరోనా హాట్ స్పాట్ కోయంబేడు

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6, 535 చేరింది. చెన్నై సిటీలోనే 3, 330కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో కరోనా వైరస్ మరణాల సంఖ్య 44 చేరింది. ఇక తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడానికి చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణం అని అధికారులు గుర్తించారు. ఒక్క కోయంబేడు క్లస్టర్ వలనే తమిళనాడులో 1, 867 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని స్వయంగా తమిళనాడు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

చెన్నై చిత్రం మారిపోయింది

చెన్నై చిత్రం మారిపోయింది

తమిళనాడులో మొత్తం 6, 535 కేసులు నమోదు కావడంతో ఒక్క చైన్ సిటీలోనే 3, 300 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కోయంబేడు మార్కెట్ కారణంగా చెన్నై ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. ఒక్క కోయంబేడు మార్కెట్ కారణంగా తమిళనాడులో కరోనా వైరస్ కేసులు వేల సంఖ్యలో పెరిగిపోయాయి. విల్లుపురంలో 67, చెంగల్పట్టులో 40, పెరంబలూరులో 31, తిరువళ్లూరులో 26, కాంచీపురంలో 17, అరియలూరులో 16, తిరువణ్ణామలైలో 15, రాణిపేటలో 10 తదితర జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

కోయంబేడు మార్కెట్ లారీ డ్రైవర్

కోయంబేడు మార్కెట్ లారీ డ్రైవర్

తేనీ సమీపంలో దేవదానపట్టి ప్రాంతానికి చెందిన వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతను చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు ప్రతినిత్యం వెళ్లి వస్తున్నాడు. వారం రోజుల క్రితం లారీ డ్రైవర్ తేనిలోని దేవదానపట్టి ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ లారీ డ్రైవర్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య నివేదికలు వచ్చే వరకు నువ్వు ఇంటిలోనే క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆ లారీ డ్రైవర్ కు సూచించారు.

చిల్లీ చికెన్, ఫ్రెండ్స్ తో మందు పార్టీలు

చిల్లీ చికెన్, ఫ్రెండ్స్ తో మందు పార్టీలు

అధికారులు నిర్లక్షం లారీ డ్రైవర్ ను ఇంట్లో వదిలేయడంతో లారీ డ్రైవర్ తనకు ఏమీ కాలేదని, కరోనా లేదని అనుకున్నాడు. అంతే ఇంట్లోని క్వారంటైన్ లో ఉండకుండా దేవదానపట్టి ఊరు మొత్తం తిరిగేశాడు. తరువాత మూడు రోజుల క్రితం దేవదానపట్టిలోని టాస్మాక్ లిక్కర్ షాప్ ముందు సుమారు రెండు గంటలు క్యూలో నిలబడి కావలసిన బ్రాండ్ మందు తీసుకున్నాడు. తరువాత ఫ్రెండ్స్ తో కలిసి ఓ చికెన్ సెంటర్ కు వెళ్లి చికెన్ తీసుకుని ఓ తోటలోకి వెళ్లి చిల్లీ చికెన్ చేసుకున్నారు. లారీ డ్రైవర్ తో పాటు అందరూ కలిసి ఆ తోటలో మందుపార్టీ చేసుకున్నారు.

Recommended Video

Vande Bharat Mission: First Flight From Kuwait Arrive in Hyderabad With 163 Indians
ఒక్కడి దెబ్బకు ఊరు మొత్తం సీల్ డౌన్

ఒక్కడి దెబ్బకు ఊరు మొత్తం సీల్ డౌన్

లారీ డ్రైవర్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న అధికారులు దేవదానపట్టిలోని అతని ఇంటి దగ్గరకు పరుగు తీశారు. అప్పటికే మహానుభావుడు లారీ డ్రైవర్ దేవదానపట్టి ఊరు మొత్తం తిరిగేశాడని, చికెన్ సెంటర్ కు వెళ్లాడని, వైన్ షాప్ దగ్గర క్యూలో నిలబడి మందు తీసుకున్నాడని, తోటలో ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీ చేసుకున్నాడని తెలుసుకున్న అధికారులు హడలిపోయారు. అంతే లారీ డ్రైవర్ ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించిన అధికారులు దేవదానపట్టి ఊరు మొత్తం సీల్ డౌన్ చేశారు. లారీ డ్రైవర్ తో సన్నిహితంగా ఉంటున్న వారందరికీ ఇప్పుడు కరోనా వైరస్ వైద్యపరీక్షలు చేస్తున్నారు. లారీ డ్రైవర్ వలన ఎక్కడ మాకు కరోనా వైరస్ వస్తుందో ? అనే భయంతో దేవదానపట్టి ఊరి ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Coronavirus: A person gets positive who went to Tasmac in Theni two days back in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X