వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: 10వ తరగతి పరీక్షలు, విద్యార్థులకు షాక్, కరోనా పాజిటివ్, మాజీ ప్రధాని అడ్డాలో కలకలం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హాసన్: దేశం అంతా కరోనా వైరస్ (COVID 19) వ్యాపిస్తున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో జరగవలసిన పరీక్షలు రద్దు అయ్యాయి. అయితే కర్ణాటక ప్రభుత్వం ధైర్యం చేసి 10వ తరగతి (SSLC) పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 8. 40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే 10వ తరగతి రాస్తున్న విద్యార్థికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో కర్ణాటక ప్రభుత్వంతో పాటు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Coronavirus: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా, ఇల్లు సీల్ డౌన్, పక్కనే పవర్ స్టార్ ఫ్యామిలీ !Coronavirus: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా, ఇల్లు సీల్ డౌన్, పక్కనే పవర్ స్టార్ ఫ్యామిలీ !

డెంగ్యూ జ్వరం

డెంగ్యూ జ్వరం

కర్ణాటకలోని హాసన్ జిల్లా అరకలగూడు పట్టణంలో 16 ఏళ్ల విద్యార్థి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. పరీక్షలకు ముందు ఆ విద్యార్థి డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నాడు. అయితే పరీక్షలు ప్రారంభం అయ్యే రోజుకు ఆ విద్యార్థి డెంగ్యూ జ్వరంకు చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడని అధికారులు అంటున్నారు.

మాజీ ప్రధాని అడ్డాలో కలకలం

మాజీ ప్రధాని అడ్డాలో కలకలం

డెంగ్యూ జ్వరంతో భాదపడిన విద్యార్థికి వైద్యులు రక్తపరీక్షలు చేశారు. గురువారం నుంచి ఆ విద్యార్థి 10 తరగతి పరీక్షలు రాయడానికి వెలుతున్నాడు. అయితే వైద్యపరీక్షల్లో అరకలగూడు పట్టణంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఈ దెబ్బతో మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ సొంత ప్రాంతంలో కలకలం రేపింది.

విద్యార్థులు, కుటుంబ సభ్యులకు హడల్

విద్యార్థులు, కుటుంబ సభ్యులకు హడల్


అరకలగూడు పట్టణంలో 10వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆ విద్యార్థితో పాటు పరీక్షలు రాస్తున్న సాటి విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు ఇప్పుడు హడలిపోతున్నారు. ఎక్కడ ఆ విద్యార్థి వలన మాకు కరోనా వైరస్ వస్తుందో ? అనే భయంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిసింది.

ఏం పరీక్షలు చేశారో ? ఏమో

ఏం పరీక్షలు చేశారో ? ఏమో


అరకలగూడు పట్టణంలోని స్కూల్ లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న అందరికీ పరీక్షలు ప్రారంభం కాకముందే వైద్యచికిత్సలు చేసి పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విద్యార్థికి పరీక్షలు రాయడానికి ముందే వైద్యపరీక్షలు చేశామని, అప్పుడు ఆ విద్యార్థికి కరోనా లక్షణాలు లేవని అధికారులు అంటున్నారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థికి వైద్య సిబ్బంది ఏం పరీక్షలు చేశారో ? ఏమో ? అని సాటి విద్యార్థుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థికి ప్రత్యేక గదిలో పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు అంటున్నారు.

English summary
Coronavirus: A Student Appearing for SSLC Exam Tests Positive for Coronavirus in Hassan in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X