చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనాతో డాక్టర్ మృతి, అంత్యక్రియలు చేస్తూంటే దాడులు, హీరో ఎంట్రీ, పాపం భార్య !

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా చెనైలో కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ అంత్యక్రియులు చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో వైద్య సిబ్బందిపై స్థానికులు మూకదాడికి పాల్పడ్డారు. ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వైద్యుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రజలు స్థానికులపై మండిపడుతున్నారు. తన భర్త అంత్యక్రియలు చెయ్యడానికి అవకాశం లేకుండా చేశారని కరోనా కాటుకు బలి అయిన వైద్యుడి భార్య ఆర్తనాదాలు చేసింది. విధి నిర్వహణలో మరణించిన వైద్యుడి కుటుంబ సభ్యులకు ఎదురైన సమస్య మరెవ్వరికి ఎదురుకాకూడదని, కరోనాతో మరణించిన వారి అంత్యక్రియులు చెయ్యడానికి తన సొంత ఇంజనీరింగ్ కాలేజ్ లో స్థలం ఇస్తానని ప్రముఖ హీరో, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ అన్నారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో విజయకాంత్ హీరో అనిపించుకున్నారని ప్రజలు అంటున్నారు.

విద్యార్థిని ప్రేమించాడు, ప్రియురాలిని పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి, కరోనా భయంతో !విద్యార్థిని ప్రేమించాడు, ప్రియురాలిని పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి, కరోనా భయంతో !

కరోనాతో చెన్నై డాక్టర్ మృతి

కరోనాతో చెన్నై డాక్టర్ మృతి

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో న్యూరోసర్జన్ గా పని చేస్తున్న డాక్టర్ సిమన్ హెర్య్కూల్స్ విధి నిర్వహణలో భాగంగా కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందించారు. అయితే దురదృష్టవశాత్తు కరోనా వైరస్ తగిలి ఆయన మరణించారు. కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ సిమన్ హెర్య్కూల్స్ కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు.

వైద్య సిబ్బందిపై అల్లరిమూకల దాడి

వైద్య సిబ్బందిపై అల్లరిమూకల దాడి

విధి నిర్వహనలో కరోనా వైరస్ వ్యాధితో మరణించిన డాక్టర్ సిమన్ హెర్య్కూల్స్ కుటుంబం రోడ్డున పడింది. తనకు కరోనా వైరస్ సోకిందని తెలిసిన వెంటనే డాక్టర్ సిమన్ పెర్య్కూల్స్ చికిత్స విఫలమై తాను చనిపోతే మత విశ్వాసాలకు అనుగుణంగా కల్ పౌక్ సిమెట్రీ శ్మశానవాటికలో అంత్యక్రియలు చెయ్యాలని, ఇదే తన చివరి కోరిక అని ఆయన భార్య ఆనంది సిమన్ కు చెప్పారు. చికిత్స విఫలమై డాక్టర్ చనిపోవడంతో ఆయన అంత్యక్రియలు చెయ్యడానికి ప్రయత్నించిన వైద్య సిబ్బందిపై స్థానిక అల్లరిమూకలు దాడులు చేశారు.

ప్రాణాలకు తెగించిన సాటి వైద్యుడు

ప్రాణాలకు తెగించిన సాటి వైద్యుడు

అల్లరిమూకలు దాడులు చెయ్యడంతో డాక్టర్ సిమన్ పెర్య్కూల్స్ అంత్యక్రియులు చెయ్యడానికి వైద్య సిబ్బంది సాహసం చెయ్యలేకపోయారు. ఆ సమయంలో సిమన్ పెర్క్యూల్స్ సహోద్యోగి డాక్టర్ ప్రదీప్ కుమార్ ప్రాణాలకు తెగించి అర్దరాత్రి ఆయనే స్వయంగా గుంత తవ్వి సిమన్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అల్లరిమూకలు దాడులు చేస్తారని తెలిసినా డాక్టర్ ప్రదీప్ కుమార్ మాత్రం సాటి వైద్యుడి అంత్యక్రియలు జరిపించారు. ఈ విషాదకర ఘటన తెలుసుకున్న తమిళనాడు ప్రజలు స్థానికులు, అల్లరిమూకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎంకు మనవి చేసిన డాక్టర్ భార్య

సీఎంకు మనవి చేసిన డాక్టర్ భార్య

డాక్టర్ సిమన్ పెర్య్కూల్స్ అంత్యక్రియల విషయంపై జరిగిన వివాదంపై ఆయన భార్య ఆనంది సిమన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి మనవి చేస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వైరస్ కట్టడికి సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఎంతో కృషి చేస్తున్నారు. నా భర్త సిమన్ పెర్య్కూల్స్ కరోనా వైరస్ తో చనిపోయారు. ఆయన చివరి కోరిక ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామికి మనవి చేస్తూ విలపించడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. డాక్టర్ సిమన్ పెర్య్కూల్స్ భార్య ఆనంది సిమన్ విలపిస్తున్న వీడియో చూసిన తమిళనాడు ప్రజలు చలించిపోయారు.

నేను ఉన్నాను: క్యాప్టెన్ విజయ్ కాంత్

నేను ఉన్నాను: క్యాప్టెన్ విజయ్ కాంత్

డాక్టర్ సిమన్ భార్య ఆనంది సిమన్ వీడియో చూసిన ప్రముఖ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ చలించిపోయారు. తాను సొంతంగా నిర్వహిస్తున్న ఆండాళ్ అళగర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లోని కొంత భూమిలో కరోనా వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని హీరో విజయ్ కాంత్ అన్నారు.

రియల్ హీరో

రియల్ హీరో

డాక్టర్ సిమన్ కు ఎదురైన ఘటన మరెవరికి ఎదురుకాకూడదని, అందుకే తన ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంత భూమిని ఇవ్వడానికి సిద్దం అయ్యానని డీఎండీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ కాంత్ అన్నారు. సినిమాలల్లో హీరో అనిపించుకున్న క్యాప్టెన్ విజయ్ కాంత్ నిజజీవితంలో హీరో అనిపించుకున్నారు. కరోనా మృతుల కోసం హీరో విజయ్ కాంత్ ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ లో స్థలం ఇవ్వడానికి ముందుకు రావడంతో పార్టీలకు అతీతంగా పలు రాజకీయ పార్టీల నాయకులు ఆయన్ను అభినందిస్తున్నారు.

English summary
Coronavirus: DMDK Party precident, actor Vijayakanth offers land at college for burial of doctor who died of COVID 19 in Chennai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X