బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరులో 59 కరోనా పాజిటివ్ కేసులు, క్వారంటైన్ లో 14 వేల మంది, లింక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలోని క్వారంటైన్ లో ఉన్న 59 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. విదేశాల నుంచి బెంగళూరు వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించారు. వారిలో 59 మంది కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మార్చి 24 నుంచి విదేశాల నుంచి వచ్చిన 14, 910 మందిని క్వారంటైన్ కు తరలించి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 59 మందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో బీబీఎంపీ అధికారులు అప్రమత్తం అయ్యారు.

Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !

14, 910 మందికి పరీక్షలు

14, 910 మందికి పరీక్షలు

గత నెల మార్చి నెలలో బెంగళూరుకు అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చినంత వరకు విదేశాల నుంచి బెంగళూరుకు 14, 910 మంది ప్రయాణికులు వచ్చారు. విదేశాల నుంచి బెంగళూరు నగరానికి వచ్చిన ఈ అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ లో ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు.

కరోనా వైరస్ 2వ స్టేజ్ !

కరోనా వైరస్ 2వ స్టేజ్ !

మార్చి 22వ తేదీ భారతదేశానికి వచ్చే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నీ నిలిపివేశారు. ఆ ఒక్కరోజు బెంగళూరు నగరానికి 145 మంది విదేశాల నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన అందర్నీ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అప్పటి నుంచి బెంగళూరు నగరంలో కరోనా వైరస్ 2వ స్టేజ్ కు రాకుండా సంబంధిత అధికారులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారు.

క్వారంటైన్ గడువు పూర్తి

క్వారంటైన్ గడువు పూర్తి

విదేశాల నుంచి బెంగళూరు వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించారు. క్వారంటైన్ గడువు కాలం ఏప్రిల్ 6వ తేదీతో పూర్తి అయ్యింది. క్వారంటైన్ లో ఉన్న వారికి మళ్లీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ లో ఉంటున్న వారు బయటకు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

అధికారుల లెక్కలు ఇవే !

అధికారుల లెక్కలు ఇవే !

మార్చి 8వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు విదేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించారు. వారిలో 59 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని బృహత్ బెంగళూరు మహానగర పాలికె ( BBMP) అధికారులు అంటున్నారు.

అమెరికా, దుబాయ్, బ్రిటన్

అమెరికా, దుబాయ్, బ్రిటన్

అమెరికా, స్పెయిన్, దుబాయ్, బ్రిటన్ తదితర దేశాల నుంచి వచ్చిన 59 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని అధికారులు అంటున్నారు. ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి బెంగళూరు వచ్చిన ఈ 59 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు అంటున్నారు.

విదేశాలకు వెళ్లకున్నా 10 మందికి కరోనా

విదేశాలకు వెళ్లకున్నా 10 మందికి కరోనా

విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధాలు లేని వారు, విదేశాలకు వెళ్లని వారిలో 10 మందికి బెంగళూరులో కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన వారితోనే ఈ 10 మంది కలిశారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 8వ తేదీన బెంగళూరులో మొదటి కరోనా వైరస్ కేసు వెలుగు చూసింది. తరువాత మార్చి 24వ తేదీ ఎక్కువగా 9 కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు బెంగళూరులో మరో 59 కరోనా వైరస్ కేసులు నమోదైనాయి.

సంబరాల సమయం కాదు !

సంబరాల సమయం కాదు !

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ లో ఇన్ని రోజులు ఉండి కరోనా వైరస్ లేదని తెలిసిన వారు ఇప్పుడు సంబరాలు చేసుకోరాదని, వైద్యులు, అధికారుల సూచనలు, సలహాలు పాటించి ప్రజల్లో ఎక్కువ తిరగకుండా ఉండాలని బీబీఎంపీ కమిషనర్ బిహెచ్. అనీల్ కుమార్ మనవి చేశారు. కరోనా వైరస్ సోకలేదని బయట తిరగకుండా అధికారులు నిర్వహించే అన్ని పరీక్షలు చేయించుకుని సహకరించాలని స్వయంప్రేరితంగా ఐసోలేషన్ లో ఉండాలని బీబీఎంపీ కమిషనర్ బిహెచ్. అనీల్ కుమార్ మనవి చేశారు.

English summary
CORONAVIRUS: In Bengaluru city only 59 of the 14,910 quarantined have tested positive for a COVID - 19. Foreign returnees completed compulsory quarantine in city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X