చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

MLA wife: 16 ఏళ్లు పిల్లలు లేరు, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు పక్కనే కాన్పు, తల్లి, బిడ్డ, సీఎం

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: ఆమె పేరు శివశంకరి, శివశంకరికి 16 ఏళ్లుగా పిల్లలు లేరు. ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య. దేవుడు కరుణించడంతో లేకలేక గర్బవతి అయిన శివశంకరికి ఓ కోరిక పుట్టింది. తాను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకుని అక్కడే బిడ్డకు జన్మనివ్వాలని ఆమె గర్బవతి అయిన సమయంలోనే డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యే భార్య అనుకుంటే కార్పోరేట్ ఆసుపత్రిలోనే అన్ని సౌకర్యాలతో వైద్యం చేయించుకుని సవ్యంగా కాన్పు జరిగేలా చూసుకోవచ్చు. కాని శివశంకరి అలా చెయ్యలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డు పక్కనే చేరి చికిత్స చేయించుకుని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒక ఎమ్మెల్యే భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో, అది కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డు పక్కనే ధైర్యంగా మగబిడ్డకు జన్మనివ్వడంతో శివశంకరి నేడు దేశంలోని పలువుర రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు ఆదర్శంగా నిలిచారు. విషయం తెలుసుకున్న సీఎంతో పాటు మంత్రులు అమ్మా నువ్వు గ్రేట్ అంటున్నారు.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

 పొలికల్ లీడర్

పొలికల్ లీడర్

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని మనమదురై ప్రాంతానికి చెందిన ఎస్. నాగరాజన్ రాజకీయ నాయకుడు. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తగా, అమ్మ జయలలితకు వీరాభిమానిగా ఎస్. నాగరాజన్ నిత్యం ప్రజల్లో ఉండే వారు. సామాన్య ప్రజలతో కలిసి నాగరాజన్ అనేక సామాజిక కార్యక్రమాలు చేసేవారు. తాను రాజకీయ నాయకుడు అంటూ ఏ రోజు నాగరాజన్ బిల్డప్ చూపించలేదు.

 16 ఏళ్ల సంతానం లేదు

16 ఏళ్ల సంతానం లేదు

2003లో అన్నాడీఎంకే నాయకుడు నాగరాజన్ శివశంకరి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత శివశంకరి తనకు పిల్లలు పుట్టాలని కనించిన ప్రతి దేవుడిని మొక్కుకుంది. శివశంకరి అనేక పూజలు చేసింది. తమకు పిల్లలు పుట్టాలని నాగరాజన్, శివశంకరి దంపతులు అనేక దానధర్మాలు చేశారు.

 భారీ మెజారిటీతో ఎమ్మెల్యే

భారీ మెజారిటీతో ఎమ్మెల్యే

తమిళనాడులోని మనమదురై శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. జయలలితకు వీరాభిమాని అయిన ఎస్. నాగరాజన్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం రావడంతో ఆయన పోటీ చేశారు. మనమదురై నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్. నాగరాజన్ భారీ మెజారిటీతో డీఎంకే అభ్యర్థిపై ఘనవిజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.

 కాలం కలిసి వచ్చింది

కాలం కలిసి వచ్చింది

మనమదురై ఉప ఎన్నికల్లో పోటీ చేసిన నాగరాజన్ ఎమ్మెల్యే అయిన తరువాత ఆయనకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. పెళ్లి జరిగిన 16 ఏళ్ల తరువాత శివశంకరి గర్బవతి అయ్యారు. లేకలేక సంతానం కలుగుతోందని నాగరాజన్, శివశంకరి దంపతులు మురిసిపోయారు. ఇదే సమయంలో తన మనసులోని కోరికను శివశంకరి భర్త నాగరాజన్ కు చెప్పడంతో ఆయన షాక్ కు గురైనారు.

 కరోనా కాలంలో రిస్క్ అవసరమా ?

కరోనా కాలంలో రిస్క్ అవసరమా ?

తాను ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకుంటానని, తనకు ఆ అవకాశం కల్పించాలని భార్య శివశంకరి చెప్పడంతో ఎమ్మెల్యే నాగరాజన్ అయోమయంలో పడిపోయారు. తమిళనాడులో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. తమిళనాడులో కరోనా హాట్ స్పాట్ అయిన చెన్నై సిటీతో పోటీ పడుతూ మదురై, శివగంగై జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 16 ఏళ్ల తరువాత మనకు పిల్లలు పుడుతున్నారని, కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో ఇలాంటి రిస్క్ మనకు అవసరమా ? అని ఎమ్మెల్యే నాగరాజన్ భార్య శివశంకరికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

 సరే నీఇష్టం... దేవుడే ఉన్నాడు

సరే నీఇష్టం... దేవుడే ఉన్నాడు

ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవాలనే తన కోరిక తీర్చాలని శివశంకరి పట్టుబట్టింది. బంధువులు, కుటుంబ సభ్యులు శివశంకరిని కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలని సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినలేదు. ముతానందల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (చిన్న ప్రభుత్వ ఆసుపత్రి)లో శివశంకరికి ఇన్ని రోజులు వైద్యం చేయించారు. సామాన్య మహిళలు లాగే ఎమ్మెల్యే నాగరాజన్ భార్య శివశంకరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంది.

Recommended Video

Unlock 3.0 : రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత | Unlock 3.0 Guidelines ఇవే!! || Oneindia Telugu
 కరోనా వార్డు పక్కన..... అమ్మా నువ్వు గ్రేట్

కరోనా వార్డు పక్కన..... అమ్మా నువ్వు గ్రేట్

9 రోజుల క్రితం ఎమ్మెల్యే నాగరాజన్ ఆయన భార్య శివశంకరిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. శివశంకరి చికిత్స పొందుతున్న వార్డు పక్కనే కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. శివశంకరి ఎంతో ధైర్యంగా 9 రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శివశంకరి, ఆమె బిడ్డ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండటంతో ఎమ్మెల్యే నాగరాజన్, ఆయన అనుచరులు సంతోషంతో తల్లడిల్లిపోయారు. ఎమ్మెల్యే భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకుందని తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు శివశంకరి ధైర్యాన్ని మెచ్చుకుని అమ్మా నువ్వు గ్రేట్ అంటున్నారు. నేటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే నాగరాజన్ భార్య శివశంకరి ఆదర్శంగా నిలిచారని తమిళనాడులో రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకడు ఎమ్మెల్యే నాగరాజన్, శివశంకరి దంపతులను అభినందిస్తున్నారు.

English summary
Coronavirus: AIADMK MLA S. Nagarajan wife delivered baby at government hospital in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X