వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ఎయిమ్స్ వైద్యుడికి వైరస్, 9 నెలల గర్భవతి భార్యకు కూడా, ఐసోలేషన్‌లో...

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్నాయి. రోగులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు, సిబ్బందికి కూడా వైరస్ సోకుతోంది. ఇటీవల ఢిల్లీలో వైద్యులకు కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడు ఎయిమ్స్ వైద్యుడి వంతు వచ్చింది. అతనితోపాటు భార్య 9 నెలల గర్భవతికి కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.

ఎయిమ్స్‌లోని ఫిజియాలజీ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతని భార్యకు కూడా వైరస్ సోకింది. ఆమె 9 నెలల గర్భవతి కావడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యుడు, అతని భార్యకు వైరస్ సోకిందని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. సదరు వైద్యుడు రోగులకు చికిత్స అందించిన వారికి కూడా వైస్ సోకిందా అని భావిస్తున్నారు. కొందరినీ గుర్తించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. మరికొందరిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఎయిమ్స్ వైద్యుడు విదేశాలకు వెళ్లలేదని.. అతనికి ఎలా వైరస్ సోకిందో గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Coronavirus: AIIMS Doctor and His 9-Month Pregnant Wife Test Positive

Recommended Video

Sonia Gandhi:'Modi Has No Planning For Present Situation'

ఇటీవల సీఆర్పీఎఫ్ వైద్యుడికి కూడా కరోనా వైరస్ సోకింది. అతను ఢిల్లీలో గల క్యాంపులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వెంటనే అతనిని హర్యానా ఝాజ్జర్‌లో గల ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు ఢిల్లీలో గల సఫ్దార్ గంజ్ హాస్పిటల్‌లో ఇద్దరు రెసిడెంట్ వైద్యులకు కూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మరో రెసిడెంట్ వైద్యురాలు కూడా ఇటీవల వైరస్ బారినపడ్డారు. ఈ ముగ్గురు సప్తార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

English summary
A senior resident doctor of the All India Institute of Medical Sciences (AIIMS) in Delhi has tested positive for COVID-19, official sources confirm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X