బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కర్ణాటక సరిహద్దులు క్లోజ్, పరీక్షలు, ఎన్నికలు వాయిదా, బెంగళూరు, ఆంధ్రా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మదనపల్లె/ పలమనేరు: కరోనా వైరస్ మహ్మారిని (COVID-19) అరికట్టడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా 95 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంబిస్తున్న కరోనా వైరస్ (COVID-19)ను ఎదుర్కొనేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి కేసులు పెరిగిపోవడంతో వాటిని అరికట్టడానికి ఆ రాష్ట్ర సరిహద్దులు మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల సరిహద్దులు మూసివేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సరిహద్దుల్లో కర్ణాటక అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

Coronavirus: జనతా కర్ఫ్యూ, వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు అంటే బెండ్ తీస్తారు, జాగ్రత్త !Coronavirus: జనతా కర్ఫ్యూ, వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు అంటే బెండ్ తీస్తారు, జాగ్రత్త !

కేరళ, మహారాష్ట్ర దెబ్బ

కేరళ, మహారాష్ట్ర దెబ్బ

కేరళ, మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాధి కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కేరళ, మహారాష్ట్రల నుంచి కరోనా వైరస్ వ్యాధి కర్ణాటక ప్రజలకు వ్యాపించకుండా ఉండటానికి ఆ రాష్ట్రాల ప్రజలు మన రాష్ట్రంలోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ, మహారాష్ట్రల్లో కరోనా వైరస్ సోకిన రోగులు ఎక్కడ మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తారో ? అనే భయం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు.

సీఎం స్పష్టమైన ఆదేశాలు

సీఎం స్పష్టమైన ఆదేశాలు

కర్ణాటక సరిహద్దులు పూర్తిగా మూసివేస్తామని ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియా సమావేశంలో చెప్పారు. ఆదివారం సీఎం యడియూరప్ప చెప్పినట్లుగానే సోమవారం కర్ణాటక సరిహద్దులను అధికారులు మూసివేశారు. మాకు మా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. వ్యాపార లావాదేవీలు, ఇతర సంబంధాలు గురించి ఇప్పుడు ఆలోచించే సమయం లేదని అధికారులు అంటున్నారు.

ఎన్నికలు, పరీక్షలు వాయిదా

ఎన్నికలు, పరీక్షలు వాయిదా

కర్ణాటకలో మార్చి 27 నుంచి 10 తరగతి (SSLC) పరీక్షలు నిర్వహించడానికి ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా వైరస్ మహ్మరి దెబ్బకు పదో తరగతి పరీక్ష్లలు వాయిదా వేశారు. కరనా వైరస్ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న తరువాత 10 తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి ? అనే విషయం వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అదే విదంగా కర్ణాటకలోని అన్ని ఎన్నికలను ప్రస్తుతానికి వాయిదా వేశారు.

కరోనా కట్టడికి టాస్క్ ఫోర్స్

కరోనా కట్టడికి టాస్క్ ఫోర్స్

కరోనా వైరస్ (COVID-19)ను అరికట్టడానికి సీనియర్ మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఈ టాస్క్ ఫోర్స్ బృందాల నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

అన్ని విమానాల ప్రయాణికులకు పరీక్షలు

అన్ని విమానాల ప్రయాణికులకు పరీక్షలు

ఇప్పటికే అంతర్జాతీయ విమానాల ప్రయాణికులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ దెబ్బతో దేశంలోని అన్ని రాష్ట్రలకు సంచరించే విమానాల ప్రయాణికులు అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు)తో పాటు బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయం (మంగళూరు)తో పాటు కర్ణాటకలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని సీఎం బీఎస్. యడియూరప్ప కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
కరోనా కేసులకు వార్ రూమ్, 1, 700 పడకలు!

కరోనా కేసులకు వార్ రూమ్, 1, 700 పడకలు!

బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు పరీక్షలు నిర్వహించడానికి 1, 700 పడకలు, స్పెషల్ వార్డులు సిద్దంగా ఉన్నాయని సీఎం యడియూరప్ప అన్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి ఇప్పటికే బాలబృహి గెస్ట్ హౌస్ లో వార్ రూమ్ సిద్దం చేశారు. సీఎం బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో వార్ రూం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు కరోనా వైరస్ ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.

English summary
Coronavirus (COVID-19): Karnataka Chief Minister BS Yediyurappa have taken decision to close all Karnataka border till next order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X